Monday, August 15, 2022

మంచి మాట..లు (06-08-2022)

 ఈ రోజు AVB మంచి మాట..లు
శనివారం :-06-08-2022

మనిషికి ఇగో అనేది అడ్డు రాకపోతే ఈ భూమిమీద బ్రతకడానికి సవాలక్ష మార్గాలున్నాయి, జీవితంలో ఒకటి గుర్తుంచుకో, ఎగిసిన అల, మిడిసిపడిన తల, నిటారుగా పెరిగిన చెట్టు ఏనాటికైనా విరగక తప్పదు,,

ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తియ్యగా మన వెనకాల చేదుగా మాట్లాడుతారు, ఒకటి మాత్రం నిజం, సింహం తో అయినా స్నేహం చెయ్యవచ్చు కానీ గుంట నక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం,,

బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే, భాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు,,

మనిషికి అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది, అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు, అందుకే మనిషి ఎదిగే కొద్ది ఒదిగి ఉండటం నేర్చుకోవాలి,,

మాట అనేది తూటా కంటే ప్రమాదకరమైనది, అందుకే మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి, కోట్ల రూపాయలు సంపాదించిన వారికంటే ఇతరుల మనసు నొప్పించకుండా మాట్లాడిన వారే శ్రీమంతులు,,
సేకరణ ✍️AVB సుబ్బారావు 🤝💐

No comments:

Post a Comment