Saturday, August 29, 2026

 **అస్తిత్వం!?**

మినుములు పుఃలింగం,!
పెసలు స్త్రీ లింగం!

మినుముల్ని రుబ్బితే దోశ, ఇడ్లీ, గారె, పునుకు.... ఇలా మినుముల అస్తిత్వం పోతుంది!

అదే పెసలు రుబ్బితేనా...!? పెసరట్టు, పెసరగారె, పెసరపుణుకులు, పెసరప్పడాలు .... ఎక్కడా పేరు చెడదు. స్త్రీల యాటిట్యూడ్ అలాటిది. కోడలుగా ఉన్నంతకాలం అత్తని చీల్చి చెండాడుతుంది. అత్తగా మారితే కోడల్ని కాల్చుకు తింటుంది?
(అబ్బ జనరల్‌గాలెద్దురూ.! అందరూ కాదు!)

రవ్వ కూడా స్త్రీయే గానీ తెలివైనదండోయ్. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ సాధించాలో అక్కడ తిష్ఠ వేస్తుంది. ఉప్మా అంటే రవ్వే కదా! అయినా సరే రవ్వ ఉప్మా అననివ్వదు. ఉప్మా ఎవరికోగానీ నచ్చదు కదా! అదీ సంగతి.
రవ్వట్టు, రవ్వకేసరి, రవ్వలడ్డు..
. ఇలా అందరికీ నచ్చే వాటికి నేనే నేనే అని చాటించుకుంటుంది.

ఆ బియ్యం ఉన్నాయి చూశారూ అవి పుఃలింగమే. అవి త్యాగశీలి అండీ. ఉడకగానే అన్నం,పసుపు కలిపితే పులిహోర,  విరగ్గొడితే నూకలు, ఉబ్బదీస్తే మురీలు/ముర్మురాలు/బొంగుపేలాలు, నలగ్గొడితే అటుకులు... పోనీ ఆ బియ్యప్పిండి ఉందా... దాంతో చేసేవి అరిసెలు, అప్పాలు, చక్కిలాలు, సర్వపిండి.... ఎక్కడా బియ్యం ఊసే ఉండదు. మగాడి తలరాత అంతేనండీ...

కనుక తలవంచుకుని సర్దుకుపోవాలని మగాడికి సలహా!

No comments:

Post a Comment