Sunday, June 30, 2024

 *_అదేంటో మనిషి ఈరోజుల్లో బంధాలను తెంచుకుంటున్నాడు, ఆస్తులు పెంచుకుంటున్నాడు. తీరా చనిపోయాక కొడుకులు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులను మర్చిపోతున్నారు._*

*_రేపటి రోజుల్లో మానవకాలం పోయి యంత్రాల (రోబోల) కాలం వచ్చేలా ఉంది. మనిషి మనిషిని ప్రేమించడం మానేసి... డబ్బుల వెంట ఆస్తుల  వెంటవెళుతున్నారు._*

*_బరితెగించిన వారికి బంధాల బరువు తెలియదు. బజారుకి ఎక్కిన వారికి సంసారం విలువ ఎలా తెలుస్తుంది. చావు చేరే వరకు తెలీదు, బంధం విలువ. కర్మ కాలి మనిషి మంచాన పడితే గానీ, అర్థం కాదు ఈ అతుకుల బొంత బ్రతుకు విలువ ఎంత అనేది._* 

*_కాలం గుడ్డిది కాదబ్బ ఏంత ఎగిరెగిరి పడ్డ కింద పడక తప్పదు. పడిన రోజు అలా ఎందుకు బ్రతికానా... అని కుళ్లి కుళ్లి ఏడ్చేలా చేస్తుంది కాలం._*

*_అప్పుడే కదా నీకు తెలిసేది బ్రతుకు విలువ ఎంత అనేది. అందుకే... మనమంటే విలువ లేనివాళ్ళ దగ్గరికి వెళ్లి పదేపదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది.☝️_*

    *_సదా మీ శ్రేయోభిలాషి... 👏_*
🌹🌹🌹 🌻🙇‍♂️🌻 🌹🌹🌹

No comments:

Post a Comment