Thursday, August 20, 2026

Schopenhauer Dark Truth About Love & Breakups - Dark Telugu Philosophy

Schopenhauer Dark Truth About Love & Breakups - Dark Telugu Philosophy

Author Name:PhiloVi

Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bZWAd7jIH9Q



Transcript:
(00:07) మందు మత్తు కాదు సిగరెట్ మత్తు కాదు గంజాయి మత్తు కాదు నిజమైన మత్తు ఒక ఆడపిల్ల ప్రేమలో ఉంటుంది. షోపెన్ హౌర్ ప్రేమ గురించి ఒక మాట చెప్పాడు. ప్రేమ అనేది ప్రకృతి చేసే ఒక ట్రిక్ అన్నాడు ఒక్కసారి ఆలోచించు ఒక అమ్మాయి కళ్ళల్లోకి చూస్తే మనసు ఆగిపోతుంది. ఆ నవ్వు చూస్తే లోకమే మర్చిపోతావ్. ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది? షోపెన్ హౌర్ ప్రకారం అది నీ ఇష్టం కాదు అది జీవం ముందుకు సాగాలి అని ప్రకృతి పెట్టిన ఒక ఎరా నువ్వు అనుకుంటావు నేను ఈమెను ప్రేమిస్తున్నాను అని కానీ నిజానికి జీవం నిన్ను వాడుకుంటుంది తర్వాతి తరం కోసం అందుకే
(00:42) ప్రేమలో ఉన్నప్పుడు లాజిక్ పనిచేయదు. స్నేహితులు ఎంత చెప్పినా వినిపించదు. కుటుంబం వాదించినా ఆగవు ఎందుకంటే బుద్ధి ఓడిపోయి ఆ గుడ్డి శక్తి గెలుస్తుంది. ఇక్కడే షోపెన్హౌర్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏ సంతోషం అయితే బయట ఉన్న ఒక వస్తువు మీద ఆధారపడి ఉంటుందో ఆ సంతోషం శాశ్వతం కాదు ఎందుకంటే ఆ వస్తువు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే దాంతో పాటు మన సంతోషం కూడా వెళ్ళిపోతుంది.
(01:10) ఇక్కడ ఆ వస్తువు ఒక మనిషి అయింది. బ్రేకప్ అయితే మనిషి కుప్పకూలిపోతాడు. తినడం మానేస్తాడు. నిద్రపోడు గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తాడు. అందరూ అనుకుంటారు ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఇతను ఇలా ఏడుస్తున్నాడు అని కానీ షోపెన్హోర్ చెప్పేది ఇంకా లోతైన విషయం అతను ఏడుస్తున్నది ఆమె కోసం కాదు అతను ఏడుస్తున్నది తను ఊహించుకున్న జీవితం ఇక జరగదు అనే బాధతో మనం ఒక మనిషిని ప్రేమించము ఆ మనిషితో కలిసి మనసులో కట్టుకున్న కలను ప్రేమిస్తాము రేపు ఆమెతో కలిసి ఉండటం పెళ్లి చేసుకోవడం పిల్లలను కనడం ముసలితనంలో కూడా కలిసి ఉండటం ఇలా ఒక మొత్తం జీవి జీవితాన్ని మనసులో ముందే ఊహించుకుంటాం. బ్రేకప్ అయినప్పుడు ఆమె
(01:53) ఒక్కరే పోదు. ఆమెతో కలిసి ఊహించుకున్న ఆ జీవితం కూడా చచ్చిపోతుంది. అందుకే బాధ ఇంత ఎక్కువగా ఉంటుంది. ఒక్క మనిషిని కోల్పోలేదు. ఒక భవిష్యత్తు మొత్తం కూలిపోయింది. షోపెన్హోర్ ఒక దారి చూపించాడు. ఆ దారి పేరు ఆస్కెటిసిజం సింపుల్ గా చెప్పాలంటే కోరికను తగ్గించుకోవడం. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి.
(02:15) ప్రేమించొద్దు అని అతను చెప్పడం లేదు. ఒక మనిషి మీద నీ మొత్తం సంతోషం పెట్టొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఏ మనిషి అయినా శాశ్వతం కాదు. మనసు మారొచ్చు పరిస్థితులు మారొచ్చు ప్రాణం కూడా పోవచ్చు బయటి దాని మీద కట్టిన సంతోషం ఎప్పుడైనా కూలిపోతుంది. లోపల కట్టుకున్న శాంతి ఎప్పుడూ కూలదు. షోపెన్ హౌర్ చెప్పిన మాటను ఒక్క మాటలో చెప్పాలంటే బయటి మనిషి మీద కట్టిన సంతోషం ఎప్పుడూ అప్పు లాంటిది.
(02:38) ఏదో ఒక రోజు వాపస్ ఇవ్వాల్సిందే.

No comments:

Post a Comment