17-08-2026.,
""పుణ్యలోకాలు చేరాలంటే పాపాలు చేయుట మానివేసి పరోపకార చింతనతో జీవించాలి.కానీ కొంతమంది దుష్టులుకూడ కొన్ని కారణాలవల్ల స్వర్గప్రవేశానికి అర్హత సాధిస్తారు"".
"" రామవిద్దా నిశిచరా బాణైర్మర్మసు తాడితాః,
రామమాసాదస్య సమరే సాయుజ్యపదవీం గతాః""
(స్కాంద పురాణము),
పాపకర్ములైన రాక్షసగణము సహితము సమరమున శ్రీరామచంద్రప్రభువు వేసిన శరములకు గురియై మరణించినచో వారు సాయుజ్యముక్తి ద్వార స్వర్గము చేరుతారు.అలా చేరిన వారిలో ముఖ్యులు విరాధుడు,ఖరుడు,మారీచాదులను పేర్కొనవచ్చును.అరణ్యకాండములో ఖరుడు నిహతుడైన సందర్భములో
"" సపాత ఖరో భూమౌ దహ్యమానః శరాగ్నినా,
రుద్రేణేవ వినిర్థగ్థః శ్వేతారణ్యే యథా~ంథకః||,(30-27),
శ్వేతారణ్యమున పరమశివుని కంటి మంటలకు అంథకాసురుడు భస్మమైనట్లు రాముని శరాగ్నికి ఖరాసురుడు దగ్థమై నేలకొరిగి తర్వాత రామకృపాకటాక్షాల వల్ల స్వర్గమసీమను అలంకరిస్తాడు.
""అంతకు మునుపే రామలక్ష్మణులను తన బాహువులతో బంధించగా సీతామాత భయపడి ఆర్తనాదములు చేస్తుంది అంత రాముని కోపాగ్నికి విరాథుడు గురియై ,
"" ఏవముక్త్వా తు కాకుత్థం విరాథః శరపీడితః,
బభూవ స్వర్గసంప్రాప్తో న్యస్తదేహో మహాబలః||,(అరణ్యకాం.04-21),
రాముని వల్ల తనకు శాప విముక్తి కానున్నదని గ్రహించిన విరాధుడు తన మరణరహస్యము చెప్పగా రాముడు ప్రయోగించిన బాణముల ధాటికి మహాబలశాలియైన విరాధుడు విలవిలలాడుచు దేహము వీడి స్వర్గస్థుడవుతాడు.
అలాగే కిష్కిందాకాండములో మహాబలశాలుయైన వాలి రాముని శరములవల్ల హతుడవుతాడు.
"" సుగ్రీవుని తో చెలిమి చేసి వాలి సుగ్రీవుల కు రణమునేర్పాటు చేసి తన శరములతో వాలిని తీవ్రముగ గాయపర్చగ వాలి తన కుమారునికి అవసానదశలో సుద్దులు చెప్పి,
"" ఇత్యుక్త్వాథ వివృత్తాక్షః శరసంపీడితో భృశం,
వివృతైర్థశనైర్భీమైః బభూవోత్క్రాంత జీవితః||,(33-23),
తన కుమారుడైన అంగదునికి జాగ్రత్తలు చెప్పి తన శరీరములో రాముడు నాటిన శరముల ధాటికి కలిగిన బాధకు విలవలలాడుచు కన్నులు మూసుకొని పోవుచుండగ భయంకరమైన దంతములు బైటికి తన్నుకు రాగా రామునికి నమస్కరించుచు అసువులు బాసి వీరస్వర్గము పొందెను.
ఈ విధముగ అనేక మంది పాపకర్ములైన రాక్షసాధములు రామలక్ష్మణుల శరముల ధాటికి ప్రాణములు కోల్పోయి స్వర్గథామము చేరిన వైనము రామాయణములో చాలా సంఘటనలు తెలియచేస్తున్నాయి.
రామునామ స్మరణతో, రామదర్శనముతో పాపములు ప్రక్షాళనమగుటయే కాక రామ బాణధాటికి మరణించినవారు కూడ స్వర్గము చేరగలగటము "రామ మహిమాన్విత" శక్తికి నిదర్శనము.
"రామ స్మరణమ్ ధన్యోపాయం"
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment