Sunday, October 18, 2026

 [10/16, 06:17] +91 94924 83092: విధి రాసిన ప్రతి పేజీ మనకు నచ్చకపోవచ్చు…
జీవితం మనం కోరుకున్నట్టుగా ఎప్పుడూ సాగదు.
కొన్ని రోజులు నవ్విస్తాయి… మరికొన్ని రోజులు కన్నీళ్లు పెట్టిస్తాయి.
మనసుకు ఎంతో దగ్గరైన వారినే దూరం చేస్తాయి.
ఎంతగా కోరుకున్నా తిరిగి రాని క్షణాలను, మారని పరిస్థితులను మన ముందుంచుతాయి.
కొన్నిసార్లు ఎవరినీ అడగలేని ప్రశ్నలు, ఎవరికీ చెప్పుకోలేని మౌనాలు గుండెను పిండేస్తాయి.
నమ్మిన బంధాలే నిశ్శబ్దంగా వీడిపోవచ్చు, ప్రాణంగా చూసుకున్న స్వప్నాలు కళ్లముందే కరిగిపోవచ్చు.
ఆకాశమంత ఆశలు నేలరాలినప్పుడు, అడుగు తీసి అడుగు వేయడం కూడా భారంగానే తోస్తుంది.
కానీ గుర్తుంచుకో… చీకటి ఎంత గాఢంగా ముసిరినా, వేకువ రాకను ఆపడం ఏ రాత్రికీ సాధ్యం కాదు.
అయినా జీవితం ఆగిపోదు…
మన అడుగులు మాత్రం ఆగకూడదు.
కాలం గాయాలను మాన్పకపోవచ్చు, కానీ వాటితో ఎలా నడవాలో తప్పక నేర్పిస్తుంది.
రాలిపోయిన ఆకులను చూసి చెట్టు ఏనాడూ చిగురించడం మానేయదు.
ఎగిసిపడే అలలు ఒడ్డును తాకి వెనక్కి తగ్గినంత మాత్రాన సముద్రం తన ఉనికిని కోల్పోదు.
మనమూ అంతే… విరిగిపడ్డ చోటే తిరిగి మొదలవ్వాలి, ఓడిపోయిన చోటే మళ్లీ బలంగా నిలబడాలి.
విధి మనకు ఏమి రాసిందో మన చేతుల్లో ఉండకపోవచ్చు.
కానీ ఆ రాతను ఎలా ఎదుర్కోవాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.
బాధను భరించి బలంగా నిలబడటం,
కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వుతో ముందుకు సాగడం,
కోల్పోయిన వాటిని తలుచుకుంటూనే మిగిలిన జీవితాన్ని అందంగా మలచుకోవడం అదే నిజమైన జీవితం.
ప్రతి ఓటమిలోనూ దాగి ఉన్న ఒక కొత్త పాఠాన్ని వెతుక్కోవాలి.
మనల్ని విడిచి వెళ్లిన వారిని భారమైన భారంతో కాక, మధురమైన జ్ఞాపకంగా గుండెల్లో దాచుకోవాలి.
చేజారిన నిన్నటి గురించి రోదిస్తూ, చేతిలో ఉన్న నేటి క్షణాన్ని చేతులారా జారవిడవకూడదు.
కాలం మనల్ని పరీక్షించవచ్చు… కానీ మన ఆత్మవిశ్వాసాన్ని ఏ తుఫానూ కదిలించలేదని మనకు మనమే నిరూపించుకోవాలి.
ఎందుకంటే…
మనకు దక్కిన జీవితాన్ని మార్చలేకపోయినా,
ఆ జీవితానికి మనం ఇచ్చే అర్థాన్ని మాత్రం తప్పక మార్చగలం.
నిన్నటి కన్నీరు జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు…
కానీ రేపటి చిరునవ్వు, ఆ నవ్వుల వెనుక ఉండే గెలుపు ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది.
అదే ఆశ అదే జీవితం అదే రేపటికి పునాది.
[10/16, 20:13] +91 94924 83092: రక్తం చుక్క చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే  మాట.

దానిని మూర్ఖుడు వాడిన తరువాత ఆలోచిస్తాడు. తెలివైనవాడు ఆలోచించి మాట్లాడతాడు.

             😊శుభరాత్రి 🙏🏻
[10/17, 05:09] +91 94924 83092: 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

`నేటి…`
 
 *ఆచార్య సద్బోధన:*
       ➖➖➖✍️```


 *సత్యాన్ని ఆచరించి జీవించడం సత్య ధర్మ వ్రతం అవుతుంది.

 *సమాజంలో ప్రతి మనిషి  తమ కోరికను నెరవేర్చుటకు ఎన్నో రకరకాల వ్రతాలను ఆచరిస్తారు.

*ఎన్ని వ్రతాలను ఆచరించి నప్పటికీ అన్నిటికంటే శ్రేష్ఠమైనది (సత్యాన్ని పలకటం) సత్య ధర్మ వ్రతం అవుతుంది.

*’సత్యం ధర్మం’  అనే వ్రతాన్ని ఆచరిస్తే మనిషి ఉద్ధరించబడతాడు.

*తదనుగుణంగా సమాజం ఉద్ధరించ బడుతుంది.

*అలాగే దేశం ఉద్ధరించ బడుతుంది.

*సమాజ శ్రేయస్సే సకల లోక శ్రేయస్సు!

*ఇంతకన్నా  వేరే నోములు, వ్రతాలు ఆచరించాల్సిన అవసరం లేదు.

*సత్యాన్ని పలకడం ఒకటే ధర్మం!

*దీనికి ఎటువంటి డబ్బులతో పని లేదు.✍️```
```
🕉️🙏```
.        *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
         🌷🙏🌷
 `🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
[10/17, 20:05] +91 94924 83092: రాత్రులు ప్రశాంతమైన మనసుతో నిద్రించే వాళ్ళు,
ఉదయమే చిరునవ్వుతో సంతోషంగా మేల్కొనే వాళ్ళు
ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు 
మరియు ఐశ్వర్యవంతులు.

            😊శుభరాత్రి 🙏🏻
[10/18, 05:47] +91 94924 83092: 🌸🌸🌸🌸🌸🌸
🙏 నేడు దుర్గాష్టమి 🙏
🌹🌹🌹🌹🌹🌹

దుర్గాష్టమి అనేది శరన్నవరాత్రులలో ఎనిమిదవ రోజు. ఈ రోజున దుర్గాదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దుష్టశక్తులపై అమ్మవారు సాధించిన విజయానికి, దైవశక్తి మహిమకు ఈ పండుగ ప్రతీకగా భావిస్తారు.

🌺 1. దుర్గాష్టమి ఎందుకు ప్రత్యేకమైనది?

1. దుర్గాదేవి శక్తి ఆరాధన

- ఈ రోజున అమ్మవారిని ఆదిశక్తి స్వరూపంగా పూజిస్తారు.
- ధైర్యం, శక్తి, విజయం, ధర్మరక్షణ కోసం ప్రార్థిస్తారు.
- జీవితంలోని కష్టాలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటారు.

2. మహిషాసురుడిపై విజయానికి సంబంధించిన ఆరాధన

పురాణాల ప్రకారం, మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి దేవతల శక్తులన్నీ కలిసి దుర్గాదేవి రూపంలో ఆవిర్భవించాయి. అమ్మవారు మహిషాసురుడితో యుద్ధం చేసి ధర్మాన్ని కాపాడింది. ఈ కథ దుర్గాదేవి పరాక్రమానికి ప్రతీక.

3. అష్టమి తిథి ప్రాముఖ్యత

- అష్టమి అంటే చంద్రపక్షంలో ఎనిమిదవ తిథి.
- దుర్గాదేవి ఆరాధనకు ఈ రోజు ప్రత్యేకమైనదిగా భావిస్తారు.
- భక్తులు ఉపవాసం, పూజలు, దుర్గా స్తోత్ర పారాయణం చేస్తారు.

🌼 2. దుర్గాష్టమి రోజున చేసే ప్రత్యేక పూజలు

🔸 దుర్గాదేవి పూజ

అమ్మవారికి పూలు, కుంకుమ, పసుపు, పండ్లు, నైవేద్యం సమర్పించి పూజిస్తారు.

🔸 కన్యాపూజ

కొన్ని సంప్రదాయాల్లో చిన్న బాలికలను దుర్గాదేవి స్వరూపాలుగా భావించి పూజిస్తారు. వారికి భోజనం పెట్టి, బహుమతులు లేదా వస్త్రాలు సమర్పిస్తారు.

🔸 ఆయుధ పూజ

కొన్ని ప్రాంతాల్లో ఆయుధాలు, పనిముట్లు, వృత్తికి సంబంధించిన పరికరాలను పూజిస్తారు. ఇది శక్తి, కర్తవ్యం, జీవనోపాధికి గౌరవాన్ని సూచిస్తుంది.

🔸 ఉపవాసం, పారాయణం

భక్తులు తమ ఆచారాలకు అనుగుణంగా ఉపవాసం చేసి, దుర్గా సప్తశతి లేదా ఇతర దేవీ స్తోత్రాలను పారాయణం చేస్తారు.

🙏 3. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గాష్టమి ప్రత్యేకత


దుర్గాష్టమి సందర్భంగా:

- అమ్మవారి ప్రత్యేక అలంకార దర్శనం భక్తులకు ప్రధాన ఆకర్షణ.
- ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించే సంప్రదాయం ఉంది.
- వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారు.

🌸 4. దుర్గాష్టమి రోజున ఏం కోరుకోవాలి?

భక్తులు సాధారణంగా అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తారు:

- కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.
- కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలి.
- ధైర్యం, మనోబలం కలగాలి.
- కష్టాలను అధిగమించే శక్తి లభించాలి.
- సమాజంలో ధర్మం, ఐకమత్యం పెరగాలి.

🪔 దుర్గాదేవి ప్రార్థన

సర్వమంగళ మాంగళ్యే
శివే సర్వార్థ సాధికే।
శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే॥

భావం: సర్వమంగళాలను ప్రసాదించే తల్లీ! సమస్త శుభాలను కలిగించే గౌరీదేవీ! మమ్మల్ని కాపాడి, మాకు శుభాలను ప్రసాదించు.

🙏 శ్రీ కనకదుర్గమ్మ వారి అనుగ్రహంతో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని కోరుకుందాం.

జై కనకదుర్గమ్మ! 🌺
[10/18, 06:18] +91 94924 83092: దసరా వేడుకల సందర్భంలో వివిధ రకాల వేషాలు (దేవుళ్లు, రాక్షసులు, జంతువుల రూపాలు) వేయడం అనేది మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం మరియు కళారూపం. ఈ వేషాలు వేయడం వెనుక బలమైన పురాణ, సామాజిక మరియు సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. నవరాత్రులలో అమ్మవారు లోకకల్యాణం కోసం ధరించిన వివిధ అవతారాలను, అలాగే రామాయణ, మహాభారత ఘట్టాలను ప్రజల కళ్ళకు కట్టినట్లు చూపించడానికి ఈ వేషాలు వేస్తారు. సీతారాములు, హనుమంతుడు, శివుడు, నారదుడు వంటి వేషాల ద్వారా భక్తిభావం పెంపొందుతుంది. దసరా అంటేనే మహిషాసురుడు, రావణాసురుడు వంటి రాక్షసులపై దైవశక్తి సాధించిన విజయం. అమ్మవారి ఊరేగింపుల్లో ప్రధానంగా కనిపించే 'భేతాళ వేషాలు', కాళికా దేవి రూపాలు రాక్షస సంహారానికి, ఉగ్రరూపానికి మరియు దుష్టశిక్షణకు ప్రతీకలుగా నిలుస్తాయి.
పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జానపద కళాకారులు దసరా నవరాత్రులలో రకరకాల వేషాలు (ఉదాహరణకు: పులి వేషాలు, అర్ధనారీశ్వర వేషాలు) కట్టి ఇళ్ల ముందుకు వచ్చి తమ ప్రదర్శనలు ఇచ్చేవారు. దీనివల్ల ప్రజలకు వినోదం లభించడంతో పాటు, కళాకారులకు కానుకల రూపంలో జీవనోపాధి దొరికేది. చాలా ప్రాంతాలలో ప్రజలు తమకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా ఆరోగ్యం బాగాలేనప్పుడు "అమ్మవారి దయతో అంతా మంచి జరిగితే దసరాకు ఫలానా వేషం వేస్తాం" అని మొక్కుకుంటారు. అలా మొక్కుబడులు తీర్చుకోవడానికి కూడా దసరా వేషాలు ధరిస్తారు. పూర్వ కాలంలో రాజులు, పాలకుల కాలంలో సామాన్య ప్రజల సమస్యలను, వారి మనోభావాలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లడానికి, రహస్య సమాచారాన్ని చేరవేయడానికి ఈ పగటి వేషాలు ఒక సాధనంగా ఉపయోగపడేవని ప్రతీతి. ఈ ప్రదర్శనలు కేవలం పగటిపూట సహజ సిద్ధమైన సూర్యకాంతిలోనే (ఎటువంటి స్టేజీలు, లైటింగ్‌లు లేకుండా) వీధుల్లో తిరుగుతూ ప్రదర్శిస్తారు కాబట్టి వీటికి పగటి వేషాలు అనే పేరు వచ్చింది. ప్రారంభంలో ఇది కేవలం కొన్ని కులాల వారికి జీవనాధారమైన భిక్షుక వృత్తిగా ఉండేది. కాలక్రమేణా ఇది అద్భుతమైన నటన, వేషధారణలతో కూడిన ఒక గొప్ప జానపద కళారూపంగా రూపాంతరం చెందింది. దసరా నవరాత్రులలో ఈ కళాకారులు (పగటి భాగవతులు) తొమ్మిది రోజుల పాటు రోజుకో వేషం కట్టి ఊరంతా తిరుగుతూ అలరిస్తారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మరియు మైసూరు (కర్ణాటక) వంటి ప్రాంతాలలో జరిగే దసరా ఉత్సవాల్లో ఈ వేషధారణల హడావిడి పండుగకు మరింత శోభను, ఉత్సాహాన్ని ఇస్తుంది.
దసరా వేషాల ముఖ్య విశేషాలు:
• కాలం: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి / విజయదశమి వరకు ఈ వేషాలను ధరించి కళాకారులు ఊరూరా తిరుగుతారు.
• చరిత్ర: ఈ సంప్రదాయం శాతవాహన కాలం నాటి నుంచీ (హాలుని గాథాసప్తశతిలో ప్రస్తావన) ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. కాకతీయుల కాలంలోనూ వీటికి ఆదరణ ఉండేది.
• ఉద్దేశం: కేవలం వినోదం మాత్రమే కాకుండా, సామాజిక అంశాలను తెలియజేయడానికి, రాజుల దృష్టికి లేదా ప్రజల దృష్టికి సమస్యలను హాస్యపూరితంగా, వ్యంగ్యంగా తీసుకురావడానికి వీటిని ప్రదర్శించేవారు.
రకాలు - వేషాలు:
పురాణ సంబంధిత వేషాలు, కల్పిత పాత్రలు, హాస్య పాత్రలు వంటి రకాల్లో వేషాలు వేసుకుంటారు. ప్రధానంగా కనిపించే వేషాలు:
• అర్ధనారీశ్వరుడు
• దసరా పోలీసులు (కాపలా, హాస్యం కోసం)
• పిట్టల దొరలు
• బుడబుక్కల వారు
• కాళీ వేషాలు (ఉగ్ర రూపాలు)
• పులి వేషాలు / భగవంతుల వేషాలు (రాముడు, శివుడు, దుర్గాదేవి మొదలైనవి)
దసరా నవరాత్రులలో దుర్గాదేవి లోక కల్యాణం కోసం ఒక్కో రోజు ఒక్కో అవతారం (రూపం) ధరించి, తొమ్మిది రాత్రులు మహిషాసురుడితో పోరాడి విజయదశమి నాడు అతడిని వధించింది. అలాగే శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. అమ్మవారి ఊరేగింపుల్లో భక్తులు దేవుళ్ల, అమ్మవారి రౌద్ర రూపాల (భేతాళ) వేషాలు వేసి, ఆ రాక్షస సంహార ఘట్టాలను, దైవ లీలలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తారు. 
ప్రస్తుతం ఈ జానపద కళా రూపాలు గ్రామీణ ప్రాంతాల్లో క్రమంగా కనుమరుగవుతున్నాయి, అయినప్పటికీ నంద్యాల, శ్రీశైలం వంటి కొన్ని ప్రాంతాల్లో యువకులు మరియు కళాకారులు వీటిని ఉత్సాహంగా ప్రదర్శిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దసరా అంటే స్త్రీ .. పురుషులకు ఉల్లాసం.. పిల్లలకు ఆటవిడువు.  ఇలా పూర్వకాలంలో దసరా పండుగను జరుపుకునేవారు. కాలం చాలా మారింది.  ప్రస్తుతం హైటెక్ యుగంలో.. నేటి తరం వారు పండుగలంటే కేవలం హాలిడేస్ అనే విధంగా తయారైంది.  అయితే పూర్వ కాలంలో దసరా పండుగను ఎలా పండుగ చేసుకునేవారో ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది.  లేకపోతే.. సంప్రదాయాలు.. ఆచారాలు ఈ తరానికి తెలియడం లేదు.  పెద్దలకు గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది.
గతంలో స్కూల్ టీచర్ పిల్లలను వెంట పెట్టుకుని అయ్యవార్లు బయలుదేరేవారు .గ్రామంలో పెద్దల ఇళ్లకు వెళ్లి  మామూళ్లు స్వీకరించేవారు.  ఏ దయా మీ దయా మా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు పావలా అర్ధయితే పట్టేది లేదు ముప్పావులా అయితే ముట్టేది లేదు హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు’… అంటూ పద్యాలు పాడేవారు. ఇప్పటి మాదిరిగా అప్పుడు పేరెంట్ ... టీచర్స్ మీటింగ్లు ఉండేవి కావు.. ఆ ఏడాది ఆ సంవత్సరంలో నేర్పిన విద్యను దసరా సెలవుల్లో పెద్దల ముందు అయ్యవార్లు పిల్లల చేత ప్రదర్శింపచేసేవారు.  దీనిని ప్రాక్టికల్గా చూసిన తల్లి దండ్రులు.. గ్రామ పెద్దలు పిల్లల తెలివితేటలకు ముచ్చట పడేవారు.  ఎంతో నైపుణ్యం ఉండి.. పై చదువులు చదవించలేని తల్లి దండ్రులను గ్రామ పెద్దలు భరోసా కూడా కల్పించేందుకు విద్యార్థుల సత్తా తెలిసేది. ధర్మమే గెలుస్తుందని నిరూపించడమే ఈ దసరా వేషాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
హిందువుల పండుగల్లో  ప్రతి పండుగ ఏదో ఒక ప్రాముఖ్యతను కలిగిఉంటుంది.
[10/18, 20:11] +91 94924 83092: "ప్రతి మరణానికి ఒక కారణం ఉంటుంది.అలాగే  ప్రతి జీవితానికి ఒక ప్రయోజనం ఉంటుంది.
మొదటిది నమ్ముతాం.
రెండవది పట్టించుకోం."

             😊శుభరాత్రి 🙏🏻

No comments:

Post a Comment