కర్ణుడి పై కన్నేసిన ద్రౌపది? | This Cinema Distorted Mahabharatam | Santosh Kumar Ghanapathi
Author Name:Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Youtube Channel Url:https://www.youtube.com/@hindudharmakshetram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vH_ZlLUjKe4
Transcript:
(00:00) ఓం సక్తుమివతిత ఉనాపునంతోయత్రీరామనసావాచమక్రత ఓం నమో గణపతయే ఈరోజున మనం మహాభారతం నుండి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రస్తావించుకోబోతున్నామండి తెలుగు సినిమాల్లో మీలో చాలామంది వరకు చూసే ఉంటారు ఒక ఘట్టం ఆ ఘట్టం నిజమే అన్నట్లుగా బాగా ప్రచారం అయిపోయినటువంటి ఘట్టం ఏమిటి ఆ ఘట్టము అనింటే కనుక పాండవులు ద్రౌపది కృష్ణ పరమాత్మ అరణ్యంలో ఒకచోట ఉంటారు.
(00:42) ఒక చెట్టు ఉంటుంది ఒక పండు ఉంటుంది ఆ పండు కింద పడిపోయి ఉంటుంది ఆ పండు చెట్టు పైకి వెళ్తూ ఉండడానికి వీళ్ళంతా కూడా కొన్ని రహస్యాలు బయట పెట్టాలి అని కృష్ణ పరమాత్మ చెప్పడం వాళ్ళంతా కూడా ఒకరు తర్వాత ఒకరుగా చెప్పి చివరగా ద్రౌపది చెప్పడం అది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ కథ ఏమిటో ముందుగా చెబుతానండి నేను పాండవులు అరణ్యవాసంలో ఉంటారు తెలుసు కదా మీకు 12 ఏళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఆ సందర్భంలో వీళ్ళు కన్వా కణవాశ్రమం చుట్టుపక్కలకు వెళ్తారండి కణవాశ్రమం దగ్గర ఒక నేరేడు పండు చెట్టు ఉంటుంది.
(01:18) అప్పటికి వీళ్ళకి ఆకలి వేయడం వల్ల ఆ నేరేడు పండు చెట్టుకు ఉన్నటువంటి ఒక పండు అది దివ్యంగా కనిపిస్తూ ఉంటుంది సాధారణ పండులాగా కాకుండా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పండుని అర్జునుడు తన బాణంతో కొట్టి కిందకి రాలేలాగా చేస్తాడు అది తిందాం అనుకుంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చూసి అయ్యో అర్జున ఎంత పని చేశవు నువ్వు ఈ పండు వెనక ఉన్నటువంటి కథ నీకు తెలియదు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి కన్మ మహర్షి పూర్తి కటిక ఉపవాసం చేస్తాడు 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒకే ఒక్క నేరేడు పండు తీసుకుంటాడు ఆ పండు ఇదే ఈ నేరేడు చెట్టుకి 12 సంవత్సరాల పాటు ఏ పళ్ళు లేకుండా 12
(02:00) సంవత్సరాలకు ఒకసారి ఈ పండు కాసేది ఈ కన్వ మహర్షి కోసమే అలాంటి ఈ పండుని మీరు కొట్టేశారు కింద పడితే ఆయన తినడు 12 సంవత్సరాల తపస్సుని ఆయన విరామం ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈ పండు తీసుకొని తిని మళ్ళీ వెళ్తాడు తపస్సుకి మళ్ళీ 12 సంవత్సరాలు చేస్తాడు ఈ పండుని మీరు ఇలా చేయడం వల్ల మరొక 12 ఏళ్ల పాటు ఆయనకు ఆహారం లేకుండా చేశారు.
(02:27) ఈ విషయం తెలిస్తే కనుక ఆయన మిమ్మల్ని శపిస్తాడు మీ యొక్క వంశం పూర్తిగా భస్మం అయిపోని అని చెప్పేసి శపించే అవకాశం ఉంది పాండవుల్ని ద్రౌపదిని అందరిని మొత్తం నాశనం అయపోతారు ఎంత పని చేశవు నువ్వు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మందలిస్తాడు. మందలించినప్పుడు పాండవులందరూ కూడా భయపడి ఈ ఆపద నుండి నువ్వే ఏ విధంగానైనా కాపాడాలి అని చెప్పేసి వేడుకుంటారు వేడుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెబతాడు అనింటే గనుక మీ ఆరుగురు కూడా మీ మీ మనసుల్లో ఉన్నటువంటి ఒక్కొక్క విషయం ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పనటువంటి ఒక రహస్యం మీరు దాచుకున్నటువంటి ఒక సత్యం ఇప్పుడు ప్రకటించినట్లయితే కనుక నేల మీద
(03:08) పడిపోయినటువంటి ఈ నేరేడు పండు మళ్ళీ వెళ్లి చెట్టుకి అతుక్కు కుంటుంది అప్పుడు కర్ణ మహర్షి వచ్చి తింటాడు ఎవరికీ ఏ విపత్తు ఉండదు అని చెప్పగా ధర్మరాజుతో మొదలుపెట్టి ఒక్కొక్కరు కూడా ఆ యొక్క రహస్యాలను చెబుతూ ఉంటారు. ఆ యొక్క పండు చెట్టుకి దగ్గరగా వెళ్లి ఆగి ఉంటుంది. అప్పుడు ద్రౌపది వంత వస్తుంది ద్రౌపదిని చెప్పమని కృష్ణుడు చెబుతాడు.
(03:32) ద్రౌపది వచ్చి ఒకటి రెండు విషయాలు చెబుతుంది ఇవేవి కాదు నువ్వు దాస్తున్నావు ఇంకాను పండు అక్కడే ఉంది ఇంకా చెట్టుకి అతుక్కోలేదు అని చెప్పగా అప్పుడు ద్రౌపది చెప్తుంది ఏమని ఐదుగురు భర్తలు నాకు ఉన్నప్పటికీ కూడా కర్ణుని ఆరవ భర్తగా స్వీకరించాలి అని నా మనసులో భావన ఉన్నది లేదా ఒకప్పుడు కలిగింది అనేటటువంటి అంశాన్ని కృష్ణ పరమాత్మకి ఆవిడ చెప్పి చెప్పగానే ఆ పండు వెళ్లి చెట్టుకి అతుక్కుంటుందండి ఇది ఆ యొక్క యొక్క కథ అందులో మనకి ఆ సినిమాలో కావచ్చు కొన్ని ఉపన్యాసాల్లో కావచ్చు మనకు కనిపించేటటువంటి ఘట్టం అండి ఇది ఈ యొక్క ఘట్టం తెలుగు సినిమాల్లో ఉంది
(04:12) కన్నడ సినిమాల్లో కూడా మనకు కనిపిస్తుంది. అయితేనండి దారుణమైనటువంటి ఈ వృత్తాంతం దారుణమైనది దృష్టిలో పెట్టుకోండి ఇది అవ్వడానికి ఎంత మాత్రము అవకాశం లేదు అసత్యము కల్పితము ఇది మూలవ్యాస భారతంలో లేదు ఎవ్వరైనా సరే ఈ కథను సమర్ధించేవారు వ్యాస భారతంలో చూపించండి ఈ కథ ఉందా అని లేదు మరి ఎక్కడి నుండి వచ్చిందండి అని అంటే గనుక నా పరిశోధనలో తేలింది ఏమిటంటే కర్ణాటకలో కన్నడ వాళ్ళందరికీ కూడా ముఖ్యమైనటువంటి భారతంగా మనం ఏ విధంగా అయితే కవిత్రయం భారతాన్ని మనం గొప్పగా నిత్తిని పెట్టుకుంటామో ఆ విధంగా కర్ణాటకలో కుమారవ్యాస భారతము అని నిత్యన
(04:58) పెట్టుకుంటారండి ఆ యొక్క గద గదగ భారతం అని చెప్పేసి పేరు అనుకుంటాను. ఆ భారతంలో ఉందండి ఈ కథ. అందరూ కూడా ప్రాంతీయ భాషల్లోనూ ఇతర రకరకాల భాషల్లోనూ కూడా భారతాన్ని రచించాలి పునః రచించాలి అని అంటే వ్యాసభారతమే మూలమై ఉండాలి కదా మరి వ్యాసభారతంలో లేనటువంటి అంశాన్ని వీళ్ళు ఎలా రచిస్తారు చాలా ఆశ్చర్యకరం అండి. కానీ ఆ యొక్క గదుగ భారతం దాంట్లో ఇది ఉన్నట్లుగా కుమారవ్యాస భారతం అంటారు దాంట్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది.
(05:33) దాంతో పాటుగా ఇంకొక రెండు మూడు గుజరాతి మొదలైనటువంటి భారతాల్లో ఉన్నట్లుగా కూడా విన్నాను నేను అన్ని కూడా జానపద భారతాలు దృష్టిలో పెట్టుకోండి. యథాతథం కాదు మూలవ్యాస భారతంలో లేనిది వాళ్ళ భారతాల్లో వీళ్ళు చేర్చారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళు సొంతంగా చేర్చారా అండి అంటే అలా కూడా చెప్పలేం ఎక్కడో జానపదాల్లో సరదాగా చెప్పుకునేటటువంటి కథల్ని వాళ్ళు స్వీకరించి చేర్చి ఉండవచ్చు నేను రచించేటటువంటి గ్రంథంలో మరింత కొత్త విషయాలు ఉండాలి అని ఉద్దేశం ఉంటే కనుక అలా చేర్చిన వాళ్ళు అంతే తప్ప ఇది సత్యము అని కాదు వ్యాసుడు దర్శించనటువంటి ఒక
(06:16) వృత్తాంతము వ్యాసమహర్షి చెప్పనటువంటి ఒక వృత్తాంతము ఈ భారతాల్లో ఎక్కడి నుండి వస్తుందండి ఏమిటి ఆధారము పోనీ వేరే ఏ పురాణాన్నైనా వీళ్ళు ఆధారంగా వీళ్ళు చూపించే అవకాశం ఉందా లేదు పైగా మీరు చూస్తే కనుక బౌద్ధ జాతక కథలని మొదలైనటువంటి కొన్ని పుస్తకాలు ఉంటాయి సనాతన ధర్మం మీద దాడి చేసే పుస్తకాలు అందులో నుండి కూడా కొన్ని కథలు తీసేసుకుంటారు అవి నిజం అని చెప్పేసి అన్నట్లుగానే ప్రచారం చేసేస్తారు అంటే సనాతన ధర్మానికి హాని చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది రచించినటువంటి పుస్తకాల నుండి తీసుకున్న కథలు కూడా సత్యాలు అన్నట్లుగా ప్రచారం చేసేస్తూ
(06:52) ఉంటారు సినిమాల్లో జోడం చేస్తూ ఉంటారు చాలా తప్పండి ఈ కథ ఎక్కడా కూడా వ్యాసభారతంలో లేదు ఉండే అవకాశం లేదు అనడానికి నేను మీకు కొన్ని ఆధారాలు చెబతాను ద్రౌపది స్వయంవరం అండి ద్రౌపది స్వయంవరం సందర్భంలో కర్ణుడు కూడా వచ్చి ఆ యొక్క మతస్య యంత్రాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు అవునా కాదా అప్పుడు కర్ణుడు ప్రయత్నమే చేయకూడదు నేను కర్ణుని నేను పరిణయం ఆడను అని చెప్పేసి ద్రౌపది ప్రకటిస్తు నేరుగా అలా ప్రకటించడం వల్ల కర్ణుడు పోటీ నుండి తప్పుకుంటాడు.
(07:28) ఆ విధంగా మొట్టమొదటిసారి కర్ణుని తిరస్కరించింది ద్రౌపదీ దేవి అయిపోయిందా మళ్ళీ ద్రౌపది పరాభవం వస్త్రాపహరణం సందర్భంలో కర్ణుడు ద్రౌపదిని ఉద్దేశించి చాలా నీచంగా మాట్లాడుతాడు. వేష్య అనే పదాన్ని వాడతాడు. రకరకాలుగా ద్రౌపది దేవిని అవమానిస్తాడు. ద్రౌపది వస్త్రాన్ని లాగమని సలహా ఇచ్చింది కర్ణుడే ఈ విధంగా కర్ణుడి వల్ల ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది ఘోరమైనటువంటి అవమానాలు జరిగాయి.
(07:57) ఈ అవమానం తర్వాతే ద్రౌపది వస్త్రాపహరణం తర్వాతే వీళ్ళు వనవాసంకి వెళ్ళింది. ఈ అవమానాన్ని మర్చిపోయి ద్రౌపది ఆ మాట ఎందుకు చెబుతుందండి ఎంత విడ్డూరమో చూడండి అందువల్ల ఈ రెండు సందర్భాల్లోనూ కూడా కర్ణుడి మీద ద్రౌపదికి వ్యతిరేక భావన ఉన్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వయంవరంలో తిరస్కరించింది ఇక్కడేమో వస్త్రాపహరణ సమయంలో మొత్తం దోషే కర్ణుడు అలాంటి కర్ణుడిని భర్తగా నేను కోరుకున్నాను లేదా ఇష్టపడ్డాను అనే మాట అనే అవకాశం ఉంటుందా అండి అలాంటి కర్ణుడిని నేను ఇష్టపడ్డాను ఆరవ భర్తగా నేను ఆశించాను ఇలాంటి మాటలు అసలు ద్రౌపది వంటి ఒక మహాసాద్వి నోటిలో నుండి వచ్చే అవకాశం
(08:38) ఉంటుందా మనం ఒక శ్లోకం చాలా ప్రసిద్ధంగా చెప్పుకుంటూ ఉంటాం అహల్య ద్రౌపది సీత తారా మండో దరి తథ పంచకంయాస్మరేన్ నిత్యం అని చెప్పేసి ఈ ఐదుగురు పేర్లు స్మరించినంత మాత్రానే పాపాలు పోతాయి అంటే వాళ్ళు అందరూ కూడా సచ్చీలురే తప్ప వాళ్ళ చరిత్రలో ఎక్కడ కూడా దోషం లేదు అని చెప్పడం ఉద్దేశం వాళ్ళు మహా పతివ్రతలు అని మహా పతివ్రతులు అని చెప్పడం ఉద్దేశం అంటే వాళ్ళలో మనకు కనిపించేటటువంటి చిన్న చిన్న అంశాలు అవన్నీ కూడా పూర్తిగా సత్చరిత్రకు సంబంధించినవే తప్ప దుష్చరిత్ర కాదు అని చెప్పడం అలాంటి జాబితాలో ద్రౌపది ఉంది అహల్య ద్రౌపది సీత అన్నారు అలాంటప్పుడు
(09:19) ద్రౌపది దేవికి ఈ యొక్క మరక ఏ విధంగా అంటగడతారండి కావున ఆ సినిమాలో చూపించినటువంటి ఈ ఘట్టం కల్పితం అలాగని దర్శకుడు కల్పించాడుఅని చెప్పటం లేదు దర్శకుడు తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఏమిటి అంటే ఈ విధంగా కన్నడ కుమార వ్యాస భారతము గుజరాతులో ఉన్నటువంటి మరొక భారతం నుండి ఆయన తెచ్చుకున్నాడు సినిమా తీయడానికి ఒక కొత్త కథ మనకు దొరికింది కదా అని చెప్పేసి అంతే కదండీ సహజంగా సినిమా వాళ్ళు కొత్త కొత్తగా చెప్పాలను అనుకుంటారు ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఇది అబద్ధము అని తెలుసుకోండి.
(09:50) ఇది నిజం కాదు కల్పితము అని తెలుసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంత మాత్రమే కాదండి కృష్ణ పరమాత్మ కర్ణుడి వద్దకు వెళ్లి కురుక్షేత్ర యుద్ధానికి ముందు నువ్వు కనుక పాండవుల పక్షాన చేరితే నీకు ద్రౌపది నీకు కూడా భర్తగా ఉంటుంది అని చెప్పేసి కృష్ణుడు ఆఫర్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది దాంట్లో ఇది మరి ఎక్కడైనా వ్యాసభారతంలో ఉందా అనిఅంటే కనుక శష్టే కాలేతు సంప్రాప్తే ద్రౌపద్యుపగమిష్యతి అని ఉన్నటువంటి శ్లోకాన్ని ఈ విధంగా వక్రీకరించినట్లుగా మనక కనిపిస్తుంది ఆరవ కాలం వచ్చినప్పుడు ద్రౌపది కూడా నిన్ను సేవిస్తుంది అన్నట్లుగా అక్కడ అర్థం ఉందట
(10:30) సేవించడం అంటే ఏమిటండి సేవించడము అంటే మనమంతా కూడా ఆలోచిస్తున్నటువంటి బక్రపు ఆలోచనే ఇక్కడ శష్టే కాలేతు సంప్రాప్తే అని మనం చూసినప్పుడు రాత్రి కాలము రాత్రిపూట ద్రౌపది కూడా నీ వద్దకు వస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా భావించడమే పెద్ద విడ్డూరం అండి కవిత్రయ భారతంలో ఈ యొక్క భాగ భాగం తిక్కనగారు రాశారు రాసినప్పుడు వారు ఈ అర్థాన్నే రాశరట కాకపోతే తిక్కనగారే పొరబడ్డారు అని చెప్పేసి కొంతమంది పెద్దలు అన్నారండి ఇది నేను అనటం లేదు తిక్కనగారు పొరపడ్డారు అని చెప్పేంత స్థాయి నాకు లేదు కానీ పెద్ద పెద్ద పండితులు చాలామంది మాత్రం ఆ మాటే
(11:11) అన్నారు తప్పేముంది కలియుగంలో పుట్టినటువంటి కవుల్లో ఎవరైనా పొరబడవచ్చు పొరబడడము పొరబడ్డారు అని మనం చెప్పడం ఎక్కడా కూడా తప్పఅవ్వదు ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు శష్టే కాలేతు సంప్రాప్తే అన్నప్పుడు మనం పగటి రోజును ఆరు భాగాలుగా తీసుకుంటే గనుక ప్రాతఃకాలము తర్వాత సంగమ కాలము మధ్యాహ్న కాలము అపరాణ కాలము సాయంకాలము ఆ తరువాత వచ్చేటటువంటిది ప్రదోష కాలము ప్రదోష కాలంలో ద్రౌపది ఉపగమిష్యతి అన్నారు ఉపగమిష్యతి అని ఇక్కడ ఉన్నటువంటి పదం ద్వారా మనక ఏం అర్థం అవుతున్నది అనింటే కనుక ఒక సేవకురాలు చేసే ేటటువంటి సేవలు చేస్తుంది అని అర్థం అక్కడ సేవకురాలు ఏ
(11:56) విధంగా అయితే రాచ కన్యలు రాజుగారి వద్దకు వచ్చి చత్ర చామరాలు వీచడము వంటివి ఉంటాయి చూసారా ఆ విధంగా సేవ చేస్తుంది అని అర్థం ఇంతకాలము కూడా ద్రౌపది ఒక మహా సమ్రాజ్ఞ కదా అఖండమైనటువంటి భరత ఖండానికి సమ్రాజ్ఞ ఆమె అలాంటి సమ్రాజ్ని నీకు వచ్చి వింజామరలు వీస్తుందయ్యా నీకు సేవలు చేస్తుంది ఒక చక్రవర్తికి ఒక స్త్రీ సేవకురాలు ఏ విధంగా సేవలు చేస్తుంది ఉందో ఆ విధంగా సేవ చేస్తుంది.
(12:25) పాండవుల పట్టమహిషి నీకు సేవకురాలు అవుతుంది అంటే అప్పటివరకు కూడా కర్ణుడు ద్రౌపదిని ఒక మహా సామ్రాజ్ఞగా చూసి ఉంటాడండి ఒక పెద్ద సామ్రాజ్యానికి ఆవిడ మహారాణి ఆంగ్లంలో చెప్పాలంటే ఒక పెద్ద ఎంపైర్ కి ఆవిడ ఒక క్వీన్ ఓన్లీ వన్ అన్నమాట అండి అలాంటి మహారాణి వచ్చి నీకు విసనకర్ర వీస్తుందయ్యా అన్నట్లుగా చెప్పాడు ఆయన ఆ భాషలోనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే ఇంకా అనేక కారణాలుండి అక్కడ మనం చూసుకుంటే కురుక్షేత్ర యుద్ధం సమయం నికి ద్రౌపది వయస్సు కనీసం 90 ఏళ్ళ ఉంటుందండి 90 ఏళ్ళ ఉంటుంది పైగా మరొక అంశం ఏమిటంటే అప్పటికే ద్రౌపది దేవికి సంతానాన్ని కనేటటువంటి
(13:05) అవకాశం పోయింది ఎందుకు పోయింది అంటే కనుక కురుక్షేత్ర యుద్ధంలో ఉపపాండవులందరూ మరణించారు. శక్తి ఉంటే కనుక కురుక్షేత్ర యుద్ధం అయ్యాక మళ్ళీ సంతానాన్ని కనవచ్చు కదా కనలేదు కదా అంటే కనేటటువంటి అవకాశం లేదు ద్రౌపది దేవి అప్పటికే మెనోపాజ్య దశ దాటిపోయింది అని అర్థమవుతున్నది లేదా అలాంటి అవకాశం నుండి వెళ్ళిపోయింది పెద్దావిడ అయిపోయింది వృద్ధనారి అనే చెప్పాలి లేకపోతే నాటి రోజుల్లో వాళ్ళ నియమాలు వాతావరణము వీటన్నింటి వల్ల కూడా మధ్య వయస్సో లేకపోతే వార్ధక్యంలో కూడా శక్తిమంతంగా కనిపించి ఉండవచ్చు అర్జునుడు ధర్మరాజు మొదలైన వాళ్ళు పరాక్రమంతో యుద్ధం
(13:42) చేయగలిగారు అంటే ఆ స్థాయిలో ద్రౌపది ఉండి ఉండవచ్చు కాకపోతే కర్ణుడు కోరుకునేంత ఒక నారిగా అప్పుడు ఉండే అవకాశం కూడా లేదు అలాంటి ఆవిడని తీసుకొని వచ్చి నీకు ఈవిని నేను ఇస్తాను లేకపోతే నీకు అవకాశం ఉంటుందని కృష్ణుడు ఎందుకు చెప్తాడుఅంటే పరమాత్మ అసలు అలాంటి మాటలు ఎందుకు అంటాడు కావునా అండి ఈ మాట కూడా మనం పెద్దవాళ్ళు చెప్పినటువంటిది ఇది నేను చెప్పినటువంటిది కాదు గరికపాటి వారు ఒక ఉపన్యాసంలో విన్నాను నేను ఆయన కూడా ఒక గుజరాతీ వ్యాఖ్యానంలో చూసాను నేను గుజరాతీ వ్యాఖ్యానంలో ఈ అర్థం ఉన్నది షష్టేకాలే అంటే ప్రదోష కాలంలో సాధారణంగా
(14:18) చక్రవర్తులకు చేసేటటువంటి చత్ర చామరాల కాలం అది ఆ కాలంలో నీకు వచ్చి సేవలు చేస్తుంది రాజాధిరాజాజ ప్రసక్ష్య సాహినే అన్నప్పుడు నీకు చత్ర చామరాలు ఏవోటి చేస్తుంది లేకపోతే పూలు జెలుతుంది అలాంటివి చెప్పాడు అంతటి సమ్రాగ్ని నీకు సేవకురాలు అయిపోతుందయ్యా అన్నాడు అంతే అంతకుమించి వేరే అవకాశమే లేదు దృష్టిలో పెట్టుకోండి అలాగే ఇందాక చెప్పినటువంటి కన్వాశ్రమ కథ మనక మనక ఎప్పుడూ కూడా అసత్యం ఏమిటో తెలియాలి ఆ అసత్యం ఎందుకు అసత్యమో చెప్పాలి సత్యం ఏమిటో చెప్పాలి దానికి హేతువులు కూడా మనం చెప్పుకోవాలి అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడో చెప్పగలిగాను అని
(14:53) భావిస్తున్నాను. ఈ అంశం పైన తప్పక మీ అభిప్రాయాలు తెలియజేయండి. ద్రౌపది దేవి ఎప్పుడూ కర్ణుడిని కోరుకోలేదు. కృష్ణ పరమాత్మ కర్ణుడికి ఎప్పుడూ కూడా ద్రౌపదీ దేవిని ఆఫర్ చేయలేదు అనే అంశాలు మనం ఖచ్చితంగా నమ్మాలి వాటికి హేతువులు కూడా మీకు ఎలా అనిపించాయో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి ఈ విషయం ఎక్కువమందికి తెలియాలనిపిస్తే తప్పక షేర్ చేయండి స్వస్తి
No comments:
Post a Comment