🔔 *సత్సంగం* 🙏
మహాభారతంలో ధృతరాష్ట్రుడి వల్లే అంతటి కురుక్షేత్రం జరిగింది. దుర్యోధనుడి వల్ల కాదు.
పాండురాజు ఉన్నప్పుడు పాండు రాజుని చక్రవర్తిని చేయాలని అనుకున్నారు. కానీ పాండురాజు మాత్రం గ్రుడ్డి వాడైన ధృతరాష్ట్రుడికి రాజ్యం అప్పజెప్పి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. గ్రుడ్డి వాడైనా దృతరాష్ట్రుడు మాత్రం హాయిగా కడుపులో చల్ల కదలకుండా భీష్ముడి ఆధ్వర్యంలో రాజ్యాన్ని పాలించాడు. దృతరాష్ట్రుడు తమ్ముడు మీద ప్రేమ ఉన్నట్లుగా నటించాడు. ఇది దుర్యోధనుడు తన రాజ్య కాంక్షని వెల్లడించే వరకు ఎవరికి తెలియకుండా లోలోపల దాచాడు. వారణావతానికి పంపి చంపెద్దాం అనే వరకు తెలీదు.
ఇక్కడ తెలుసుకోవలసిన జీవన సూత్రం ఒకటి గమనించాలి. భారతం అంటే ప్రతి మనిషి జీవితం లో తాము చేసే పనుల వల్ల భవిష్యత్తులో ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకునే ఒక గొప్ప గ్రంథం. కథల పుస్తకం కాదు.
దృతరాష్ట్రుడు తన మనస్సులో లోలోన దాచుకున్న ఈర్ష్య అసూయ, ధన రాజ్యకాంక్ష ల ప్రతిరూపం దుర్యోధనుడి రూపంలో జన్మ తీసుకుంది. పైకి ప్రేమ నటిస్తూ లోలోన దాచుకున్న రాజ్యకాంక్ష ఎంతటి దారి తీసిందంటే భీష్ముడు కర్ణుడు, ద్రోణుడు వంటి తిరుగులేని వీరుల్ని సైతం నాశనం చేసేసింది. పిల్లలు అంటే ఎవరో కాదు తండ్రి బీజం అయితే తల్లి మాంసం.. తల్లిదండ్రుల మానసిక రూపాలు. మానసిక లోపాలు. మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి. వేప చెట్టుకి వేపకాయలే కాస్తాయి. మీరు పైకి మంచిగా కనిపించవచ్చు. లోపల ఏమున్నదో పిల్లల్ని చూసి చెప్పొచ్చు. పండిత పుత్రః పరమ శుంఠ అని ఊరికే అనలేదు. పండితుడు కావచ్చు, లేదా సంఘంలో పలుకుబడి గల వ్యక్తి కావచ్చు. పైకి కనబడే విధంగా వాళ్ళ పిల్లలు ఎందుకు ఉండరు అంటే లోపల చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి. తామంతట తాముగా బయట పడలేక బిడ్డల రూపంలో బయటపడి అడ్డం తిరుగుతాయి.
దుర్యోధనుడి విషయంలో అదే జరిగింది. దుర్యోధనుడి తప్పు కాదు. తల్లిదండ్రుల లోపాలు. అంతటి కురుక్షేత్రం జరిగింది. వనవాసం ముగిసి అజ్ఞాతవాసం ప్రారంభం అయ్యే సమయంలో ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టక విధురుడ్ని పిలిపించి నిద్రపట్టడం లేదని చెప్తే, పాండవులు త్వరలో వస్తున్నారు అందువల్ల నీకు మనశ్శాంతి కరువైంది అని చెప్తాడు. పిలిచి రాజ్యం ఇవ్వమని చెబితే "వాడు నా మాట వినడు" ఇంకా ఏదైనా చెప్పు. ఆ విషయం వదిలేయ్ అన్నాడు. అరణ్యవాస సమయంలో ఒకసారి ఇదే మాట చెబితే విదురుడిని వెళ్లగొట్టాడు. ఋషులు వచ్చి హితబోధ చేస్తే అంతా విని ' వాడు నా మాట వినడు " అని చెప్పి పంపేశాడు.
ఎక్కడికక్కడ రాజ్యకాంక్ష వదిలి పెట్టకుండా , అందరినీ తిరస్కరించి చివరికి బ్రతికి వుండగానే 100మంది సంతానం నాశనం అయిపోయింది. చివరి వరకు తమ్ముడి కొడుకులు వేసిన బిక్ష తినాల్సి వచ్చింది.
పాండవులకు 5ఊళ్లు ఇవ్వమని శ్రీకృష్ణుడు సైతం అడిగాడు. అప్పుడైనా భయపెట్టి బెదిరించి దుర్యోధనుడి చేత ఇప్పించి ఉంటే అంత వినాశనం అన్ని కోట్ల మంది మరణించే వారు కాదు. కేవలం ఒకడి ఆస్తి, అధికారం కొట్టేయాలని చేసిన స్వార్థపూరిత ఆలోచన వల్ల అంత నష్టం జరిగింది.
ఎవరి లోపాలు వారు సరిచేసుకొని, పిల్లలని జగృత్తగా పెంచాలి మినహా ఇష్టారాజ్యంగా జీవిస్తాం అంటే కష్టాలు దుఃఖం తప్పదు. ఎవరి స్థాయిలో వారు ఉండాలి. ఒత్తిడి చేసిన కొద్దీ పిచ్చోడిలా తయారవుతారు.
కుంతీదేవికి భర్త లేకపోయినా, లోకాన్ని ఎదిరించి నిలిచే కొడుకులు ఉన్నా, ఎక్కడికక్కడ కట్టడి చేసి ధర్మంగా జీవించేలా పెంచింది. ఫలితం చిరస్థాయిగా నిలిచిపోయారు. ధర్మానికి రూపం ఎవరు అంటే ధర్మరాజు అనే చెప్తారు. భూమి ఉన్నంతకాలం ఆ పేరు అలానే ఉండిపోతుంది. ధర్మంగా జీవించారు. భగవంతుడు దిగి వచ్చి భగవద్గీత బోధించాడు. మంచిగా జీవించే ఎవరికైనా ఆ దైవబలం ఉండే తీరుతుంది.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment