Sunday, June 30, 2024

****బయట తినేప్పుడు జాగ్రత్తగా ఉండండి

 బయట తినేప్పుడు జాగ్రత్తగా ఉండండి  
మనం ఎప్పుడూ ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని లేదా కుళ్ళిన ఆహారాన్ని తినము.!!! కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితే దాపురించింది!!! కొంచెం ఆలోచించండి.

కొద్ది రోజుల క్రితం మా పరిచయస్తులు మమ్మల్ని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళారు. నాకు సాధారణంగా బయట తినే అలవాటు లేదు, కానీ కొన్ని సార్లు సామాజిక ఒత్తిడితో అనివార్యం అవుతుంది.

ఈ రోజుల్లో పనీర్ పదార్థాలు తినడం విలాసానికి గుర్తుగా భావించబడుతోంది, కాబట్టి వారు పనీర్‌తో కొన్ని వంటకాలు ఆర్డర్ చేశారు. ప్లేట్‌లోని పనీర్ ముక్కల విభిన్న పరిమాణాలు మరియు రంగులను చూసి నాకు ఏదో తేడాగా అనిపించింది. ఆ ముక్కలు ఉద్దేశపూర్వకంగా కత్తిరించి వండినట్లు అనిపించింది. నేను వెయిటర్‌ను పిలిచి, ఆ హోటల్లో వంట వండినవాణ్ణి తీసుకురావాలని కోరాను. అతడు వచ్చినప్పుడు, నేను అడిగాను, "పనీర్ ముక్కలు ఎందుకు విభిన్న పరిమాణాలు మరియు రంగుల్లో ఉన్నాయి?" అప్పడు అతను అన్నాడు, "ఇది మా ప్రత్యేక వంటకం."

దానిపై నేను అతనికి చెప్పాను, "నేను ఇదే వంటకం మరొక ప్లేట్ ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాను. కానీ మీ ప్రత్యేక వంటకం నా ముందే వండండి." రెస్టారెంట్ మొత్తం నా పెరిగిన స్వరంతో వణికిపోయింది... చాలామంది తమ భోజనాన్ని ఆపేసి నా వైపు చూడటం మొదలుపెట్టారు.

హోటల్ సిబ్బంది వివిధ కారణాలు చెప్పడం ప్రారంభించారు. చివరకు పోలీసుల భయంతో, వెయిటర్ అసలు కారణాన్ని తెలియజేసి తప్పును అంగీకరించాడు. కస్టమర్లు  చాలా సార్లు తమ ప్లేట్‌లలో అన్నం, కూరగాయలు, సలాడ్‌లు మరియు చపాతీలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హోటల్ సిబ్బంది వాటిని అన్నీ పడేయడం లేదు. పెద్ద పనీర్ ముక్కలను మరియు కూరగాయలను తిరిగి మరొక వంటకంలో కలిపి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది.

ప్లేట్‌లలో మిగిలిన సలాడ్ కొత్త ఆర్డర్ కోసం ఉపయోగించబడుతుంది. ప్లేట్‌లలో పడేయబడిన ఎండిన చికెన్ మరియు మాంస ముక్కలను తిరిగి కర్రీలో వేసి, పైపైన అలంకరించి, వినియోగదారులకు తిరిగి వడ్డించబడుతుంది.

ఇది పెద్ద పెద్ద హోటల్‌లలో జరిగే వాస్తవం. ఇక మీదట, ఎప్పుడు హోటల్‌లో భోజనం చేయడానికి వెళ్తే, మిగిలిన భోజనం ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, బయటకు వెళ్లి జంతువులకు ఆహారంగా ఇవ్వండి లేదా ఆ సంచి చెత్తబుట్టలో మీరే స్వయంగా వేయండి, లేదంటే, మీ ప్లేట్‌లోని భోజనం మరొకరి ప్లేట్లో నుంచి వచ్చిన ఎంగిలి ఆహారమై ఉండొచ్చు లేదా మీరు తినగా మిగిలిన భోజనం మరొకరికి ఆహారం కావచ్చు. జాగ్రత్త!!
----

మరో సంఘటన శ్రీకృష్ణుని జన్మస్థానం అయిన బృందావనంలో జరిగింది. బృందావనం చేరుకున్న తర్వాత, నేను నేను బృందావనాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా చూస్తున్నాను. ఢిల్లీ నుండి సుదూర ప్రయాణం చేసిన తర్వాత మేము అందరమూ ఎంతో ఆకలితో ఉన్నాము. అందుకే ఒక శుభ్రంగా కనిపించే భోజనశాలలో ప్రవేశించాము. ఆర్డర్‌కు ఆలస్యం కాకుండా ఉండటానికి డిష్‌ల కంటే రెడీమేడ్ భోజన థాళిలను ఆర్డర్ చేసాము.
ఒక శుభ్రమైన ట్రే ద్వారా దాల్, కూరగాయలఅన్నం, రైతా మరియు ఒక బుట్టలో చపాతీలు తీసుకువచ్చారు.

మొదటి కొద్దిముక్కల తిన్నప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. చపాతీ పుల్లగా ఉండగా, కూరగాయల రంగు విభిన్నంగా ఉంది. అన్నం రుచి కూడా అసహజంగా ఉంది. అందరం భోజనం అలాగే వదిలేసి, కౌంటర్ వద్దకి బిల్లు ఎంత అని అడిగాము, 650 రూపాయల బిల్లు ఇచ్చారు.

నేను చెప్పాను, "బాబు, నేను చెల్లిస్తాను, కానీ ఒకసారి మీ కిచెన్ చూపించండి." అతను ఉలిక్కిపడుతూ, "ఏమైంది?" అని అడిగాడు. నేను చెప్పాను, " ఒక కస్టమర్ గా, నేను భోజనం ఎలా తయారవుతున్నదో చూడటం నా హక్కు." అతను సమాధానం చెప్పే ముందే నేను కిచెన్‌లో ప్రవేశించాను.

లోపల, ఎటువంటి వంట జరగడం లేదు. కొన్ని చపాతీలు ఒక బుట్టలో ఉన్నాయి. ఫ్రిజ్ తెరిచి చూశాను, లోపల వేరే వేరే రకాలుగా వండిన కూరగాయలు ఉన్నాయ్, చాలా రకాల వండిన కూరగాయలు మూతలు లేని పాత్రలలో ఉన్నాయి మరికొన్నింటి నుంచి కుళ్ళిన వాసన వస్తుంది ఫ్రిజ్ మొత్తం దుర్వాసన కొడుతోంది, వంట చేసేవాడిని నాలుగు తిట్టిన తర్వాత అతడు అసలు నిజం చెప్పాడు. ఈ కూరగాయలు వారం రోజులుగా ఉన్నాయి. 

అతను మరొక విషయం కూడా చెప్పాడు, వండేటప్పుడు పాత కూరగాయలను, కుళ్ళిన కూరగాయలను మళ్లీ నూనెతో వేడి చేసి కొత్తిమీర టమాటాలతో అలంకరించి మళ్ళీ కొత్త వంటకం లాగ వేరే కస్టమర్లకు వడ్డిస్తాం.

చపాతి పిండిని కూడా రెండు రోజులకు ఒకసారి తయారు చేస్తాము. కరెంటు కోత కారణంగా ఫ్రిజ్ లోని ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆ చెడిన వాసనను తెలియనివ్వకుండా మరిన్ని మసాలాలు, కారము కలిపి వంట చేసి సర్వ్ చేస్తాము. పులిసిపోయిన చపాతి పిండిని నాన్ తయారీకి ఉపయోగిస్తాము.

నేను రెస్టారెంట్ యజమానితో చెప్పాను, "మీరు కూడా ఎప్పుడైనా యాత్రలు చేస్తారు, మీరు యాత్రలో ఆకలితో ఉండగా మీకు కూడా మీరు మీ కస్టమర్లకు ఇచ్చినటువంటి భోజనమే రావాలి." నా మాటలతో అతని ముఖం నల్లగా మారింది....

ఈ రోజు మనకు జరిగే ఇటువంటి ప్రమాదాలు మరియు మోసాల నుండి కేవలం మన అప్రమత్తత మాత్రమే రక్షిస్తుంది. ఎందుకంటే దేవుడు కూడా చెడ్డవారి వలయములో చిక్కుకుని ఉన్నాడు.

భారతదేశంలో సత్యం మరియు అసత్యం మధ్య తేడా క్షీణిస్తోంది. ప్రతి దుకాణం లేదా సంస్థలో ఒక మూలలో దేవాలయం ఉంటుంది. వ్యాపారి ఉదయం వచ్చినప్పుడు దేవుని విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగిస్తాడు, కౌంటర్‌ని నమస్కరించి, ఆ తర్వాత తన ఆత్మను విక్రయించడం ప్రారంభిస్తాడు!!!

దేవుని వద్ద భక్తులు అడిగేటప్పుడు, వారు ప్రపంచానికి ఏమి ఇస్తున్నారో ఆలోచించరు!!!
జాగ్రత్తగా ఉండండి! అప్రమత్తంగా ఉండండి!! బయట తినడం నివారించండి. 🙏
ఇంటి ఆహారం అత్యుత్తమం. 🌹

No comments:

Post a Comment