[6/8, 06:05] +91 73963 92086: *🕉️🙏జైశ్రీకృష్ణ 🕉️🙏*
*🕉️🙏యోగము : "యోగ" అన్న పదం శ్రీమద్ భగవద్గీత లో సుమారుగా నూటయాభై చోట్ల వేర్వేరు ప్రయోజనాలకు ఉపయోగించబడినది. "యజ్" అన్న మూల ధాతువు నుండి ఇది వచ్చింది, అంటే "ఏకమవుట" అని అర్థం. ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూస్తే, జీవాత్మ, భగవంతునితో ఏకమవ్వటాన్ని "యోగం" అంటారు (ఉదా. 5.21వ శ్లోకం). కానీ, ఈ యోగాన్ని సాధించే శాస్త్ర విధానాన్ని కూడా యోగము అంటారు. (ఉదా. అ 4.1వ శ్లోకం). ఇంకా, ఈ శాస్త్ర విధాన పద్దతి ద్వారా సాధించిన పరిపూర్ణ స్థితిని కూడా యోగమనే అంటారు. (ఉదా. అ 6.18వ శ్లోకం). భగవంతునితో యోగం వలన వ్యక్తి సహజంగానే భౌతిక ప్రకృతి సంపర్కం చే జనించే క్లేశముల నుండి విడివడుతాడు. అందుకే, ఈ దుఃఖ విముక్తి దశ కూడా "యోగము" అని సూచించబడినది. (ఉదా. అ 6.23వ శ్లోకం). పరిపూర్ణత అనేది తనతోపాటుగా సమత్వ బుద్ధిని కలుగచేస్తుంది కాబట్టి, ఇటువంటి సమత్వం కూడా యోగము అని చెప్పబడింది (అ 2.48వ శ్లోకము). యోగ స్థితిలో ఉన్నవాడు అన్ని కార్యకలాపాలను సంపూర్ణ దోషరహితంగా, భగవత్ భక్తి దృక్పథంలో చేస్తాడు, అందుకే పనిలో నైపుణ్యం కూడా యోగము అని చెప్పబడుతుంది. (అ 2.50వ శ్లోకం)🕉️🙏*
*🕉️🙏అసలు ఈ "యోగం"ఎందుకు అవసరం అని ఎవరైనా అడగవచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే, భౌతిక జగత్తులో ఆనందాన్ని వెతకటం అనేది ఎడారిలో ఎండమావి వెంటపడటం లాంటిది. ప్రాపంచిక కోరికల స్వభావం ఏమిటంటే, వాటిని తీర్చటం అంటే అగ్నిలో ఆజ్యంపోసి ఆర్పటానికి ప్రయత్నించటమే. కొద్దిగా మంట జ్వాల తగ్గినట్టుగా అనిపించినా, అది మరింత ఉదృతంగా ఎగిసి పడుతుంది. అదే విధంగా, మనోఇంద్రియముల కోరికలను తీర్చటం అనేది లోభము/దురాశకు దారి తీస్తుంది. కానీ, కోరికలను నిరోధించటం కూడా మంచిది కాదు, ఎందుకంటే అది క్రోధమునకు దారి తీస్తుంది. అందుకే మనం కోరికలు ఎందుకు జనిస్తాయో అన్న మూల కారణాన్ని అర్థంచేసుకోవాలి మరియు దానిని సరిదిద్దటానికి ప్రయత్నించాలి. ఇదంతా మనం ఏదో వ్యక్తిలోనో లేదా వస్తువు లోనో ఆనందం ఉంది అని చింతన చేయటం నుండి జనిస్తాయి. ఈ నిరంతర చింతన, మనస్సుకి మమకారాసక్తి కలుగచేస్తుంది, మరియు ఈ ఆసక్తి కోరికను జనింపచేస్తుంది. కాబట్టి, ఆత్మ అన్వేషించే ఆ దివ్య పరమానందము భౌతిక ప్రాకృతిక వస్తువులలో లేదు అని మనం దృఢంగా నిశ్చయించుకుంటే, ఈ కోరికలు పుట్టటం ఆగిపోతుంది. కానీ, ఆనందం కోసం ఉన్న కోరిక ఆత్మకు సస్వభావ సహజంగా ఉండేది ఎందుకంటే అది సనాతనమైన దివ్య ఆనంద సముద్రం యొక్క అణు-అంశ. ఆత్మ ఎప్పుడైతే భగవంతుని అనంతమైన ఆనందాన్ని పొందుతుందో అప్పుడే దాని ఈ స్వస్వభావం తృప్తి చెందుతుంది. కాబట్టి, తెలిసినా, తెలియకపోయినా, ప్రతి ఒక్క జీవాత్మ, ఆ యొక్క భగవత్ ప్రాప్తి స్థితి లేదా "యోగ" స్థితికి చేరుకోవటానికి ప్రయాస పడుతున్నది.🕉️🙏*
*🕉️🙏భగవంతుని తో ఏకమవ్వటానికి ఉన్న వేర్వేరు మార్గాలనే వివిధములైన యోగ పద్ధతులు అంటారు. ఉదాహరణకు, కర్మ యోగము, జ్ఞాన యోగము, అష్టాంగయోగము మరియు భక్తి యోగము. అందుకే, ఆధ్యాత్మిక అభ్యాసకులను సాధారణంగా యోగులు (ఉదా.అ4.25వ శ్లోకం) లేదా సాధకులు అంటారు. ఒక్కోసారి, యోగ అన్నపదం అష్టాంగ యోగ పద్దతిని సూచిస్తుంది. (ఉదా. అ4.28వ శ్లోకం). ఇటువంటి సందర్భాలలో యోగి అంటే, ప్రత్యేకంగా అష్టాంగ యోగ అభ్యాసకుడినే సూచిస్తుంది.🕉️🙏*
*🕉️🙏జ్ఞాన యోగము (జ్ఞాన మార్గ పథము): ఈ యోగ పద్దతిలో, ఆత్మ జ్ఞానమునకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనినే శ్రీమద్ భగవద్గీత , ఒక్కోసారి సాంఖ్య యోగము అని కూడా పేర్కొంటుంది. బుద్ధి యొక్క విశ్లేషణ ద్వారా జ్ఞాని అనేవాడు ఆత్మ సాక్షాత్కారం కోసం పరిశ్రమిస్తాడు, అది సమస్త దేహ ఉపాధులకూ మరియు మలినములకూ భిన్నమైనది. ఆత్మ జ్ఞానమే అత్యున్నత లక్ష్యంగా పరిగణించబడుతుంది. జ్ఞాన యోగ అభ్యాసము, భగవత్ కృప సహకారం లేకుండానే సొంత ప్రయంత్నం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, అది కష్టతరమైనది మరియు ప్రతి అడుగులో పతనమయ్యే అవకాశం ఉంటుంది.🕉️🙏*
*🕉️🙏అష్టాంగ యోగము (ఎనిమిదంచెల మార్గము): దీనిలో, యాంత్రిక అభ్యాసము మొదలుకొని, మనో నిగ్రహము వరకూ క్రమబద్ధమైన పరిశుద్ధి ఓనర్చె ప్రక్రియ ఉంటుంది.* *దీని యందు, ప్రాణ శక్తిని వెన్నుపూస లోని సుషుమ్న నాడి ద్వారా పైకి లేపుతారు. దానిని మూడవ కంటి స్థానమైన కనుబొమల మధ్య నిలుపుతారు. ఆ తరువాత, అత్యంత భక్తితో దాన్ని పరమేశ్వరుని పై కేంద్రీకరిస్తారు. మహర్షి పతంజలి, తన ప్రఖ్యాత "యోగ సూత్రాలు" గ్రంథంలో దీనిని అభ్యాసం చేసే ఒక క్రమబద్ధ విధానాన్ని సూచించాడు. ఆ విధంగా, ఇది అష్టాంగ యోగము లేదా ఎనిమిది అంచెల యోగ విధానంగా ప్రాచుర్యం పొందింది. దీనికి కొద్ది తేడాతో ఉండేదే హఠ యోగము, దీనిలో నియమనిష్ఠలు ప్రధానంగా ఉంటాయి. మనస్సు మరియు ఇంద్రియములపై నియంత్రణని, సంకల్ప శక్తి ద్వారా సాధించటానికి హఠ యోగము ప్రయత్నిస్తుంది.*
[6/8, 06:06] +91 73963 92086: *చాలా ప్రదేశాలలో, వైదిక గ్రంధాలు, భగవత్ ప్రాప్తికి మూడు మార్గాలే ఉన్నాయని పేర్కొంటాయి - కర్మ యోగము, జ్ఞాన యోగము, మరియు భక్తి యోగము. ఈ విధమైన వర్గీకరణలో, అష్టాంగ యోగము, జ్ఞానయోగములో భాగంగా పరిగణించబడుతుంది.🕉️🙏*
*🕉️🙏భక్తి యోగము (భక్తి మార్గము): ఈ పథంలో మనస్సు భగవంతుని యొక్క నామములు, రూపములు, గుణములు, లీలలు మొదలైన వాటిపై, నిస్వార్ధ, అనన్య ప్రేమతో అనుసంధానం చేయబడుతుంది. భగవంతుడే తన సనాతనమైన తండ్రిగా, తల్లిగా, సఖుడిగా, స్వామిగా మరియు ఆత్మ-సఖుడిగా పరిగణిస్తూ, వ్యక్తి భగవంతుని పట్ల ప్రేమయుక్త సంబంధాన్ని పెంచుకుంటాడు. ఆయనకు శరణాగతి చేసి, స్వీయ చిత్తమును, భగవత్ చిత్తముతో ఏకీకృతం చేసి, భక్తుడు భగవత్ కృపను ఆకర్షిస్తాడు మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతని, ఇతర పద్దతులలో కంటే సులువుగా సాధిస్తాడు. శ్రీమద్ భగవద్గీత అన్ని యోగ విధానాలనూ సమర్ధించినా, అది పదేపదే భక్తి మార్గమే అత్యుత్తమ మార్గమని వక్కాణిస్తుంది. తాను భక్తిచే మాత్రమే తెలిసుకోబడుతాను అని శ్రీ కృష్ణ పరమాత్మ పదే పదే చెప్పిన ఉపదేశం, భక్తి అనేది తక్కువస్థాయి యోగ పద్దతి అని కొందరిలో ఉన్న అపోహని తొలగించటానికి, ఈ వ్యాఖ్యానంలో ప్రస్ఫుటంగా చెప్పబడినది.🕉️🙏*
*🕉️🙏కర్మ యోగము (కర్మ మార్గము): కర్మ అంటే వ్యక్తి చేసే ప్రాపంచిక విధులు మరియు బాధ్యతలు, అదే సమయంలో యోగం అంటే భగవంతునితో ఏకమవ్వటం. కాబట్టి, ప్రపంచంలో విహిత కర్మలు చేస్తూ కూడా భగవంతునితో మనస్సుని ఐక్యం చేయటమే కర్మ యోగము. అన్ని పనులు భగవత్ ప్రీతి కోసం మాత్రమే అన్న ధృడ సంకల్పాన్ని బుద్ధి యందు పెంపొందించుకోవటం ద్వారా, మనస్సుని కర్మ ఫలాలపై అనాసక్తితో ఉంచటం దీనికి అవసరం. అందుకే శ్రీమద్ భగవద్గీత , ఒక్కోసారి దీనిని బుద్ధి యోగము అంటుంది. చాలా మంది జనులు గృహస్తులుగా ఉంటూ, ప్రాపంచిక కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే, ఆధ్యాత్మికతను అభ్యాసం చేస్తారు కాబట్టి, వారికి, వేరే ఇతర ఎంచుకున్న యోగ విధానం తో పాటుగా కర్మ యోగము అనేది అవసరం అవుతుంది.🕉️🙏*
*🕉️🙏ఈ కొన్ని ముఖ్యమైన పదాల క్లుప్తమైన వివరణతో, ఇక ఈ "భగవంతుని గీత" ని చదివి, శ్రీ కృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీతలో అందించిన అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని స్వయముగా తెలుసుకునే అవకాశాన్ని నేను పాఠకునికే వదిలిపెడుతున్నాను.🕉️🙏*
*🕉️🙏జై శ్రీకృష్ణ 🕉️🙏*
*🕉️🙏రాధే రాధే 🕉️🙏*
*🕉️🙏 సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు 🕉️🙏*
No comments:
Post a Comment