దగ్గు COUGH కుచిట్కాలు
****************************
🔸వేడి దగ్గు: సోంపు గింజలు పొడి, కండ చక్కెర పొడి సమానంగా కలిపి పెట్టుకోవాలి. మాటి మాటికి ఆ పొడిని చప్పరిస్తూ ఉంటే వేడి తగ్గుతుంది..
🔸దగ్గు, జలుబు: పసుపు, ఉప్పు, దోరగా వేయించి దంచిన వాము పొడి అన్నీ కలిపినిల్వచేసుకోవాలి. రోజు ఉదయం పరిగడుపున అరచెంచా పొడిసేవిస్తూ ఉంటే దగ్గు, జలుబు పోతాయి.
👉శొంఠి, పిప్పళ్లు, మిరియాలను సమానంగా తీసుకొని విడివిడిగా దోరగా వేయించి మెత్తగా దంచి పొడిచేసుకొని అన్ని కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని రోజు ఉదయం, సాయంత్రం పరిగడుపున అరచెంచా పొడిని కొంచెం తేనెలో కలిపి తినాలి. దీని వలన దగ్గు. జలుబు, శ్వాస కోశ వ్యాధులు దూరమవుతాయి.
🔸దగ్గు : 2 లవంగాలు వేయించి ఐదు తులసి ఆకులతో కలిపి నమిలితింటే అన్ని దగ్గులు పోతాయి.
🔸కఫంతో ఉన్న దగ్గు: కరక్కాయ ముక్క అల్లం ముక్క ఒక్క మిరియాన్ని నోట్లో బుగ్గన పెట్టి చప్పరించటం వలన కఫంతో ఉన్న దగ్గు సమస్యలు పోతాయి.
🔹పొడి దగ్గు: తమల పాకు, కొంచెం ఓమ, 2తులసి ఆకులు, ఒక మిరియం, చిన్న అల్లం ముక్క అన్ని కలిపి మెల్ల మెల్లగా నములుతూ ఉంటే పొడిదగ్గు తగ్గుతుంది.
🔸 కఠినమైన దగ్గులకు : దానిమ్మ పండ్ల బెరడును దంచి పొడిచేసుకొని పెట్టుకోవాలి. 10గ్రాముల పొడిని ఉదయం సాయంత్రం ఖాళీ కడుపున చప్పరించటం వలన కఠినమైన దగ్గులు తగ్గును
🔹అన్ని రకాల దగ్గులకు: అల్లం రసం, తమలపాకుల రసం, తులసిరసం మరియు తేనె సమానంగా తీసుకోవాలి. అన్నీ కలిపి పూటకు పావుతులం మోతాదుగా మూడు పూటలు ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే అన్ని రకాల దగ్గులు పోతాయి.
🔸చాలా రోజులుగా ఉన్న దగ్గుకు మంచి మందు: 5 లేక 7 నల్ల మిరియాలును రోజంతా మెల్లమెల్లగా నమిలి తినిన మొదటి రోజుకే వెంటనే మంచి ఫలితము వచ్చును. ఒక్క సారి 2 లేక 3 సార్లు మిరియాలను నమిలి నోట్లో వేసుకొవలెను. చాలా సం॥రాల నుండి ఉన్న
దగ్గును కూడా తగ్గించవచ్చును.
⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓
No comments:
Post a Comment