*భరతుడు*
శకుంతల విశ్వామిత్రుడు, మేనకల కూతురు. ఆమె పుట్టగానే తల్లిదండ్రులు ఆమెను భూమిపై వదిలేసి ఎటో వెళ్ళి పోయారు. శకుంత పక్షులు ఆమెను కాపాడి పోషించాయి. కణ్వుడు ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్ళి శకుంతల అని పేరు పెట్టి పెంచాడు.
దుష్యంతుడు ఒకసారి వేటకై అడవికి వచ్చి, ఆ ప్రాంతంలో తిరుగుతూ కణ్వా శ్రమంలో శకుంతలను చూశాడు. ఆమె అందానికి ఆకర్షితుడయి గాంధర్వ విధిని ఆమెను వివాహం చేసుకొన్నాడు. తన రాజ్యానికి వెళ్ళి సర్వలాంఛనాలతో తిరిగి ఆమెను తీసుకువెడతాననీ ఆమెకు పుట్టిన కుమారుడినే తన తర్వాత రాజును చేస్తానని మాట ఇచ్చాడు.
ఒకసారి కణ్వుడి ఆశ్రమానికి దుర్వాసుడు అనే ముని వచ్చాడు. దుష్యంతుడినే మనసులో ధ్యానిస్తూ పరధ్యానంగా ఉన్న శకుంతల అతడి రాకను గమనించలేదు. అతడికి కోపం వచ్చి 'నీవు ఎవరిని తలుస్తున్నావో అతడు నిన్ను మరచు గాక' అని శపించాడు. అప్పుడు ఆమె చెలికత్తెలు వేడుకోగా 'ఆమె ఉంగరమే వారిని కలుపుతుంది' అని అన్నాడు.
దుష్యంతుడి నుండి ఎటువంటి కబురు రాకపోవడంతో కణ్వుడే శకుంతలను దుష్యంతుడి దగ్గరకు పంపాడు. కాని దుష్యంతుడు ఆమె ఎవరో తెలియదన్నా డు. తను ఊహించనిది జరగడంతో శకుంతల మనస్సు వికలమైపోయింది. ఆమె ఆ దుఃఖభారాన్ని భరించలేక పోయింది. అక్కడే గల కశ్యపముని ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడే ఆమె ఒక కొడుకును కన్నది. కశ్యపుడు అతడికి భరతుడు అని పేరు పెట్టాడు.
భరతుడు బాల్యంలో దుందుడుకు పనులు చేసేవాడు. అతి సాహసంగా క్రూర జంతువులన్నింటి తోటి అతడు ఎంతో చనువుగా ఆడుకునేవాడు. తన మాట వినకపోతే వాటిని అక్కడికక్కడే చంపేసేవాడు. దాంతో అతడికి ఆశ్రమం లో 'సర్వదమనుడు' అనే పేరు కూడా స్థిరపడింది.
దుష్యంతుడు గాంధర్వ వివాహంలో శకుంతలకు ఇచ్చిన ఉంగరాన్ని శకుంతల పారేసుకోగా అది తిరిగి దుష్యంతుడికే దొరికింది. ఆ ఉంగరం చూడడంతోటే అతడి పై ఉన్న శాప ప్రభావం తొలిగి పోయింది. అతడికి తన పాత జ్ఞాపకాల న్నీ తిరిగి గుర్తుకు వచ్చాయి. శకుంతల కోసం అన్వేషణ ప్రారంభించాడు.
ఒకసారి అతడు ఇంద్రుడి వద్ద నుండి తిరిగి వస్తూ కశ్యపుడిని చూసేందుకు తన రథాన్ని ఆతడి ఆశ్రమం వైపు పోని య్యమన్నాడు. ఐదేళ్ళ బాలుడొకడు ఒక సింహం పిల్లను చంకలో ఎత్తుకుని అతడి మీదకు ఉరుకుతున్న ఒక సివంగి పై ఒక బెత్తాన్ని వూపుతున్న ఆ దృశ్యం అడవిలో దుష్యంతుడికి కంటబడింది.
అది చూసిన జనమంతా చెల్లాచెదురుగా పారిపోతున్నారు. ఆ బాలుడి ధైర్యానికి దుష్యంతుడికి చాలా ఆనందం కలిగింది. అతడు ఆ బాలుడి దగ్గరకు వెళ్ళి, ఎందుకు అలా చేస్తున్నా 'వని అడిగాడు. “ఈ సింహం పిల్లకు ఎన్ని పళ్ళు వచ్చా యో చూడాలి” అంటూ ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు ఆ బాలుడు.
అతడు తన కొడుకే అని తెలుసుకొన్నాక అతడి హృదయం గర్వంతో నిండి పోయింది. కశ్యపముని అనుజ్ఞతో శకుంతలను భరతుడిని తన వెంట తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు.
భరతుడు పెద్దయ్యాక అనేక రాజ్యాలు జయించి భరత ఖండాన్ని నెలకొల్పాడు. గొప్ప ధర్మయుతంగా పరిపాలన సాగించాడు. ధైర్యపరాక్రమాలలోను, ధర్మ పాలనలోను మహోత్తముడైన రాజుగా ప్రసిద్ధుడు అయ్యాడు.
🇮🇳
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅
No comments:
Post a Comment