Thursday, August 20, 2026

 *_మానవుడే మహనీయుడు!_*

______________________

_మానవతా దినోత్సవం_
✒️✒️✒️✒️✒️✒️✒️

మానవతకు ఓ రోజేంటి..
అది నీ నైజం..
మనిషి ఇజం..
నిన్ను నిన్నుగా 
నిలబెట్టే లక్షణం..
కోటానుకోట్ల జీవరాశులున్న
సృష్టిలో మనిషికి మాత్రమే
అబ్బిన సలక్షణం..
అందుకే అతడయ్యాడు 
అంత విలక్షణం..!

మానవత..
మనిషే లేనినాడు 
ఎక్కడిది ఈ పదం..
మానవతే మనిషి పధం..
అదే అతడి ధర్మం..
మానవ జీవన మర్మం..
నిత్య ఆచరణీయ కర్మం!

అయితే ఇలాంటి
ఓ రోజు అవసరమే..
మనిషి తనలోని
మనీషిని మర్చిపోతున్న వేళ
మానవతకు దూరమై..
ఇహం మరచి...అహం పెరిగి
దుష్టచర్యలపై 
మోహం మితిమీరి
మానవుడే దానవుడౌతున్న
తరుణంలో 
నీలోని నిన్ను నిద్రలేపి..
నువ్వు మనిషివి సుమాని
గుర్తు చేసేందుకు ఈ దినం..
దీనినే పాటించాలి
నువ్వు అనుదినం..!

ఇక్కడ బోధలకు తావు లేదు
నేనూ మనిషినే..
ఆ తానులో ముక్కనే..
నువ్వెలా అయితే 
నేనూ అలాగే..
కొంచెం అటూ ఇటూ..
ఆటు పోటు..!

*_మానవతే విధమైతే_*
*_అదే మారని పథమైతే.._*
*_మానవుడే మహనీయుడు..!_*
_______________________

  _సురేష్ కుమార్ ఎలిశెట్టి_
        9948546286
        7995666286

No comments:

Post a Comment