🛕🛕🛕🛕🛕🛕🛕
🛕 *రామాయణం*
*108 ప్రశ్నలు* – *జవాబులతో.* 🛕
🏹1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.
🔱2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.
🏹3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.
🔱4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
= 24,000.
🏹5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
= కుశ లవులు.
🔱6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
= సరయూ నది.
🏹7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
= కోసల రాజ్యం.
🔱8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
= సుమంత్రుడు.
🏹9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
= కౌసల్య, సుమిత్ర, కైకేయి.
🔱10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
= పుత్రకామేష్ఠి.
🏹11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.
🔱12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
= జాంబవంతుడు.
🏹13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.
🔱14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
= హనుమంతుడు.
🏹15. కౌసల్య కుమారుని పేరేమిటి?
శ్రీరాముడు.
🔱16. భరతుని తల్లి పేరేమిటి?
= కైకేయి.
🏹17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
= లక్ష్మణ,శత్రుఘ్నులు. (తల్లి సుమిత్ర.)
🔱18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
= వసిష్ఠుడు.
🏹19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.
🔱20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
= మారీచ, సుబాహులు.
🏹21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
= బల-అతిబల.
🔱22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
= సిద్ధాశ్రమం.
🏹23. తాటక భర్త పేరేమిటి?
= సుందుడు.
🔱24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
= అగస్త్యుడు.
🏹25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
= భగీరథుడు.
🔱26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
= జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.
🏹27. అహల్య భర్త ఎవరు?
= గౌతమ మహర్షి.
🔱28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
= శతానందుడు.
🏹29. సీత ఎవరికి జన్మించెను?
= నాగటి చాలున జనకునికి దొరికెను.
🔱30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
= దేవరాతుడు.
🏹31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
= విశ్వకర్మ.
🔱32. భరత, శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి,
శృతకీర్తి.
🏹33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
= జనకుడు.
🔱34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
= కుశధ్వజుడు.
🏹35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
= వైష్ణవ ధనుస్సు.
🔱36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
= యధాజిత్తు.
🏹37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
= మంధర.
🔱38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
= గిరివ్రజపురం, మేనమామ యింట.
🏹39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
= శృంగిబేరపురం.
🔱40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
= గారచెట్టు.
🏹41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
= భారద్వాజ ముని.
🔱42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
= మాల్యవతీ.
🔱43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
= తైల ద్రోణములో.
🏹44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
= జాబాలి.
🔱45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
= నంది గ్రామము.
🏹46. అత్రిమహాముని భార్య ఎవరు?
= అనసూయ.
(ANASOOYA = Without ASOOYA.
SHE IS A GREAT LADY.
PRAYS / CHANTS ALWAYS
" OM PATHI DEVAAYA NAMAHA".
By Her Paathivrathya Mahima, She Pleased The Three Murthis Namely
Brahma,
Vishnu, & MAHESWARA
and WasBlessed With a Son Namely
DHATTHATHREYUDU.)
🔱47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
= విరాధుడు.
🏹48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
= అగస్త్యుడు.
🔱49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
= గోదావరి.
🏹50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
= శూర్ఫణఖ.
🔱51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
= జనస్థానము.
🏹52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
= మారీచుడు.
🔱53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
= బంగారులేడి.
🏹54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
= జటాయువు.
🔱55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
= దక్షిణపు దిక్కు.
🏹56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
= కబంధుని.
🔱57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.
🏹58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
= ఋష్యమూక పర్వతం.
🔱59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
= హనుమంతుడు.
🏹60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
= అగ్ని సాక్షిగా.
🔱61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
= కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.
🏹62. సుగ్రీవుని భార్య పేరు?
= రుమ.
🔱63. వాలి భార్యపేరు?
= తార.
🏹64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
= కిష్కింధ.
🔱65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
= మాయావి.
🏹66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
= దుందుభి.
🔱67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
= మతంగముని.
🏹68. వాలి కుమారుని పేరేమిటి?
= అంగదుడు.
🔱69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
= 7 ఏడు.
🏹70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
= ప్రసవణగిరి.
🔱71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
= వినతుడు.
🏹72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
= అంగదుడు.
🔱73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
= మామగారు, (తార తండ్రి)
🏹74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
= శతబలుడు.
🔱75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
= మాసం (ఒక నెల).
🏹76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
= దక్షిణ దిక్కు.
🔱77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
= తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.
🏹78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
= స్వయంప్రభ.
🔱79. సముద్రమవతల వున్న రావణునిని,
సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన
పక్షి పేరేమిటి?
= సంపాతి.
🏹80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
= పుంజికస్థల.
🔱81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
= మహేంద్రపర్వతము.
🏹82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
= మైనాకుడు.
🔱83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
= సురస.
🏹84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
= సింహిక.
🔱85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
= నూరు యోజనములు=1600 Kms.
(1 YOJANA@ AAMADA= 10 MILES.
1 Mile= 1.6 Km.
100×10×1.6=1600 Kms.)
🏹86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
= లంబ పర్వతం.
🔱87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
= అశోక వనం.
(ASHOKA VANAM=
NO SOKAM IN THAT VANAM.)
🏹88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
= 12
🔱89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
= త్రిజట.
🏹90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
= రామ కథ.
🔱91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
= చూడామణి.
🏹92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=80,000
ఎనభై వేలమంది.
🔱93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
= ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.
🏹94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
= విభీషణుడు.
🔱95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
= మధువనం.
🏹96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
= మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.
🔱97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
= ఆలింగన సౌభాగ్యం.
(RAMA ALSO SAID TO HANUMAN THAT " YOU ARE EQUAL TO MY BROTHER BHARATHA")
🏹98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
= నీలుడు.
🔱99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
= నికుంభిల.
🏹100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
= అగస్త్యుడు.
🔱101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
= ఇంద్రుడు.
🏹102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
= మాతలి.
🔱103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
= కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
🏹104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
= హనుమంతుడు.
🔱105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
= శత్రుంజయం.
🏹106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
= స్వయంగా తన భవనమునే యిచ్చెను.
🔱107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
= బ్రహ్మ.
🏹108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
= తన మెడలోని ముత్యాలహారం.
🚩🚩జై శ్రీ రామ్ 🚩🚩. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment