*_నేటి మాట_*
*దైవానుగ్రహం కలగాలంటే ఏమి చేయాలి???*
చిన్న పిల్లల నుండి మనం నేర్చుకోవాల్సింది ఒకటుంది..! అది అందరూ గమనించే ఉంటారు.
ఎవరైనా వాళ్లకోసం ఏదైనా వస్తువు లేదా బొమ్మ తెచ్చినప్పుడు, *' ఇది నాది ' అని గట్టిగా వాదిస్తారు*.
అది ఎంత చిన్నదైనా సరే, ' ఇది నాది ' అని వాళ్ళు అనుకున్నారంటే ... బంగారం వారి ముందు పెట్టినా కూడా ఆ వస్తువును ఇవ్వడానికి ఒప్పుకోరు..
మనం కూడా సరిగా భగవంతుని విషయములో మనం ఇలానే ఉండాలి...
' భగవంతుడు నా వాడు ' అని గట్టిగా అనుకున్న తరువాత ఎలాంటి ప్రాపంచిక వస్తు విషయ సుఖాలకు లొంగకూడదు.
సంసారపు మాయలో పడి సర్వేశ్వరుని మరువకూడదు, విడువకూడదు.
దైవానుగ్రహం చిక్కవలెనంటే దైవాన్ని దృఢముగా పట్టుకోవాలి..
అప్పుడే ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతాము .
*_🌺శుభమస్తు.🌺_*
*🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*
No comments:
Post a Comment