*మీకు కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కధ.._*
ఆర్మీ అధికారికి ఓ వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది.*_
అందులోని విషయం ఇలా ఉంది ..._*
అయ్యా!_*
నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తూ రిటైర్ అయ్యాను.*_
_*నా కొడుకు ఆర్మీ లో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధం లో వీరమరణం పొందాడు.*_
_*ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాము.*_
_*అనుమతి ఇస్తే సంతోషము , అలా కుదరదు మీ ఉద్యోగాలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు.*_
_*ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తడిచాయి వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి.*_ _*అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీచేశారు.*_
_*ఆ వృద్ధ దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్నవారంతా వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు.*_
_*ఎందుకు బాబు నువ్వు మాత్రం ఇలా నువ్వు ఎంత పెద్ద అధికారివి అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు.*_
_*అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వారు నేను మీ అబ్బాయితో కలిసి పని చేసాను.*_
*అని ఒక నిమిషం మాటలురాక నిలబడిపోయాడు.*
_*పర్లేదు బాబు ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు నేను ఏడవను అని చెప్పాడు.*_
_*మీరు కాదు నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.*_
_*ఆనాడు పాకిస్థానీలతో యుద్ధం జరుగుతున్నది మా దగ్గర*_ _*ఆయుధాలు* *అయిపోవడంతో నేను డెత్* *ఛార్జ్ తీసుకుంటాను అని*_ _*ముందుకు వచ్చాను.*_ _*అప్పుడు మీ కొడుకు నన్ను లాగి*_
_*నీకు పిచ్చా నీకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు.*_
_*నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్లి ఆ తూటాలను తన శరీరంలో తీసుకున్నాడు.*_
_*శత్రువులను 13 మందిని చంపి ఇక్కడే మరణించాడు.*_
_*అతడిని మొదటగా పట్టుకున్నది నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు పోయింది*._ _*శరీరంలో 42 తూటాలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు.*_
_*అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డుపెట్టుకుని ఏడ్చేసింది.*_
_*ఆరోజు నేనే శవాన్ని తీసుకురావలసింది దగ్గర ఉండి అతడిని మోసిఉండాల్సింది కానీ నాకు వేరే డ్యూటీ వేశారు ఆరోజు అతడి కాళ్లపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా ఋణం తీర్చుకుంటున్నాను అని అన్నాడు.*_
_*బాబు నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాము కానీ వాడి మరణవార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలి పెట్టాలని తెచ్చాము కానీ అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని అర్థం అవుతున్నది.*_
_*నీకు అభ్యన్తరం లేకపోతే తీసుకో బాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లితండ్రులు.*_
_*ఇలాంటి కథలు వాస్తవాలు ఇంకెన్నో*_
*ఇవేవి మనకు తెలియవు మనం ఆలోచించను లేము*
*రాజకీయనాయకుడికి పాలాభిషేకం చేసుకుంటూ*_
_*నటించే హీరోలకు భారీగా కట్అవుట్లు పెట్టుకుని వాళ్ళే దేవుళ్ళని మన సమయాన్ని మన విలువని పోగొట్టుకుంటున్నాము.*_
*ఇలాంటి వీరజవాన్ల ఎంతో మంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు.*
_*కనీసం మనం గుర్తించలేక పోతున్నాం*_ ..
No comments:
Post a Comment