మానవ శరీరంలో ఉన్నవి :
1. జ్ఞానేంద్రియాలు :
కన్ను, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మం – 5.
2. కర్మేంద్రియాలు :
కాళ్ళు, చేతులు, శిశ్నం, గుదం మరియు నోరు – 5.
౩. అంతఃకరణ చతుష్టయం :
మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహంకారం – 4.
4. పంచాతన్మాత్రులు :
శబ్దం (ఆకాశగుణం), స్పర్శ (గాలిగుణం), రూపం (అగ్నిగుణం), రసం (నీటి గుణం) మరియు గంధం (భూమిగుణం) – 5.
5. పంచప్రాణాలు :
లోనికి తీసుకునే గాలి శరీరంలో అయిదు రకాలుగా పనిచేస్తూ ఉంది – ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం మరియు సమానం – 5.
అనేవి అన్ని కలిపి మానవుడు జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విధంగా జడమైన 24 తత్వాలు 25 వది అయిన జీవుణ్ణి కలిపి 26 వది అయిన ఆత్మను గ్రహించటానికి మరియు ఆత్మ తత్త్వాన్ని అనుభవించటానికి అవరోధంగా నిలుస్తున్నాయి. వాటిని తొలగించి ఆత్మలో జీవించటానికి మనకు ఆత్మ జ్ఞానం అవసరం. అత్యవసరం.
No comments:
Post a Comment