*_పుండరీకాక్ష.._*
*_సినిమా ఆయన కాంక్ష!_*
#################
*_నీ జీవితం మీద_*
*_నాకు విరక్తి కలుగుతోంది.._*
ఈ మాట
*కర్తవ్యం* సినిమాలో అన్నాడేమో గాని
ఆ పెద్దమనిషికి బైస్కోపంటే
వల్లమాలిన అనురక్తి..
*_ఎన్టీరామారావంటే_*
*_మహా పిచ్చి!_*
ఈ రెండే ఆయన్ను
సినిమా వైపు నడిపాయి..
వాటితోనే ఆయనయ్యాడు *ఎన్టీఆర్ సైన్యంలో వీరసిపాయి!!*
*_నేడే తెలిసింది.._*
*_ఈనాడే తెలిసింది.._*
*_కమ్మని పాటకు రూపం వస్తే_*
అది రఫీలాగే ఉంటుందని..
పుండరీకాక్షయ్యకు
రఫీ అంటే *ఆరాధన*..
అందుకే ఏరికోరి
ఆ మధురగాయకుడి నోట
*_గోపాల బాల నిన్నే కోరి.._*
ఆయన గళాన్ని
రెండు సినిమాల్లో
తెలుగు వారి
సన్నిధి చేర్చి..
అద్భుత గీతాలు పేర్చారు..!
తెనాలి రామకృష్ణ
తర్వాత ఎన్టీఆర్ కు మరోసారి
దేవరాయలు వేషం కట్టబెట్టి
*_తెలుగు వల్లభుండనుచు_*
రాజసంగా చూపెట్టి
గుమ్మడిని *తిమ్మరుసు* గా
నిలబెట్టి నాటి
*_రాయల కథను_*
*_నేటికిని తలపోయు రీతిగా_* తీసిన పుండరీకాక్షయ్య
నందమూరికి వరసకి బావ
ఎన్టీఆరే చూపించారు ఆయనకి
సినిమా త్రోవ..
అందుకే సమ్మోహనంగా
*శ్రీకృష్ణావతారం* తీసి
చేసుకున్నాడు
తన జన్మధన్యం
అలా తీర్చుకున్నాడు
*_నందమూరి రుణం..!_*
అఖిలాంధ్రకు అన్నని
*భలేతమ్ముడు* చేసి
_*నీ నామం వింటూ ఉంటే*_
*_నిలువెల్లా పులకించేను_*
*_నీ రూపం కంటూ ఉంటే నన్ను నేనే మరిచేను.._*
అంటూ నందమూరిని
*మనుషుల్లో దేవుడు* గా
కొలిచాడు..తరించాడు
ఈ అట్లూరి సినిమా
*పుండరీ"కాంక్ష"య్య..!*
_____________________
తెలుగు సినిమా పెద్దతలకాయల్లో
ఒకరైన పుండరీకాక్షయ్య
జయంతి
సందర్భంగా..
************************
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
7995666286
No comments:
Post a Comment