Thursday, August 20, 2026

 *_మారవోయి భారతీయుడా_*
++++++++++++++++
* స్వాతంత్ర దినం..*
*వీరుల త్యాగఫలం!* 
*********************
జెండా...
ఎక్కడ చూసినా జెండానే..
ప్రతి ఒక్కరిలో 
వెల్లువెత్తిన ఉత్సాహం.. 
పెల్లుబికిన దేశభక్తి..

ఇళ్లపై..దుకాణాలపై..
విద్యాసంస్థలపై...
కార్యాలయాలపై..
త్రివర్ణ పతాకం రెపరెపలు..
చూడ ముచ్చట..
కన్నుల పండుగ..!

నీ గుండెపై..నా గుండెపై..
నీ బండిపై..నా బండిపై..
అందంగా జెండా..
అయితే కనీసం ఈరోజైనా
మారని నీ అజెండా..
జెండా పెట్టుకుని 
రాంగ్ సైడ్ లో ప్రయాణం..
మొబైల్ ఫోను 
మాటాడుతూ డ్రైవింగ్..
చికెన్ కొట్టు 
ముందు హాల్టింగ్..
నోటమ్మట అవే బూతులు..
అమ్మాయిలపై కామెంట్లు..
టీజింగులు..ర్యాగింగులు..
రోడ్డుపై జెండా పడున్నా
పట్టించుకోని నిర్లక్ష్యం..!

జెండా తగిలిస్తే 
వచ్చేస్తదా దేశభక్తి..
పౌరుడిగా నీ బాధ్యత..
ఈ రోజున నువ్వు గర్వంగా
ఎగరేస్తున్న జెండా..
దాని విలువ..
ఈ హక్కు కోసం 
జరిగిన పోరు..
మహామహుల త్యాగాలు..
సామాన్యుల బాధలు..
మొత్తం కథ తెలుసుకో..!

అంతేనా...
అక్కడ సరిహద్దులో
నీ కోసం..నా కోసం..
మనందరి రక్షణ కోసం 
రేయనక..పగలనక..
మండే ఎండలో..
వణికించే చలిలో..
గస్తీ తిరిగే జవాను
ప్రాణత్యాగానికి సైతం వెనకాడని 
అతడి తెగువ..
ఇవన్నీ నేటి నీ సంబరం...!
అక్కడ చేలో 
అన్నదాత పడే కష్టం..
మన బువ్వ కోసం 
అతడి వ్యవసాయం...
గనిలో..వనిలో..కార్ఖానాలో..
ఈ రోజున సైతం స్వేదం చిందించే కష్టజీవి..
నీ పండగలో అవే ముఖ్యపాత్రలు...
ఇక్కడ రోడ్డుపై 
నీ జైత్రయాత్రలు..!

నువ్వు పౌరుడివైనా
సైనికుడివే...
ఈ రోజైనా కాదు..
ఈ రోజు నుంచి
బాధ్యతగా..మంచిగా..
నువ్వుంటే దేశం ఉన్నట్టే..
అప్పుడు..అప్పుడే..
మేరా భారత్ మహాన్..!

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
      9948546286
      7995677286

No comments:

Post a Comment