Wednesday, February 1, 2023

భగవంతుని పొందాలంటే…!

 1110.  1-6.   280123-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


     *భగవంతుని పొందాలంటే…!*
               ➖➖➖✍️

*మనం భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా, ఏదో బాహ్యంగా పైపైన చేస్తూఉంటాము. బయటకు మాత్రం "ఓ భగవాన్! నేను నీ దాసుడను, నాకు నీవుతప్ప వేరే దిక్కులేదు"అంటూ ఉంటాము. కాని మన ప్రవర్తన అందుకు విరుద్దంగా ఉంటుంది. ,*

*మనస్సు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనస్సు, మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం ?.* 

*మనం బయకు ఏం మాట్లాడుతామో, మన మనస్సులోని ఆలోచనలు కూడా అదేవిదంగా ఉండాలి. అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. "భగవంతుని నామం, ఆయన రూపం వేరుకాదు".* 

*భగవన్నామస్మరణలో ఆనందం అధికమౌతుంది. ఆయన ప్రేమమయుడు. ఆనందమయుడు. ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాము ..*

*సాధారణంగా మన మనస్సు నానా విషయాల పట్ల పరుగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనస్సును నియంత్రించి భగవంతుని పై కేంద్రకరించడానికి ప్రయిత్నించాలి.అదే అభ్యాసమంటే .*

*"సూదిబెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒక్కటిగా చేయాలి. దారపుపోగులు విడివిడిగా ఉంటే సూదిబెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం"...*

*అలాగే భగవంతుని యందు మనస్సును నిమగ్నం చేయాలంటే బాహ్యవిషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రం చేయాలి.*

*ఇంద్రియనిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు .*

*"భగవంతుణ్ణి పొందాలంటే పరితపనయే  పరమోత్తమ సాధన !"*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment