Monday, August 15, 2022

మంచి మాట...లు(07-08-2022)

 ఆదివారం --: 07-08-2022 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
జీవితంలోని అన్ని కష్టాలకు రెండే రెండు మందులు ఒకటి శ్రమచేయటం,ఇంకొకటి సహనం గా ఉండటం.. గ్యారంటి లేని జీవితానికి కోపం అసూయ అహంకారం ఎందుకు,,, బ్రతికీనన్ని రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం,, పోయేటప్పుడు డబ్బు హోదా ఇవి ఏవీ మనతో రావు వస్తే ఒకవేళ మనం చేసిన మంచి తప్ప .

ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి,,ఎందుకంటే లోకం అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది,, బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు హృదయాన్ని తీసుకరండి ఎందుకంటే మీ ఠోసం మీ కుటుంబసభ్యులు ప్రేమను పంచాలని ఎదురు చూస్తుంటారు .

నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో...ఆ ఇష్టం వలన వేరొకరు బాధ పడకుండా చూడవలసిన బాధ్యత కూడా నీపై ఉంది,,,తల దించుకున్నవారు తగ్గినట్లు కాదు,,తగ్గిన ప్రతి వారు చేతగాని వారు కాదు,, కొందరు పరిస్థితులకు లొంగితే కొందరు బంధాలకు
లొంగుతారు,,, తగ్గారు కదా అని ఎవరిని తక్కువ చేసి చూడకూడదు పరిస్థితులు అనుకులిస్తే వారు కూడా ఎప్పుడో ఒకప్పుడు తల ఎత్తి తిరగటం చేస్తారు
సేకరణ ✍️AVB సుబ్బారావు

No comments:

Post a Comment