Tuesday, October 6, 2026

 [10/2, 10:35] +91 94924 83092: *గాంధీ గారి మనసులో మాటలు* 

కన్నుకు కన్ను అయితే ప్రపంచమంతా అంధకారమే.

ఆలోచనలు, మాటలు ఒకేలా ఉన్నప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది.

ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకున్న మార్పు నీతోనే మొదలవ్వాలి.

 మేధావులు.
మాట్లాడుతారు.. అదే మూర్ఖులైతే వాదిస్తారు 

చెడును నిర్మూలించేందుకు ఆయుధం పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే.

ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో.. ఇతరుల సాయం పొందితే గుర్తుంచుకో
[10/2, 10:35] +91 94924 83092: *లాల్ బహదూర్ శాస్త్రి గారి మనసులో మాటలు* 


జై జవాన్, జై కిసాన్ -  సైనికులను, రైతులను గౌరవిస్తూ ఆయన ఇచ్చిన నినాదం దేశంలో ఐక్యతను నింపింది.

•కఠిన శ్రమ ప్రార్థనతో సమానమైనది  తరచూ ఈ మాటను గుర్తుచేసేవారు.

క్రమశిక్షణ, సమైక్య కార్యచరణే దేశానికి అసలైన బలం - దేశ పురోగతికి ఐక్యత, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఆయన చెప్పేవారు.

పరిపాలన యొక్కూ ప్రాథమిక సూత్రం ప్రజలను పాలించడం కాదు, వారిని సేవించడం.

నా పరిమాణం చిన్నదిగా మరియు స్వరం మృదువుగా ఉండటం వల్ల నేను దృఢంగా ఉండలేనని చాలా మంది అనుకుంటారు. నేను శారీరకంగా బలంగా లేనప్పటికీ, అంతర్గతంగా అంత బలహీనుడిని కాను.

మనం యుద్ధంలో పోరాడిన విధంగానే శాంతి కోసం కూడా ధైర్యంగా పోరాడాలి.

దేశంలో ఒక్క వ్యక్తి కూడా అస్పృశ్యుడిగా మిగిలి ఉన్నా, భారతదేశం తలదించుకోవాల్సి వస్తుంది.

No comments:

Post a Comment