*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *అపరాపరాక్రమశాలి అయిన భీష్ముడు ఇఛ్ఛా మరణాన్ని వరంగా పొందాడు. భీష్ముణ్ణి గెలవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు . కానీ ఒక స్త్రీ ఆపనిని సాధించింది.*
💝*ఈ కథకి మూలం కాశీరాజు ప్రకటించిన స్వయంవరం. కాశీరాజుకి ముగ్గురు కుమార్తెలు. అంబ, అంబిక, అంబాలిక . ముగ్గురూ చక్కని చుక్కలే. వీరికి స్వయంవరం ప్రకటించాడు కాశీరాజు.*
❤️ *తన తమ్ముళ్ళయిన చిత్రాంగదుడు, విచిత్రవీర్యులకి ఇచ్చి పెళ్లి చెయ్యడం కోసం భీష్ముడా స్వయంవరానికొచ్చిన రాజులందరినీ ఎదిరించి ఆ రాచకన్యలని హస్తినకు తీసుకొచ్చాడు. కానీ ఆయన ఆ పడుచుల మనసుని అడిగి ఆపని చేసుంటే ఎంతో బాగుండేది!*
💞 *అంబ అప్పటికే సాళ్వరాజుని వరించింది. చిన్ననాటినుండీ అతడే తన విభుడని కలలు కన్నది. భీష్ముడికి ఆవిషయాన్ని ధైర్యంగా చెప్పింది. భీష్ముడు సరేనని సాళ్వుని దగ్గరకి ఆమెని పంపించేశాడు. కానీ సాళ్వుడు “ఇంతకాలమూ ఆ హస్తినాపురంలో విచిత్రవీర్యునికి కాగల సాటిగా ఉన్న నిన్ను నేను ఏలుకోను పొమ్మ”న్నాడు.*
💓 *ఎంతగా అంబ నచ్చజెప్పినా, వేడుకున్నా ఆమె వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. తిరిగి భీష్ముని ఆశ్రయించింది అంబ. ‘నీ మనసులో పరపురుషుడు ఉండగా, నిన్ను నా తమ్మునికి కట్టబెట్టలే’నన్నాడు భీష్ముడు.*
💕 *అంబ అతని కరుకు హృదయానికి తల్లడిల్లిపోయింది. దిక్కుతోచని స్థితిలో పడింది . తన ఈ పరిస్థితికి కారణమైన భీష్మునిపై అంతులేని క్రోధంతో రగిలిపోయింది. ఎలాగైనా భీష్మునిపై పగ సాధించాలనే పంతానికి వచ్చింది.*
💖 *హొత్రవాహనుడనే రాజర్షి సాయంతో పరశురాముణ్ణి ఆశ్రయించింది. పరశురాముడు భీష్మునికి విలువిద్యనేర్పిన గురువు. కానీ భీష్ముడు గురువుని మించిన శిష్యుడనిపించుకున్నాడు.*
💓*యుద్ధానికి దిగినా పరశురామునిపైన విజయం భీష్మునిదే అయ్యింది . దానితో అంబ తన పంతం నెరవేర్చుకునే నిశ్చయంతో యమునాతీరంలో కుటీరాన్ని ఏర్పరచుకొని తీవ్రంగా తపస్సు చేయనారంభించింది.*
💖 *గంగాదేవి ప్రత్యక్షమై ఆమెకి దర్శనమిచ్చింది. తన కుమారుడైన భీష్ముని చంపాలనే ఆమె ఆకాంక్షనివిని కోపగించింది. “నువ్వు కుటిల సంచారిణివి ! కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు. అంతకన్నా నువ్వు భీష్ముణ్ణి ఏమీ చేయలేవు” అంది. కానీ అంబ తన తపఃఫలములో సగం ధారపోసి అంబానదిగా మారింది . మిగిలిన సగభాగంతో తన శరీరాన్ని నిలబెట్టుకొని పరమేశ్వరునికోసం తన తపస్సు కొనసాగించింది .*
💞 *ఆమె తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షం అయ్యాడు . “మరుజన్మలో నువ్వు భీష్ముణ్ణి చంపగలవు“ అని వరం అనుగ్రహించాడు . మొదట నువ్వు ఈ శరీరాన్ని విడిచి ద్రుపదమహారాజుకి కూతురువై పుడతావు. ఆతర్వాత కొడుకుగామారి శిఖండి అనే పేరుతొ ప్రసిద్ధికెక్కి , గాంగేయుని వధిస్తావు అని వివరించి అంతర్థానమయ్యాడు.*
💓 *అంబ గాంగేయుణ్ణి చంపాలన్న ఒకే ఒక్క కోరికని మనస్సులో గట్టిగా నింపుకొని, చితిపేర్చుకొని అగ్నిప్రవేశం చేశింది . ఆ తర్వాత ద్రుపదమహారాజుకి సంతానముగా జన్మించి కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండిగా మారి భీష్ముణ్ణి సంహరించింది.*
💖 *ఆవిధంగా అంబ తన పంతం నెగ్గించుకున్నది. అందుకేనేమో “స్త్రీ పగపడితే అంతం చూస్తుంది” అన్నారు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment