Wednesday, February 1, 2023

#ఓ_తల్లి_మనసు…*

 0101.  2-8.   280123-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                 *తల్లి మనసు*
                 ➖➖➖✍️

_*Heart touching Memories._*

*#ఓ_తల్లి_మనసు…*

*ఒకప్పుడు నా ఇల్లు నవ్వులు,                    వాదనలు , అరుపులు , కేకలు ,           అల్లరితో హడావిడిగా ఉండేది.*

*ఇల్లంతా పెన్నులు , పుస్తకాలు, ఆట సామాన్లు, మడత పెట్టని దుప్పట్లు , విసిరేసిన చెప్పులు, ఆరేయని తడి తువ్వాళ్ల తో చిందర వందర గా ఉండేది.* 

*నా రోజువారీ పని , అరవడం, వాళ్ళని కోప్పడ్డం , క్రమ శిక్షణ  చెప్పడం , చివరికి అన్నీ నేనే సద్దుకోవడంలా ఉండేది..!*

*#ఉదయరాగం*

*పొద్దున్న లేచిందగ్గరినించీ  ‘అమ్మా నా బ్రష్ ఎక్కడ, అమ్మా నా స్కూల్ బాగ్ ఎక్కడ, నా బూట్ లేసు పోయింది, నా హోమ్ వర్క్ బుక్ పోయింది , హోమ్ వర్క్ చెయ్య లేదు , స్కూల్ మానేస్తాను,’ ఇవీ మా ఇంట్లో ఉదయ రాగాలు!*

*#నా_దినచర్య *

*విసుక్కుంటూనే వాళ్ళ వస్తువులు వెతికి ఇవ్వడం, "మీ వస్తువులు మీరే జాగ్రత్త చేసుకోవాలి, పెద్దవుతున్నారు, ఎప్పుడు నేర్చుకుంటారు?"  *

*#సంధ్యారాగం *

*"అమ్మా,?ఏదైనాపెట్టు, ఆడుకోడానికి వెడుతున్నా, నాకు కొత్త బ్యాట్ కొనాలి, మా ఫ్రెండ్ ఇంటికి వెడుతున్నా" అని వాళ్ళంటే…, "చీకటి పడకుండా త్వరగా రావాలి, దెబ్బలు తగుల్చుకోకండి!" ఇవే నా గొంతు లోంచి అప్రయత్నంగా వచ్చే మాటలు .*

*#వర్తమానం *

*ఇప్పుడు నేను అదే ఇంటిలో ,  వాళ్ళు అల్లరి చేసి కొట్టుకున్న  అరుచుకున్నచోట నిలబడి చూస్తున్నాను.*

*ప్రస్తుతం మా ఇంట్లో నీట్ గా సర్ది ఉన్న పక్కలు , మంచాలు , కొంచెం చిరిగిన , పొట్టి అయిపోయిన బట్టల బీరువాలు , ఖాళీ అలమారాలు కానీ... అప్పుడు పిల్లలు వాడిన సెంట్ల వాసన మాత్రం గాలిలో అలానే ఉంది.*

*ప్రతి పిల్లకి, పిల్లాడికి ఒక ప్రత్యేక సువాసన ఉండేది.*
*ఆ వాసనలు ఇప్పటికీ నా ఖాళీ గుండెని నింపుతాయి.*

*ప్రస్తుతం నాకు వాళ్ళ అల్లరి ,  ఆటలు , ప్రేమతో ఇచ్చిన  కౌగిళ్లు , మధుర జ్ఞాపకాలు!*

*ఈరోజు మాఇల్లు ఎక్కడివక్కడ పొందికగా ఆరేసిన తడి బట్టలు , తెరవాల్సిన అవసరమేలేని చెప్పుల స్టాండ్ , శాంతి గా , ప్రశాంతంగా ఉంది. కానీ ఇది నిర్జీవమైన ఎడారి అనిపిస్తుంది.*

*ఇప్పుడునేను ఎవరి మీదా అరవక్కరలేదు , ఎవరికీ ఏమీ చెప్పక్కర లేదు. అసలు మాట్లాడ్డానికే మనుషులు లేరు.*

*ఎప్పుడైనా నా పిల్లలువస్తే , నాతో గడిపి వెళ్లిపోతుంటే , వాళ్ళ బ్యాగ్ లు సద్దుకుంటుంటే , నా గుండెలు పిండి నట్టు అనిపిస్తుంది.*

*వాళ్ళు టాక్సీ ఎక్కి తలుపులు వేస్తుంటే, "వీధి తలుపులు వేసివెళ్ళండి" అని నేను అరిచిన సందర్భాలు గుర్తుకొచ్చి , కళ్ళ నీళ్లు తిరుగుతాయి.*

*ఈ రోజు నేనే అన్ని తలుపులు వేసుకుంటూ తీసుకుంటూ ఉంటే, పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా దేశంలోనో , విదేశాల్లోనే వాళ్ళ గమ్యాలు వెతుక్కుంటూ వెళ్లిపోయారు. *

*వాళ్ళు ఎప్పటికీ నాపిల్లలు కాబట్టి , నాతోనే ఉండిపోవాలని నా స్వార్ధం చెబుతుంటే , వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, పిల్లల కోసం వెళ్ళాలిగా !*
*భగవంతుడా ..! పిల్లలందరూ ఎక్కడ వున్నా , సుఖంగా ,  ఆనందంగా , ఉంటూ అభివృద్ధిలోకి వచ్చేట్టు చెయ్యమని రోజూ పూజా మందిరం ముందు కూర్చుని ప్రార్ధించడం తప్ప నేనేమి చేయ్యగలను?*

*పిల్లలు పెరుగుతూ తమ దగ్గరే ఉన్న తల్లితండ్రులకు నా విజ్ఞప్తి ఏమిటంటే ..! వాళ్ళు మీ దగ్గర ఉండగానే వాళ్ళ అల్లరి ని ఆనందించండి, ప్రేమని ఆస్వాదించండి , ఆప్యాయత పంచండి , వీలైనంత ఎక్కువ సమయం వాళ్ళతో గడపండి. *

*మీ పెళ్ళికిముందు మీ అమ్మానాన్నలతో , అన్నదమ్ములతో , అక్కచెల్లెళ్ళతో గడిపారు. ఇప్పుడు వీళ్ళతో ఆనందించమని.*
*అందరు మాతృమూర్తులకు , పితృ దేవులకు , అమ్మమ్మ నానమ్మ , తాతలకు ప్రేమతో అంకితం. *✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment