Tuesday, February 21, 2023

:::::: మనస్సు ధరించే అద్దం::::::

 *::::::::: మనస్సు ధరించే అద్దం::::::::*

    మనకు దూరం చూపు కాని దగ్గర చూపు కాని సరిగ్గా లేక పోతే తగిన కళ్ళజోడు( అద్దాలు) పెట్టు కుంటాము‌.  ఇది అవసరం.

    కన్ను ఒక దృశ్యాన్ని చూచినప్పుడు  ఆ దృశ్యాన్ని మనస్సు గ్రహించే క్రమంలో మనస్సు ఎలాంటి అద్దాలు ధరించి వుండరాదు.

  మనస్సు ధరించే అద్దం అంటే ఏమిటి???

మనం ఇంద్రియాలతో ఆయా విషయాలు గ్రహించే టప్పుడు అనగా చూచినప్పుడు వినినప్పుడు, తాకినప్పుడు , ఉన్నది ఉన్నట్లుగా గ్రహించాలంటే మనస్సు తన జ్ఞపకాలు, అభిప్రాయాలు, జడ్జి మెంట్,ఆశలు, పోల్చడం, అనే అద్దాలు పెట్టుకొని వుండరాదు.
     అలా వుంటే చూచింది , విన్నది ఆ మేరకు ప్రభావితం అవుతుంది.
  ఉదా..ఎర్ర కళ్ళ జోడు లో నుండి అంతా ఎర్రగా కనపడినట్లు.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment