*_నేటి మాట_*
*అంతర్ దృష్టి*
"ప్రపంచం ఒక మిథ్య , ఇక్కడ మీరు చూస్తున్నది అంతా మాయ"...!
మీ కళ్ళతో చూసేది ఏదీ శాశ్వతం కాదు!
అసలు మీ కండ్లే శాశ్వతం కానపుడు వాటితో చూసేవి ఎట్లా శాశ్వతం అవుతాయి?...
బాహ్యేంద్రియాలు కేవలం భ్రమను మాత్రమే కలిగిస్తాయి.
సత్యాన్ని చూడాలంటే మీరు అంతర్ దృష్టి అలవర్చుకోవాలి, భగవంతుడు నిత్య సత్యమైనవాడు.
ఆయనను చూడాలంటే మనోదృష్టితోనే సాధ్యం, మీరు దేవుడు ప్రత్యక్షం అవ్వాలని అనుకుంటూ ఉంటారు.
నిజానికి దేవుడు మీ ముందు ప్రత్యక్షం అయినా కూడా మీరు మీ బాహ్య కళ్ళతో ఆయనను చూడలేరు!
చూడలేని దానికోసం ఎందుకు తపన? మీలో అంతర్ దృష్టి ఉంటే దేవుడు ప్రత్యక్షం కాకున్నా కూడా మీరు ఆయనను దర్శించగలరు.
అంతర్ దృష్టి వలన దైవము మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు మీ ముందు నిలబడతాడు.
మీతో మాట్లాడుతాడు, మీతో కలిసి నవ్వుతాడు, మీరు అడిగింది ఇస్తాడు, మీకు ఏమి కావాలన్నా చేస్తాడు.
కనుక ముందు బాహ్యాన్ని తగ్గించుకోండి, అంతర్ దృష్టిని అభివృద్ది చేసుకోండి, దైవమును అంతరాత్మలో ప్రతిష్టించుకుని ఆరాధించండి "...
*_☘️శుభమస్తు.☘️_*
*🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*
No comments:
Post a Comment