Wednesday, June 8, 2022

ఆచార్య సద్బోధన, దృష్టి సత్యములోకి వెళ్ళినంతనే అన్ని రకాల చింతలు నుండి విముక్తి కలుగుతుంది. ఎన్నడూ లేని మనశ్శాంతి లభిస్తుంది.

ఆచార్య సద్బోధన:



మానవుడు తనది కాని దానికోసం, తనకు రాని దానికోసం అమితంగా ఆశలు పెట్టుకోవడం వలననే మనశ్శాంతి కోల్పోయి నిరంతరం చింతాక్రాంతుడగుచున్నాడు.

ఈ ఆలోచనలు, ఆశలు మానవుణ్ణి మరింత కృంగదీసి బాధల్లో పడవేస్తాయి.

.వీటికి బదులుగా తన నిజ స్వరూపముపై దృష్టి పెట్టడం చాలా మంచిది.

దీనివలన భ్రమలు తొలిగిపోతాయి. తాను ఎవరో దైవము ఎవరో అన్న సత్యం తనకు అర్థం అవుతుంది.

దృష్టి సత్యములోకి వెళ్ళినంతనే అన్ని రకాల చింతలు నుండి విముక్తి కలుగుతుంది. ఎన్నడూ లేని మనశ్శాంతి లభిస్తుంది.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

సేకరణ

No comments:

Post a Comment