[6/26, 09:09] +91 94918 93164: భారతదేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి, ఇవి నాటి వైభవానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. దేవాలయాలను చూసినపుడు ప్రధానంగా ఆకర్షించేది దాని గోపురం. ఆప్పట్లోనే ఎంతో ఎత్తుతో, మరెంతో శాస్త్ర విజ్ఞానంతో నిర్మించిన గోపురాలు అబ్బురపరుస్తాయి. ఆనాటి నిర్మాణశైలిని, శతబ్దాలు గడిచినా నేటికి చెక్కుచెదరకుండా ఉండే వాటి దృఢత్వం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. సాధారణంగా గుడికంటే ఎక్కువ ఎత్తులో గోపురం ఉంటుంది. మరి ఈ గోపురాలను ఎందుకు నిర్మిస్తారు?
ఆలయం అంటేనే సకలదేవతలు అక్కడ కొలువుంటారని భక్తుల నమ్మకం. ఆలయంలోని ప్రతి భాగంలోనూ అనేక విశేషాలు ఉన్నాయి. వాటి అధిదేవతలు కొందరు ఉన్నారు. ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి వీటిపై కనీస అవగాహన అవసరం. ఆలయాన్ని, ఆలయ భాగాలనూ సాకల్యంగా తెలుసుకోవడం వలన మనకు మరింత ఆధ్యాత్మికత అలవడి భగవదనుగ్రహాన్ని పొందగలుగుతాం.ఉదాహరణకు గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, వాహన మండపం, రంగమండపం, పరివారదేవతలు, కోష్ఠదేవతలు, శిఖరం, విమానం ఇలా అనేక భాగాలున్నాయి. ఆలయం లేని ఊరిలో క్షణం కూడా ఉండరాదంటున్నాయి మన ఆగమాలు. భగవంతుడు సదా నివాసముండే చోటే ఆలయం. ఆలయాలకు గోపురాలు నిర్మించడం అనేది పల్లవులు, చోళ వంశీయుల నుంచి మొదలైందని చరిత్ర కథనాల ద్వారా తెలుస్తోంది. పన్నెండవ శతాబ్దం నాటికి పాండ్యులు ఈ గోపురాలను దేవాలయాలకు ముఖద్వారంగా నిర్మించినట్లు చెబుతారు. ఈ గోపురాలు ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. ఒక ఆలయ గోపురం అంతస్థుల మాదిరిగా కింద పెద్ద ద్వారంగా మొదలై, పైకి వెళ్తున్నకొద్ది వెడల్పు తగ్గుకుంటూ పోతుంది. చివరి అంచున కలశం అనేది ఏర్పాటు చేస్తారు.
అనంత విశ్వమంతా నిండిన భగవంతుని ఉనికిని ఒకచోట చేర్చి, ఆలయం నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించి, సదా అందులో సాన్నిధ్యం కల్పించి భక్తుల్ని బ్రోవమని కోరుతారు అర్చకులు. ఈ సమాజంలో మనిషిని సన్మార్గంలో నిలిపేవి రెండు ఒకటి గుడి, రెండు బడి. నిజానికి పూర్వం బడులు కూడా గుడిలోనే ఉండేవి. ఆలయం కేవలం అర్చనాదులకే పరిమితం కాలేదు. విద్యను నేర్పే పాఠశాలగా, ఆకలి తీర్చే అన్నశాలగా, సంస్కృతిని నిలిపే కళాకేంద్రంగా, ప్రజలసమస్యలను తీర్చే న్యాయస్థానంగా, వసతిని కల్పించే వాసస్థానంగా, ప్రకృతి ఒడిదుడుకులు సమయంలో రక్షణాకేంద్రంగా, సకల వృత్తులవారికీ పని కల్పించే ఉద్యోగ కేంద్రంగా నిలిచింది. ఇలా ఆలయం మానవుని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది.
కాలిగోపురమే గాలి గోపురంగా
ఆలయంలోని అణువణువునా భగవంతుని ఉనికిని గుర్తించాలి. అయితే, ఆలయం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గోపురం. చాలా ఎత్తుగా, అనేక అంతస్తులతో, అనేక శిల్పాలతో, చూడగానే భక్తుడికి ఒక పవిత్ర భావాన్ని కల్పించి, మరికాసేపట్లో దేవుడిని దర్శనం చేసుకుంటామనే ఆనందాన్ని కలిగిస్తుంది గోపురం. గోపురాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.ఆలయానికి తొలివాకిలి గోపురం. దీనికే ద్వారశాల అనే పేరు కూడా ఉంది. ద్వారం పైన నిర్మించే నిర్మాణం కనుక ఇది ద్వారశాల. మరికొందరు గాలిగోపురం అని చెబుతుంటారు. గోపురం లోపలికి రాగానే వాతావరణం ఎంత వేడిగా ఉన్నా చల్లటిగాలి వీస్తుంది. బహుశా అందువలన అందరూ ఇలా అంటారని భావించవచ్చు. కానీ నిజానికి ఆలయంలోని ప్రతిభాగం భగవంతుని శరీరభాగంగా కీర్తిస్తున్నాయి ఆగమాలు. అలా గోపురం భగవంతుని పాదాలుగా కీర్తించబడుతున్నాయి. కాలిగోపురం కాలక్రమేణా గాలిగోపురం అయిపోయింది. మనం ప్రయాణాలలో ఉన్నప్పుడు దూరంగా ఆలయం ఉనికిని తెలిపేది ఆలయగోపురమే.అలా గోపురం కనిపించిన వెంటనే చాలా మంది నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం భగవంతునికి తప్పక చేరుతుందని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, గోపురానికి నమస్కరిస్తే భగవంతుని పాదాలకు నమస్కరించినట్లే.గోపురం ఒక నిర్మాణం మాత్రమే కాదు. అది పౌరాణిక విజ్ఞానాన్ని తెలిపే పాఠశాల. గోపురంపై అనేక పురాణ ఘట్టాలు శిల్పాలుగా నయనానందకరంగా చెక్కబడి ఉంటాయి. గోపురాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి అతి పెద్ద గోపురాలను నిర్మించింది మాత్రం పాండ్యురాజులే. మధురైలోని మీనాక్షీ ఆలయ గోపురాలే అందుకు నిదర్శనం.హంపీ విరూపాక్ష దేవాలయంలో గోపురానికి సంబంధించిన ఒక విశేషం ఉంది. ఆలయంలోని ఒకచోట తూర్పు రాజగోపురం నీడ తల్లకిందులుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో గల నరసింహ స్వామి ఆలయ గాలిగోపురం కూడా ఎత్తయిన గాలిగోపురాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది.
గోపురం అనేది ప్రధానంగా ఆలయ సన్నిధికి ముఖద్వారం. బాటసారులు వెళ్లేటపుడు దూరం నుంచి కూడా కనిపించేలా ఆలయ గోపురం, దాని ధ్వజస్థంభం నిర్మించేవారు. పురాతన కాలంలో, ఎత్తైన గోపురాలు ప్రయాణికులకు ల్యాండ్మార్క్లుగా ఉపయోగపడేవి. ఇవి దిక్కులను కూడా సూచించేవి. ఆలయగోపురం నాలుగు దిశలలో నిర్మిస్తే, మధ్యలో గర్భగుడికి ఎదురుగా ఆలయ ధ్వజస్థభం ప్రతిష్ఠాపన చేసేవారు.
ఈ గోపురాలకు శాస్త్రీయ ప్రయోజనం కూడా ఉంది. ఇవి ఎత్తుగా ఉండటం వలన మెరుపు వాహకాలుగా పనిచేసేవి. ఆలయం చుట్టుపక్కల ఎలాంటి పిడుగుపాట్లు జరగకుండా మెరుపులను ఈ గోపురాలు స్వీకరిస్తాయి. గర్భ గుడిలో ఉండే దేవతామూర్తి వద్దకు శక్తి ప్రసారం చేయడం జరిగి, అక్కడ శక్తి నిక్షిప్తం అవుతుందని విశ్వసిస్తారు. అందుకే మందిరం చుట్టూ సవ్యదిశలో చేసే ప్రదక్షిణల వలన మానవ శరీరాలకు సానుకూల శక్తి లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు. గర్భగుడి భగవంతుని శిరసు, ఆలయ మంటపం భగవంతుని కడుపు,ఆలయ గోపురం దేవుడి పాదాలు. దైవ దర్శనం అంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి, స్వామిని చూసి గంటకొట్టి నమస్కరిస్తాం. కాని ముసలివాళ్ళూ,రోగులు,నిత్య జీవితంలోని అనేక కార్యక్రమాల వల్ల గుడికి వెళ్ళలేనివారు (వెళ్ళే అవకాశం లేనివారు),తామున్న ప్రాంతం నుంచే దూరంగా,ఎత్తుగా కనిపిస్తున్న గోపురానికి నమస్కరిస్తే ఆలయంలో ఉన్న అమ్మపాదాలకు నమస్కరినట్టేనని శాస్త్రం తెలియజేస్తోంది. పూర్వాకాలంలో ఈరోజు ఉన్నట్టుగా హోటల్ సౌకర్యాలు లేవు.ఇతర దేశాలు, రాజ్యాలు,ప్రదేశాల నుండి వచ్చిన బాటసారులకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి గోపురాలు ఎత్తుగా కట్టారు. అంతేకాదు,ఆ కాలంలో దేవాలయాల్లో నిత్యం అన్నదానం జరిగేది. వైద్య సదుపాయాలు కూడా దేవాలయంలో ఉండేవి. అందువల్ల క్రొత్తగా వచ్చిన వారు ఆకలితో ఆహారం కోసం వెత్తుక్కునే పరిస్థితి నేరుగా దేవలయాలకే వెళ్ళి,అక్కడ ప్రసాదం స్వీకరించేవారు,సేద తీరేవారు. వారికి మార్గ నిర్దేశకాలు గోపురాలే కదా.
గోపురం అంటే పిరమిడ్ ఆకారం .పిరమిడ్ ఆకారాలు మాత్రమే కొన్ని వందల,వేల సంవత్సరాలు స్థిరంగా ఉంటాయి కనుక వాటిని పిరమిడ్ ఆకారంలో నిర్మిస్తారు.అంతేకాదు గోపురం ఈ బ్రహ్మాండంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని ఆకర్షిస్తుంది.కొన్ని వందల,వేల సంవత్సరాల వరకు గోపురాలు శక్తిని గ్రహించి,నిలువ ఉంచుకునే శక్తి కేంద్రాలు. అంతేకాదు మొత్తం దేవాలయానికి అది దివ్యశక్తులను నిత్య అందిస్తూ ఉంటుంది. కనీసంలో కనీసం 500 సంవత్సారాల పాటు ఒక గోపురం అనేక దివ్యశక్తులను దేవాలయానికి అందిస్తుంది.అంటే గోపురం కూడా ఒక అమోఘ శక్తి కేంద్రం.అందుకే దేవాలయానికి వెళ్ళవలసిన రీతిలో వెళ్తే కనుక,ఆలయగోపురం క్రింది నుంచి వెళ్తున్న సమయంలో మనలో తెలియని ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది.
దేవుడు సర్వోన్నతుడు! ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారీ మనిషికి, మనస్సుకీ బోధపడటానికి దేవాలయాన్నీ దేవాలయగోపురాన్నీ ఎంత వీలైతే అంతగా ఎత్తుకి నిర్మిస్తారు. దేవాలయం ఒక వ్యక్తికీ ఒక కుటుంబానికీ సంబంధించి వుండదు. సార్వజనిక ఆస్థిగా పరిగణింపబడుతూ, పోషింపబడుతూ, రక్షింపబడుతూ, దర్శింపబడుతూ వుండాలి. దాతలేవరైనా దేవాలయానికి దానాదికాలను చేయవచ్చు. పోషకులుగా వుండవచ్చు. వేశ్యలు కూడ దేవాలయాలను కట్టించి దాఖలాలు ఎన్నో వున్నాయి. సర్వజనానీకానికీ, పొరుగువూరివారికీ, పరదేశ వాసులకూ, క్రొత్తగా వచ్చినవారికీ దేవాలయం ఎక్కడ వున్నదో సులభంగా తెలుసుకోవటానికి బాగుటుంది. కాబాట్టి ఆలయగోపురం ఎత్తుగా వుండాలి. దేవాలయ గోపురమే కాదు దేవాలయం కూడా ఎత్తుమీద వుండటం హితదాయకం. అందుకే ఎన్నో దేవా లయాలు కొండలు గుట్టలు చూచుకొని మరీ నిర్మిస్తారు. ఎందుకంటే, మానవు డెంతటి తెలివికలవాడై ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేదు! కాలేడు! వరదబీభత్సాల తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవలసిందే. అటువంటి ప్రకృతి ప్రళయసమయాలలో ప్రాణాలు కాపాడగల్గిన స్థలం దేవాలయమే!
దేవుడు సర్వోన్నతుడు! ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారీ మనిషికి, మనస్సుకీ బోధపడటానికి దేవాలయాన్నీ దేవాలయగోపురాన్నీ ఎంత వీలైతే అంతగా ఎత్తుకి నిర్మిస్తారు. హిందూదేవాలయాలేకాదు. మసీదుకి కూడా పొడవైన స్తంభం నిర్మిస్తారు. చర్చికి కూడా ముందుభాగంలో ఎత్తుగా దూరానికి కన్పించే విధంగా అంతస్థు నిర్మించి గంటను కడతారు.
[6/26, 09:09] +91 94918 93164: దాదాపు గుళ్లు అన్నింటిలోనూ ధ్వజస్తంభం ఉండి తీరుతుంది. ఆలయంలోని ప్రధాన దేవత గర్భగుడి ముందు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ ధ్వజస్తంభం లేని గుడులు కూడా ఉంటాయా? ఒకవేళ ఉంటే ఆలయంలో ప్రదక్షిణ చేయవచ్చా? అనే విషయాలను తెలుసుకుందాం. ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఎంత వైభవంగా చేస్తారో.. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా అంతే వైభవంగా నిర్వహిస్తారు. దీన్ని బట్టే ధ్వజస్తంభానికి ఉండే విలువేంటో తెలుసుకోవచ్చు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన సమయంలో నవరత్నాలతో పాటు వివిధ రకాల లోహాలను కూడా పెడుతుంటారు.
ఆలయంలో శక్తి ఉంటుంది. ఇక ధ్వజస్తంభం ఉంటే.. ఆలయంలో గర్భగుడితో పాటు ధ్వజస్తంభాన్ని కూడా కలుపుకుని చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండదు. వాటిని వాయు ప్రతిష్ట అంటారు. ఇటువంటి ఆలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాలు అవసరం లేదట. వీలైనప్పుడు చేయవచ్చు. అటువంటి ఆలయాల్లో ప్రదక్షిణ చేయాలా? అంటే.. ఆత్మ ప్రదక్షిణ చేసినా శక్తి వస్తుంది కదా.. అలాగే మనం ఇంట్లో పెట్టుకునే తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు కదా.. కాబట్టి దేవాలయంలో ధ్వజస్తంభం ఉన్నా లేకున్నా ప్రదక్షిణ చేయవచ్చు. అయితే ప్రదక్షిణ కారణంగా మనకు వచ్చే శక్తిలో ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు కానీ ప్రదక్షిణ చేయడంలో తప్పేమీ లేదని పండితులు చెబుతారు
No comments:
Post a Comment