Sunday, June 30, 2024

****మనం సుఖముగా, ప్రశాంతముగా ఉండవలెనంటే !!..* ఈరోజుల్లో అందరూ కోరుకునేది ఇదే!!...

               *_నేటి మాట_*

*మనం సుఖముగా, ప్రశాంతముగా ఉండవలెనంటే !!..*
ఈరోజుల్లో అందరూ కోరుకునేది ఇదే!!...
మరి ఏమి చేయాలి ??...
మనం మన కోరికలను, అవసరాలను తగ్గించుకుంటూ వైరాగ్య భావం పెంచుకోవాలి...

ఏదైనా కోరిక కలిగినప్పుడు, 
ఇది నాకు అత్యవసరమా? అని ప్రతి కోరికనూ గీటురాయిమీద పరీక్షించుకోవాలి...

మన ఇంటిలో అనేక వస్తువులను పోగుచేసుకుంటే దుమ్మూ చీకటీ తప్ప ఒరిగేదేమీ ఉండదు. 

అలాగే మన మనస్సులో విషయాలను అధికంగా చేర్చుకుంటే దుఃఖము, బాధలు తప్ప ఇంకేమి రావు!!...

కనుక బయట ఉన్నవన్నీ లోపల చేర్చవద్దు,
తక్కువ సరంజామాతో పయనం చేసినపుడే గమ్యం చేరుకోవడం సులభం మరియు సురక్షితం. 

ప్రాణం నిలుపుకోవడానికి, ఆరోగ్యం కాపాడుకోవడానికి తగినంత ఉంటే చాలును...

తగుమాత్రం ఉప్పు వేసినప్పుడే పప్పు రుచిగా ఉంటుంది...
ఉప్పు ఎక్కువైతే రుచి చెడిపోతుంది, అట్లే కోరికలను ఎక్కువ చేసుకుంటే జీవితం దుర్భరమవుతుంది...

               *_🪷❤️శుభమస్తు._🪷*
 *🙏సమస్త లోకా సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment