టెన్షన్స్ లేని జీవితం కోసం కొన్ని పర్సనల్ రూల్స్ పెట్టుకుంటే బావుంటుంది అనిపిస్తోంది. అందులో కొన్ని.....
1. నీ సమస్యలు ఎవరికీ చెప్పకు
2. ఎవరితో సమస్య ఉంటే వారితోనే నేరుగా మాట్లాడు
3. ఎక్కువ ఆలోచించు, బిజీగా ఉండు
4. అక్టివ్ గా ఉండు, కనీసం యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించు
5. స్పీడ్ గా పని చేయి
6. ఏదైనా చేయాలి అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేయి
7. ఫోన్ ఎక్కువ వాడకు
8. బుక్స్ ఎక్కువ చదువు
9. కరెంట్ అఫైర్స్ చదువు
10. అనవసరంగా ఎక్కువ అందుబాటులో ఉండకు
11. మాత్రలు వేస్కో (ఏస్కోవాల్సి ఉంటే)
12. ఫిట్నెస్ మైంటెన్ చేయి
13. స్వీట్ & కార్బ్స్ ఎక్కువ తినకు
14. బాగా నిద్రపో
15. నీ గురించి ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నా పట్టించుకోకు
16. ఎదుటివాడు కూడా నీలా ఆలోచించాలి అనుకోకు
17. వీలైతే థాంక్స్ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయి. లేదా మూసుకొని ఉండు
18. అడగకుండా హెల్ప్ చేయకు
19. ఉచిత సలహాలు ఇవ్వకు
20. అప్పు ఇవ్వకు, తీసుకోకు
21. ఒకవేళ అప్పు కావాలి అంటే బ్యాంకు లో తీసుకో
22. అనవసర వస్తువులు కొనకు
23. హోటల్స్ లో తినడం తగ్గించు
24. పని చేపించుకున్నాక ప్రతిఫలం ఇవ్వు
25. ఏదీ ఉచితంగా తీసుకోకు
26. ఆఫీస్ ని ఇంటికి మోసుకురాకు
27. రోజూ ఏమి చేయాలో ముందురోజు షెడ్యూల్ వేసుకో
28. ఇవాళ ఏమి చేశావో రాత్రి పడుకునేముందు నిన్ను నువ్వు అసెస్ చేసుకో
29. సుఖంగా ఉండడానికి కాకుండా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు
30. ఉన్న రిలేషన్స్ చాలు. ఎక్కువ రిలేషన్స్ పెట్టుకోకు
31. నెలకు ఒకసారి ఎక్కడికైనా తిరిగి చావు
32. ఎప్పుడూ ఇంట్లోనే ఓ మూల మంచం మీద పడి చావకు
33. కథలు, కవితలు, వ్యాసాలు రాయి. రాయడం ఆపకు
34. నేర్చుకోవడం మానేస్తే చచ్చినట్టే, రోజూ కొత్తగా ఉండాలి అంటే కొత్తగా నేర్చుకోవాలి
35. జ్ఞానమే నీకు గౌరవాన్ని ఇస్తుంది. దాన్ని రోజూ సంపాదించుకో
36. నమ్మిన వాళ్ళను మోసం చేయకు. ఒకళ్ళను నమ్మించాలని ఏదీ చేయకు.
37. నిన్ను నమ్మని వాళ్ళను దగ్గరకు కూడా రానివ్వకు
38. నవ్వడం మర్చిపోకు
39. ఏడుపు వస్తే ఆపుకోకు
40. నిన్ను ప్రేమించే వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, అందుబాటులో ఉండు
41. సొంతంగా నీ పనులు నువ్వే చేసుకో
42. వీలైనన్ని పనులు నేర్చుకుంటూ ఉండు
43. నీ ద్వారానే జరిగే పనులకు ప్రయారీటి ఇవ్వు. మిగతా పనులు వేరే వాళ్లకు అప్పగించు
44. 15 రోజులకు ఒకసారి హైర్ కట్ చేస్కో
45. పొట్ట పెంచకు
46. బట్టతల, తెల్ల జుట్టు వస్తే పట్టించుకోకు. వయసుకు తగ్గట్టు ఉండడమే అందం అని గుర్తించుకో
47. సాయం చేసిన వారి పట్ల కృతఙ్ఞతతో ఉండు
48. నిజాయితీగా మాట్లాడు. సందర్భాన్ని బట్టి సైలంట్ గా ఉండడం కూడా మంచిదే అని తెలుసుకో.
49. మనసులో ఒకటి ఉన్నప్పుడు బయట ఇంకొకటి చెప్పకు
50. మొహమాటపడొద్దు
51. ఒకళ్ళ మెప్పు కోసం ప్రయత్నించకు
52. తప్పు, పొరపాట్లు చేసినప్పుడు ఒప్పుకో, క్షమాపణలు చెప్పు, హుందాగా ఉండు
53. కారణాలు, సంజాయిషీలు చెప్పడం తగ్గించు
54. నిన్ను ప్రశ్నించి, నీతో పొట్లాడే వాళ్ళ వర్షన్ కూడా ఆలోచించు
55. రోజూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ & పిల్లల్తో టైం గడుపు
56. నీతో నువ్వు కనీసం ఒక 10 నిముషాలు అయినా రోజూ మాట్లాడుకో
57. శుభ్రంగా ఉండు, నీ చుట్టూ శుభ్రంగా ఉంచుకో
58. ఆల్టర్నెట్ ఇన్కమ్ మీద దృష్టి పెట్టు.
59. ఒకళ్ళతో ఎవ్వర్నీ కంపేర్ చేయకు. ఒకళ్ళు నిన్ను, నీ భావాలని కంపేర్ చేస్తే సహించకు.
60. ఏసీ ఎక్కువ వాడకు.
61. గిఫ్ట్స్ తీసుకోకు. కాస్ట్లీ గిఫ్ట్స్ అస్సలు తీసుకోకు.
62. పొదుపు చేయి.
No comments:
Post a Comment