ఒక స్వామీజీని న్యూయార్క్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.
జర్నలిస్ట్ అడిగాడు:
స్వామీజీ మీ గత ఉపన్యాసంలో *Contact(సంపర్కం),*
*Connection (అనుబంధం)* గురించి చెప్పారు.
ఈ రెండింటి మధ్య తేడా నాకు సరిగా అర్థం కాలేదు. దయచేసి వివరించగలరా? అని అడిగారు.
స్వామీజీ చిరునవ్వుతో అడిగారు:
మీరు న్యూయార్క్ నుంచే వచ్చారా?
అవును.అన్నాడు జర్నలిస్ట్.
మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?
జర్నలిస్ట్ చెప్పాడు.
మా అమ్మ చనిపోయారు. నాన్న ఉన్నారు.
ముగ్గురు అన్నదమ్ములు, ఒక సోదరి ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి.
స్వామీజీ అడిగారు:
*మీ నాన్న గారితో తరచూ మాట్లాడుతారా?*
జర్నలిస్ట్ కొంచెం అసహనంగా చూశాడు.
చివరిసారి ఎప్పుడు మాట్లాడారు?
నెల రోజుల క్రితం మాట్లాడాను
మీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరూ తరచూ కలుస్తారా?
కుటుంబమంతా చివరి సారి ఎప్పుడు కలిశారు?
జర్నలిస్ట్ కొద్ది సేపు ఆలోచించి:
రెండేళ్ల క్రితం క్రిస్మస్ సమయంలో కలిశాం.
ఎన్ని రోజులు కలిసి ఉన్నారు?
*మూడు రోజులు*
స్వామీజీ మళ్లీ అడిగారు:
ఆ మూడు రోజుల్లో మీ *నాన్న గారి ప్రక్కన కూర్చొని ఎంత సేపు మాట్లాడారు?*
జర్నలిస్ట్ మౌనంగా ఉండిపోయాడు.
*ఆయనతో కలిసి భోజనం చేశారా?*
నాన్నా ఎలా ఉన్నారు? అని ప్రేమగా అడిగారా?
మీ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆయన రోజులు ఎలా గడుపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారా?
ఈ ప్రశ్నలు విన్న జర్నలిస్ట్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
అప్పుడు స్వామీజీ అతని చేయి పట్టుకుని ప్రేమగా అన్నారు:
*బాధపడకండి*
మిమ్మల్ని బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. మీరు అడిగిన Contact & Connection మధ్య తేడాకు ఇదే సమాధానం.
మీ నాన్నగారితో మీకు Contact ఉంది.
కానీ Connection లేదు.
ఫోన్ నంబర్ ఉండటం Contact.
మనసులో స్థానం ఉండటం Connection.
అప్పుడప్పుడు మాట్లాడటం Contact.
ఆప్యాయంగా పలకరించడం Connection.
ఒకే కుటుంబంలో ఉండటం Contact.
ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోవడం Connection.
Connection అంటే హృదయానికి హృదయానికి మధ్య ఉండే అనుబంధం.
కలిసి కూర్చోవడం.
కలిసి భోజనం చేయడం.
మనసు విప్పి మాట్లాడుకోవడం.
ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకోవడం.
పెద్దలను ప్రేమగా పలకరించడం.
వారితో కొంత సమయం గడపడం.
ఇవే నిజమైన అనుబంధాలు.
జర్నలిస్ట్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు:
స్వామీజీ, జీవితాంతం మర్చిపోలేని అద్భుత మైన గొప్ప పాఠం నాకు నేర్పించారు.
నేటి మన జీవితాలలో ఇదే వాస్తవం.
మన ఫోన్లలో వందలాది Contacts ఉన్నాయి.
కానీ మనసుకు దగ్గరైన Connections మాత్రం తగ్గిపోతున్నాయి.
ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో, తమ ప్రపంచంలో బిజీగా ఉన్నారు.
అందుకే.
కేవలం Contactsగా మిగిలిపోకండి.
మనసులతో Connected గా ఉండండి.
ప్రేమించండి.
ఆదరించండి.
ఆప్యాయంగా పలకరించండి.
కలిసి భోజనం చేయండి.
మనకు ప్రియమైన వారితో కొంత సమయం గడపండి.
ఎందుకంటే.
డబ్బు మళ్లీ సంపాదించవచ్చు.
కానీ మన ప్రియమైన వారితో గడపాల్సిన సమయం ఒక్కసారి దాటిపోతే తిరిగి రాదు.
మన బంధాలు కేవలం పరిచయాలుగా కాకుండా, హృదయాల మధ్య అనుబంధాలుగా నిలవాలి.
*కానీ జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అద్భుతమైన మాటలు* …
No comments:
Post a Comment