నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ధీరచరిత్రలో.. రోమాంచితమైన చిన్ని అంకం..!
====================
"గుమ్నామీ" అనే బెంగాలీ సినిమాకి నేషనల్ అవార్డు ఒచ్చింది. అది చూసి తీరాల్సిన సినిమా!
అందులో ఒక షాట్ చూపిస్తాడు...తెర మీద ఓ పది, పదిహేను సెకన్లు ఉంటుందేమో...
అందులో నేతాజీ తన గృహనిర్బంధం నించీ తప్పించుకున్నాక, ఆయన చేసిన రహస్య పర్యటన చూపిస్తాడు. అది చూస్తే ఎవరికైనా సరే, రక్తం ఉరకలు వేస్తుంది.
ఎక్కడి కలకత్తా? ఎక్కడి పెషావర్? బ్రిటీషు పోలీసుల, ఏజెంట్ల కళ్ళుగప్పి, మారువేషాలతో పెషావర్ చేరి, అక్కణ్ణించీ కాలి నడకను lawless land గుండా, ప్రమాదకరమైన, రక్తపిపాసులైన tribals నుండి తనను తాను కాపాడుకుంటూ, అక్కడి భాష రాదన్న విషయం బయటపడకుండా ఉండడానికి మూగవాడిగా నటిస్తూ, కాబూల్ చేరి, అక్కడి (భారత) దేశభక్తుల ఇంట్లో రహస్యంగా ఉంటూ, రష్యాకు వెళ్లే మార్గాన్ని అన్వేషించి, అది కుదరకపోతే, ఇటాలియన్ ఎంబసీ ద్వారా ఒక ఇటాలియన్ passport, visa సంపాదించి, ఒక ఇటాలియన్ diplomat లా రష్యా చేరి, అక్కణ్ణించీ ఆఖరికి జర్మనీ చేరి, తనకు వ్యక్తిగతంగా నాజీ పార్టీ idealogy నచ్చకపోయినా, శత్రువు శత్రువు మిత్రుడన్న రాజనీతిజ్ఞత ప్రదర్శించి, Hitler ని సైనిక సహాయం అర్థించి, అతడి సలహా మేరకు submarine లో యూరోప్, ఆఫ్రికా ఖండాలను చుడుతూ ప్రయాణించి, సింగపూర్ చేరి, రాస్ బిహారి బోస్ గారు స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA aka ఆజాద్ హింద్ Fauz) కార్యనిర్వహణాభారాన్ని స్వీకరించి, అక్కణ్ణించీ జపాన్ వెళ్లి, అక్కడ Tojo ని కలిసి, ఆయన నుండి సైనిక సహకారాన్ని అర్థించి, మళ్లీ సింగపూర్ని చేరుకోవడం....
ఇదంతా ఒక్క 10-15 seconds visual లో చూపించాడు.
అది చూస్తే అనిపిస్తుంది...నేతాజీ పడ్డ శ్రమతో పోలిస్తే, గాంధీ, నెహ్రూ లు చేసింది negligible అని!
తరవాత "జై హింద్", "చలో ఢిల్లీ" నినాదాలతో ఆజాద్ హింద్ fauz ని రణోన్ముఖుల్ని చేసి, అండమాన్ నికోబార్ దీవుల్ని బ్రిటీషు పాలన నించీ విముక్తి చేసి, తరవాత బర్మా మీదుగా భారత భూభాగం లోకి ప్రవేశించి, కోహిమా ని విముక్తం చేసి, అక్కణ్ణించీ కాలం కలిసి రాకపోగా, సాయం చేస్తానన్న జపాను మొహం చాటేస్తే, arms, equipment, ammunition, transportation, fuel, food, water, medicine shortages తో సతమతమైపోయి, INA ని dissolve చేసి, పోరాటం కొనసాగించడానికి ఈసారి రష్యాకి వెళ్లే ప్రయత్నం లో "విమాన ప్రమాదానికి" గురై అమరుడవటం కూడా, ఆ map లో చూపిస్తాడు దర్శకుడు. ఇంతాచేస్తే, ప్రపంచపటంలో ఆయన చేసిన యాత్రని ఒక red line తో చూపించాడు దర్శకుడు. ఆ పదిహేనిరవై సెకన్లలో ఇదంతా జరుగుతుంది.
ఆయన ఎంత సాహసీ, కార్యసాధకుడూ అంటే, Allied Powers లో member అయ్యి, శత్రువైన రష్యాతో మంతనాలాడే ధైర్యం ప్రదర్శించాడు.
అసలు బ్రిటీషువాళ్ళతో పోరాడటానికి ఆయనకున్న సైనిక వనరులేమిటి? ఆర్టిల్లరీ లేదు, యుధ్దవిమానాల్లేవు, ట్యాంకుల్లేవు, మోర్టార్లు లేవు...ఏవీ లేవు!
Freedom struggle కి ఆయన greatest contribution ఏమిటంటే....భారత సైనికుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని, భారత దేశాన్ని పాలించడం ఇకమీదట వీలుకాదన్న విషయాన్ని బ్రిటీషువాళ్ళు గుర్తించేలా చేయడం! నేతాజీ "స్వర్గస్థులైన" ఏడాది లోపలే, భారత నావికాదళం పెద్ద తిరుగుబాటు చేసింది...ఆంగ్లేయులు అదిరిచచ్చేలా...
BTW, నేతాజీ ప్రభుత్వాన్ని Government in exile గా axis powers recognize చేశాయి. కాబట్టీ, టెక్నికల్ గా భారతదేశ ప్రప్రథమ ప్రథాని నేతాజీనే!
🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment