🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మన మంచితనం…*
*మనల్ని కాపాడుతుంది.*
➖➖➖✍️
*ఒక వ్యక్తి ప్రతిరోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు.*
*అది చూసి చాలా ముచ్చటపడేవాడు. ‘మనం కూడా ఇలా చేయాలి’ అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు.*
*అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ‘మనం ఎలాగూ పూజ చేయలేము, ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం’ అని అనుకున్నాడు.*
*కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు.*
*అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉన్నది.*
*ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే, ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో… “అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు. నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను” అని అన్నాడు.*
*ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడిఉండడం గమనించాడు.*
*అతడితో … “నాయనా నేను చెప్పేవరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు!” అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు.*
*రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావువని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి “నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను.” అని అన్నాడు.*
*ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకురావడంతో ‘ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా?’ అని అడిగినప్పుడు రాహువు…*
*”అయ్యా మీరు ఇన్నిరోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు” అని రాహువు చెప్పగానే …*
*బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా “అతడికి దానం ఇస్తున్నాను” అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు.*
*ఆ పాము మాయమైంది*
*ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా?*
*ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడడమా?*
*మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా ?*
*దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా?*
*బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి “ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి!” అని చెప్పాడు.*
*సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు.*
*************
*ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచం మంచి పనులు చేయండి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment