Sunday, October 16, 2022

దేవుడు ఉన్నాడా... ? లేడా... ? అసలుంటే ఎందుకు కనబడడు... ? ఇలాంటి డైలమా స్థితి మనిషిని ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది. స్థిరత్వమివ్వదు.

 🌸💥🌸💥🌸💥🌸💥🌸💥

          🌹నేటి ఆత్మ విచారం. 🌹

దేవుడు ఉన్నాడా... ?  లేడా... ?

అసలుంటే ఎందుకు కనబడడు... ?

ఇలాంటి డైలమా స్థితి మనిషిని ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది. స్థిరత్వమివ్వదు.

దేవుడు అన్నాడు అనడానికి మన ముందు ఉన్నా కొన్ని నిదర్శనాలు పరమపూజ్య పాండురంగ శాస్త్రి "దాదాజీ "గారి ప్రేరణతో... నా పరిజ్ఞానం మేరకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.🙏

1. ఆకాశం ఏ ఆదరముతో నిలిచింది... ?

2.నింగిలో చుక్కలు ఏ ఆదరముతో నిలుస్తున్నాయి... ?

3.సూర్య, చంద్రాదులు ప్రామాణికంగా ఎలా ప్రకాశించగల్గుతున్నాయి... ?

4. అందమైన పుష్పములో మకరందాన్ని ఎవరు నింపారు...?

5. ఒక చిన్న కణం పిండముగా మారి... బారి కాయముగా ఎలా ఎదగ గల్గుతుంది... ? శరీరంలో ఉన్నా అవయవాలు ఎవరు తాయారు చేసారు...?

6.మనం భుజించే ఆహారపదార్థాలు నల్లటివి తిన్న, తెల్లటివి తిన్న... ఏ రంగు పదార్థాన్ని తిన్నాను రక్తం  ఎర్రగా తాయారు తయారౌతుంది. అసలు రక్తము ఎవరు తాయారు చేస్తున్నారు...?

7.గాలి, నీరు ఆహారం ఎవరు తాయారు చేసారు...?
కేవలం భూమిలో ఒక విత్తనాన్ని నాటితే వందల విత్తనాలు ఎలా వస్తున్నాయి... ? వాటిని ఎవరు తాయారు చేసారు...?

8. మనం నిదురపోతాము మనకు తెలియకుండానే శ్వాశ తగురీతిలో నిరంతరం నడుస్తుంది. శ్వాసను నిరంతరం తగురీతిలో ఎవరు నడిపిస్తున్నారు...?

9.నిద్రనుండి మనము ఉదయం మన ప్రమేయము లేకుండానే వెంటనే రెండు కళ్ళు తెరుచుకుంటాయి. మనకు స్మృతిని ఎవరు కలిగిస్తున్నారు...?

10.ఒక కారు నడవాలంటే ఇందనము, డ్రైవర్ కావాలి కదా.. మరీ మనము ఇందనమనే ఆహారాన్ని తీసుకుంటున్నాము ఆహారాన్ని జీర్ణింపచేసి శక్తిని నింపి  శరీరములోనీ అవయవాలు నిరంతరం పనిచేస్తున్నాయి. వాటిని ఎవరు నడిపిస్తున్నారు...?
మానవ శరీరమనే కారుకు డ్రైవర్  ఎవరు...? ఎవరు  నడిపిస్తున్నారు...?

11.మన చేతులను, పళ్లు, శరీరాన్ని రోజు రాపిడి చేస్తూ రుద్దుతూ ఉంటాము... ఒక ఇనుప వస్తువుపైనా రోజు మూత్రవిసర్జన చేస్తే కొన్నాళ్ళకు కనుమరుగై పోతుంది మరీ మనం చేతులను సబ్బుతో, పళ్ళను బ్రెస్సుతో రోజు రుద్దుతుంటాము కదా మరీ అవి ఎందుకు కరుగుతలేవు...?

12.మానవుడు  ఉన్నతుడు  శక్తీ శాలుడు అనుకున్నప్పుడు మనిషికి మరణం ఎందుకు వస్తుంది...?
మరణించిన వ్యక్తి ఎక్కడి వెళ్తున్నాడు... ? శరీరము మనముందే ఉంటుంది. అలాంటప్పుడు కదలిక ఎందుకు ఆగిపోయింది...?
శరీరమే మనముందు ఉంటుంది చనిపోయాడు అంటున్నాము ఇంతకు పోయింది ఏంటి...?


🌸💥🌸💥🌸💥🌸💥🌸💥

            🌹నేటి ఆత్మ విచారం. 🌹

దేవుడు ఉన్నాడా....?   లేడా... ?

అసలుంటే ఎందుకు కనబడడు... ?

తరువాయి భాగాన్ని పరమపూజ్య పాండురంగ శాస్త్రి ("దాదాజీ " ) గారి ప్రేరణతో.. విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.💥👏
---------------

దేవుడు ఉన్నాడు అనడానికి మనం కొన్ని నిదర్శనాలు, దేవుని ఉనికి గురించి నిన్నటి భాగములో విశ్లేషించాము...

13.సుందరమైన ప్రకృతిని, సృష్టిని ఎవరు సృష్టించారు...?

14.నీరు ఆవిరిగా మారి మేఘావృతమై మదించి తెలియాడుతున్నాయి ఎలా...? ఆయా రుతువుల లో (కాలంలో ) వర్షాన్ని ఏ శక్తీ కురిపిస్తుంది...పృద్విని చల్ల బరిచి  భూగర్భములో నీటి నిల్వ  ఎలా సాధ్యం... ?

15.సృష్టిలోని జీవుల పోషణ ఎలా  జరుగుతుంది... ? ఉదాహరణకు -బండ రాతి మధ్యన ఉన్నా కప్పకు పోషణ ఎలా జరుగుతుంది... ?

ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా...ఆలోచింపజేసే  ఆశ్చర్యకరమైన, వింతగొలిపే ఎన్నెన్నో దృశ్యాలు మన కళ్ళముందే కదలాడు తున్నాయి...

దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే... వీటన్నిటిని నడిపించే ఒక అద్భుత శక్తీ ఉన్నదని మనం గ్రహించవచ్చు... ఆ శక్తినే మనం "దేవుడు " లేదా..."పరమాత్మా" అంటున్నాము. "పర "అనగా బిన్నంగా ఉండేవాడు అని అర్థం.

💥"దేవున్నీ " చాలామట్టుకు చూసారు,ప్రసన్నం చేసుకున్నారు  అనడానికి ఎన్నో నిదర్శనాలు, ఆనవాళ్ళు ఇప్పటికి చూడవచ్చు.💥

త్రేతాయుగములో  పురాణపురుషుడు - శ్రీ రామచంద్రుడు.
ద్వాపరయుగములో -శ్రీకృష్ణపరమాత్మా .

ఈ ఇరువురు అవతారపురుషులు ఆయ యుగములో  ఉన్నారు అనడానికి "రామాయణం" "మహాభారతం" ప్రామాణికాలు...అంటే ఆ యుగములో నీ ప్రజలు ప్రత్యక్షంగా దేవుని అవతారాలను చూసారు అనవచ్చు.

మహాభక్తుడు అన్నమయ్య కలియుగ దైవముగా కొలువబడుతున్న తిరుపతి పుణ్యక్షేత్రంలో  శ్రీ వెంకటేశ్వర స్వామినీ ప్రసన్నం చేసుకున్నారు చూసారు అనడానికి ఏడుకొండల తిరుపతి క్షేత్రంమే సాక్షిభూతం.

"గోపన్న " శ్రీ రామదాసుగా పేరొందిన మహాభక్తుడు. శ్రీరాముని ప్రత్యక్షము గావించుకున్నాడు, చూసాడు అనడానికి భద్రాచలంలోనీ శ్రీరాముని దివ్యక్షేత్రం నిదర్శనం.

తల్లితండ్రి సేవలో నిమఘ్నమైన మహాభక్తుడు  పుండరీకుడు సాక్షత్తు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా పిలిస్తే నేను నా తల్లితండ్రి సేవలో ఉన్నా ఇదిగో ఈ ఇటుకపై నిలిచుండు మంటు ఇటుకను విసరగా ఆ ఇటుకపై శిలగా మారి  "పాండురంగడుగా" విఠలేశ్వరుడిగా పూజలందుకుంటున్న క్షేత్రం మహారాష్ట్రలోని పుండరీక క్షేత్రం ఇప్పటికి సాక్షిభూతము.

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే... ఇలా ఎందరో మహాభక్తులు, ఋషులు, మునులు భగవంతుణ్ణి తనివితీరా చూసారు, ప్రసన్నం చేసుకున్నారు పరమాత్మలో నీలమైనారు.

దేవుడు ఉన్నాడు అని పై విశ్లేషణ ద్వారా తెలుకున్నాము అని నేను భావిస్తున్నాను. మరి ఉంటే దేవుడు ఎందుకు కనబడతలేడు... ? దేవుణ్ణి చూడాలంటే ఎమ్ చేయాలి... ? 

🌸💥🌸💥🌸💥🌸💥🌸💥
-----------------------
            

మొదటి, రెండవభాగములో...ఈ సృష్టిని నడిపించే అద్భుతశక్తి ఉందని ఆ శక్తినే  "దేవుడు " లేదా "పరమాత్మా" -"పర" అనగా బిన్నమైనవాడు, చావు, పుట్టుక లేనివాడని, జీవాత్మ & పరమాత్మల కలయికే జీవులు అని తెలుసుకున్నాము.

ఇప్పుడు మనం దేవుడు ఎందుకు కనబడతాలేడు... ? అనే విషయాన్ని విశ్లేషిద్దాం.

చూడండి... ఒక కలెక్టర్, గాని లేదా ఒక M.L.A., M.P.నీ లేదా ఒక మంత్రిని, ముఖ్యమంత్రిని లేదా ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలవాలంటే...మనం ముందుగా  (Appointment) కలవడానికి నిర్ణయించే సమయం తీసుకోవాలి కదా...వారు ఇవ్వొచ్చు లేదా తిరస్కరించొచ్చు. ఇక సామాన్యమైన వ్యక్తి మాత్రం కలవడం మాత్రం దుస్సాధ్యం అవునా కదా...

ఒక మనవమాత్రుడుఅయిన ఒక హోదాలో ఉన్నా వ్యక్తినే కలవాలంటేనే యెన్నో పాట్లు పడితే తప్ప అతన్ని మనం కలవలేమే...అలాంటిది ఆ వ్యక్తిని సృష్టించిన సృష్టి కర్తను కలవాలంటే ఎంతటి పాట్లు పడాలో ఆలోచించండి. "దేవుడు" అంగట్లో అమ్మే వస్తువా... ? కనబడటానికి. శోధించి సాధించాలి. మరో వింత ఏంటంటే దేవుడు కనబడకపోతేనే గుళ్లో వెళ్లి పదిరూపాయలు కొబ్బరికాయ కొట్టి, కోటి కోరికలు కోరుతున్నారు కదా ఒక వేళా కనబడితే ఇంకెన్ని కోరికల చిట్టా విప్పుతాడో నేటి భక్తుడు బహుశా అందుకనే దేవుడు కనిపించకుండా ఉన్నాడేమో సుమీ...

దేవుడు ఎక్కన్నో మందిరంలో లేడు, ఆకాశంలో లేడు,క్రిందను లేడు "దేవుడు" సర్వవ్యాపి, సర్వములో...సర్వజీవులలో  అణువణువులో, కణకణములో, అండపిండ బ్రమండములో నిండి ఉన్నాడు. పరమాత్మ లేని చోటులేదు.

అందుకే శ్రీకృష్ణ పరమాత్మా గీతలో... " సర్వస్య చాహం హృది సన్నీవిష్ట : --(15-15)  మమైవాంశో జీవలోకే-- (15-7)   నేను అందరి వృదయాల్లో ఉన్నాను.అందరు నా అంశమే. అనగా అందరు నా కుమారులే అని అభయం స్వయంగా భగవంతుడు ఇస్తున్నాడు.

దీనివలన మానవుని జీవితం సంయమితంగా మారుతుంది. అవ్యవస్థితంగా ఉండదు. ఇంకో అభయం కూడా భగవంతుడు ఇస్తున్నాడు. "నీవు ఒంటరిగా లేవు, నేను నీ వెంటే ఉన్నాను. నేను వేరు కాను, నేను దూరంగా లేను, నన్ను కలవడం ఆలస్యముకాదు. నన్ను గుర్తిస్తాలేవు కావున నీకు నేను వేరుగా కనిపిస్తున్న నన్ను గుర్తించే సామర్త్యాన్ని పొందాక నీవే నేనుగా గోచరిస్తాను ప్రయత్నించు. అంటూ ఇలాంటి ఐక్యతాభావాన్ని మనపై ప్రేమతో పరమాత్మా తెలియజేసాడు.

పుట్టిన ప్రతీజీవీ గిట్టడం ఎంత సత్యమో... అతడితో పాటు అతడి లోపల, బయట భగవంతుడు ఉన్నాడన్నది అంతే సత్యము.

పరమాత్మా మన తండ్రి, మనం ఆ దేవదేవుని గారాల ముద్దుబిడ్డలం. మన తండ్రి ఒడిలో ప్రేమతో సేదతీరేది ఉంది. నిన్నే నమ్ముకున్నామని ఆయనకు హామీ ఇవ్వక్కర్లేదు మరీ ఒట్టుపెట్టి చెప్పక్కర్లేదు పరమాత్మ యెడల ఆ భావన ఉదయిస్తే చాలు. పువ్వును అనుసరించు పరిమళంలా పరమాత్మా అనుభూతిని పొందవచ్చు.

నాల్గవ రేపటి తరువాయి భాగములో దేవున్ని చూడాలంటే ఏమి చేయాలి... ? అనే విషయాన్ని విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు...

           🌹 జై యోగేశ్వర్. 🙏

✡సర్వేజనాః సుఖినోభవంతు.👏
 
☸శుభమ్ భూయాత్ 💥

🙏

🌺💥🌺💥🌺💥🌺💥🌺💥

No comments:

Post a Comment