*అనుబంధాల పండుగ*
భారతీయ సంస్కృతిలో పర్వదినాలు ఆచారాలు మాత్రమే కాదు, మనుషుల మధ్య
అనురాగాలను చిలకరించే అనుబంధాల కూడికలు. కాలప్రవాహంలో యుగాలు మారినా, భౌతిక దూరాలు పెరిగినా చెరిగిపోని నిశ్చల ప్రేమానుబంధానికి అభేద్యమైన హపమే నేటి శ్రావణ పౌర్ణమి. సోదరి కట్టే రక్షాసూత్రం కేవలం రంగురంగుల దారం కాదు, అది మాతృత్వపు అనురాగాన్ని, సౌభ్రాత్రపు అభయాన్ని పెనవేసే దివ్యమంత్రం! 'ఏ ధర్మాన్నైతే మనం నిష్ఠతో రక్షిస్తామో, ఆ ధర్మమే మనకు కొండంత రక్షాకవచమై లుస్తుంది' అనేది వేదవాక్కు రక్షాబంధనంలో అంతర్లీనంగా ఉన్న 'రక్షణ' అనే లావనకు అర్ధం కేవలం ఆస్త్రశస్త్రాలతో చేసే పోరాటం కాదు. విపత్తులు ఎదురైనప్పుడు చేయూతగా నిలవడం, నిరాశా నిస్పృహల్లో మునిగిన వేళ ఆశాదీపికను వెలిగించడం, వివేకం లోపించిన వేళ మార్గదర్శకత్వం చూపడం కూడా ధర్మబద్ధమైన రక్షణే! రక్తసంబంధాలకు అతీతంగా పరస్పర శ్రేయస్సును కాంక్షించడమే ఈ పర్వదిన పర మార్థం. మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల బంధం దీనికి ఉత్తమ నిదర్శనం. శ్రీకృష్ణ నగవానుడి చేతికి గాయమై రక్తం చిందిన తరుణంలో, ద్రౌపది ఏమాత్రం సంశయించ కుండా తన చీర అంచులు చించి ఆయన వేలికి కడుతుంది. ఆత్మీయతానురాగాలు, భక్తి ప్రపత్తులు నిండిన ఆ తక్షణ స్పందన జగన్నాథుడి హృదయాన్ని తాకుతుంది. తదనంతరం కౌరవసభలో ఆమె ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినప్పుడు, అనంత వస్త్రాలను ప్రసాదించి అభయప్రదాతగా నిలిచాడు.
దానవేంద్రుడైన బలిచక్రవర్తికి, జగన్మాత శ్రీమహాలక్ష్మికి మధ్య సాగిన రక్షాబంధనం మహిమను వృత్తాంతం చాటుతుంది. వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణచి వేసిన తర్వాత ఆయన నగర ద్వారానికి కావలి కాస్తా నంటూ వరమిస్తాడు శ్రీహరి. అలా అక్కడే ఉండి పోయిన భర్త కోసం మహాలక్ష్మి సామాన్య స్త్రీ రూపంలో వచ్చి బలి చేతికి రక్షాసూత్రాన్ని కడుతుంది.
ఆ పవిత్ర బంధానికి సంతోషించిన బలి, ఆమెను జసోదరిగా భావించి, తాను ప్రాణప్రదంగా పూజించే శ్రీహరిని ఆమెకు తిరిగిచ్చేశాడు.
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే మా చల మా చల
రక్షాబంధన సమయంలో పఠించే ఈ వేదమంత్రం హృదయాంతరాళాలకు వ్యాపించి అనురాగపూర్వకమైన బంధంగా పరిణమిస్తుంది... తోబుట్టువులకు అక్షయమైన లాన్ని చేకూరుస్తుంది. ప్రతి సోదరుడు తన తోబుట్టువుతోపాటు సమాజంలోని మస్త స్త్రీమూర్తులను జగన్మాత స్వరూపాలుగా గౌరవించి రక్షణగా నిలిచినప్పుడే ఈ ండుగకు సార్థకత చేకూరుతుంది. అప్పుడే జీవితాలు అనుబంధాల పూదోటగా రాజిల్లుతాయి. ఈ సంగతిని గుర్తించిన గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ బెంగాల్ భజనకు నిరసనగా ప్రజల మధ్య ఐక్యతను పెంచడానికి ఒకరికొకరు రక్షాబంధన్ ట్టుకోవాలని పిలుపిచ్చిన సంగతి తెలిసిందే.
సోదరుడికి రాఖీ కడుతూ సోదరి వేనే ముడి ఇరువురికీ ఒక మాట చెబుతుంది. ఈ బంధాన్ని కళ్లతో కాదు, మనసుతో చూసి పదిలంగా సుస్థిర పరచుకోమనీ! ష్టసుఖాలలో ఒకరికొకరు అండగా నిలవాలనీ! ఆ అనుబంధాలను చిరస్థాయిగా లుపుతూ, నిశ్చల ఆత్మీయతకు సజీవ ప్రతీకగా నిలిచేదే పరమ పవిత్రమైన క్షాబంధనం! అదే అసలైన నిర్వచనం!
No comments:
Post a Comment