కోరిక వచ్చిన 60 సెకన్లలో... ఇలా చేస్తే? 🤯 | The Secret Mind Trick Nobody Told You! #brahmacharya
https://youtu.be/w91_MM3wIf4?si=HODUdXy-cbcZYXgu
https://www.youtube.com/watch?v=w91_MM3wIf4
Transcript:
(00:00) మిత్రులారా మన బ్రహ్మచర్యం వీడియో ఒక విప్లవాన్ని సృష్టించింది. వందల మంది ఛాలెంజ్ స్వీకరించారు. కానీ యుద్ధం మొదలు పెట్టడం వేరు యుద్ధంలో గెలవడం వేరు గుర్తుంచుకోండి ఇది కేవలం పార్ట్ట వీడియో కాదు ఇది ఈ ప్రయాణంలో గెలవాలనుకునే సీరియస్ యోధుల కోసం ఒక అడ్వాన్స్డ్ వార్ మాన్యువల్ నేను గురువును కాదు గతపదఏళ్లుగా ఈ దారిలో పడి లేచి నేర్చుకున్న ఒక సాటి యాత్రికుడిని నా అనుభవ సారాంశాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాను.
(00:34) ముందుగా మనందరినీ వేవిస్తున్న ఆ పెద్ద ప్రశ్నను ఫేస్ చేద్దాం. సైన్స్ ఏమో హస్త ప్రయోగం మంచిదే అంటుంది కదా మరి నాకుఎందుకు గిల్ట్ ఫీలింగ్ వస్తుంది నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు చచ్చిపోతుంది అనేదే చాలా మంది అడుగుతున్న ప్రశ్న దీనికి సమాధానం చాలా సింపుల్ గమనించండి మీరు చూసేది కేవలం మీ శరీరాన్ని మాత్రమే కానీ ఆయుర్వేదం చూసేది మీలోని ప్రాణశక్తిని మీరు కోల్పోయేది కేవలం ద్రవ్యం కాదు మీ బ్రెయిన్ కి అందాల్సిన ఓజస్సు మీ నాడీ దేవస్థలో జరగాల్సిన ఎలక్ట్రిక్ కల్ రీవైరింగ్ అంతేకాదు ఇక్కడ ఒక నిగూఢమైన సైన్స్ ఉంది.
(01:12) మీరు స్కలనం చేయకపోయినా సరే కేవలం శృంగార ఆలోచనలు చేసిన అనవసరమైన స్పర్శలో పాల్గొన్న మీలో డాపమైన్ వరదలా పడుతుంది. మీ మెదడు ఆ చీప్ ప్లెజర్ కి బానిస అవుతుంది. దీని ఫలితం మీలోని అసలైన ప్రేరణ, లక్ష్యం వైపు పరిగెట్టాలనే కసి తగ్గిపోతాయి. మీలో ప్రోలాక్టిన్ అంటే విరక్తి హార్మోన్ పెరిగిపోయి ఒక రకమైన మానసిక నీరసం మిమ్మల్ని ఆవహిస్తుంది.
(01:37) ఇది కేవలం పుస్తకాల్లో ఉండే మెడికల్ థియరీ మాత్రమే కాదు లక్షలాడి మంది యువకులు రోజు తమ అనుభవంలో చూస్తున్న పచ్చి నిజం అందుకే ఆ నీరసం అందుకే ఆ ఆందోళన ఒక్క విషయం గుర్తుంచుకోండి సైన్స్ మిమ్మల్ని బ్రతికిస్తుంది. కానీ ఈ శక్తి మిమ్మల్ని విజేతగా మారుస్తుంది. మరి ఈ శక్తిని నిలబెట్టుకోవాలంటే మీ శరీరం దానికి సహకరించాలి.
(02:04) దీనికి మూడు ప్రధానమైన స్తంభాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఆహారం ఎందుకంటే మీరు తినేదే మీ ఆలోచనగా మారుతుంది. మీరు పెట్రోల్ పోసి మంట ఆర్పలేరు. అలాగే రాజసిక ఆహారం అంటే మసాలాలు, మాంసం, ఉల్లి, వెల్లుల్లి లాంటివి తింటూ మనసును కంట్రోల్ చేయలేరు. అవి మీ నరాలను ఇరిటేట్ చేస్తాయి. దీనికి ఏకైక మార్గం సాత్విక ఆహారం పాలు, నెయ్యి, పండ్లు, నానబెట్టిన బాదం తీసుకోండి.
(02:30) ఇవి మీ నరాలను చల్లబరుస్తాయి. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రో టిప్, మీకు అదనపు బలం కావాలంటే ఆయుర్వేదం కొన్ని అద్భుతాలను ఇచ్చింది. అశ్వగంధ. మీ స్ట్రెస్ ని తగ్గించి నరాలను ఉక్కులా మారుస్తుంది. అలాగే శిలాజిత్ మీ కణాలకు మహా శక్తిని అందిస్తుంది. కానీ వీటిని డాక్టర్ సలహాతోనే వాడండి. ఇక రెండవది నిద్ర ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. సాధారణంగా ఎడం వైపు పడుకోవడం మంచిది కానీ మీలో కోరికలు విపరీతంగా ఉన్నప్పుడు కుడి వైపు తిరిగి పడుకోండి.
(03:03) ఇది మీ శరీరంలోని చంద్రనాడిని యాక్టివేట్ చేసి ఆ వేడిని తగ్గిస్తుంది. ఇది మన యోగుల సీక్రెట్. ఇప్పుడు మూడవది ప్రాణాయామం. మీ మనస్సును నియంత్రించే కీ మీ శ్వాస. రోజుకి పది నిమిషాలు నాడీ శోధన. అంటే అనులోమ విలోమ చేయండి. మీ ఈడా పింగళ నాడులు బాలెన్స్ అయితే మనసు వాటంతట అదే దారిలోకి వస్తుంది. ఇప్పుడు వీడియోకే అత్యంత ముఖ్యమైన భాగం అసలైన రహస్యం శరీరం ఓకే మరి ఆ సడన్ గా వచ్చే సునామి లాంటి కోరికని ఎలా ఆపాలి? అక్కడే 99% మంది ఫెయిల్ అవుతున్నారు.
(03:39) కారణం వాళ్ళు తమ మానసిక శక్తిని ఒక లీక్ అయిన కుళాయిలా వృధా చేస్తున్నారు. అణచివేస్తే అది పేలుతుంది. లొంగిపోతే అది మిమ్మల్ని మింగేస్తుంది. మరి ఏం చేయాలి దాన్ని తెలివిగా వాడేసుకోవాలి. దీన్నే సైకాలజీలో సబ్లిమేషన్ అంటారు. టెస్లా టైసన్ వాడింది ఇదే. కోరిక కలిగిన 60 సెకండ్లలో మీరు చేయాల్సిన ఫైవ్ స్టెప్ ఫార్ములా బయట పెట్టబోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి.
(04:08) మొదట కట్ ఆలోచన రాగానే దానికి కథను యాడ్ చేయకండి దాన్ని అక్కడే కట్ చేయండి. వెంటనే బ్రీత్ శ్వాసను మార్చండి. కామవాంచ కలిగినప్పుడు శ్వాస వేగంగా పైపైన ఉంటుంది. దాన్ని రివర్స్ చేయాలి. ఎలాగంటే ముక్కుతో నాలుగు సెకండ్లు గాలి పీల్చి ఎనిమిది సెకండ్లు వదలాలి. ఈ ఒక్క టెక్నిక్ చాలు మీ నాడ వ్యవస్థను కంట్రోల్ లోకి తీసుకురావడానికి తర్వాత మూవ్ ఆ శక్తిని కండరాలకు పంపండి 20 పుషఅప్స్ చేయండి లేదా పరిగెత్తండి.
(04:38) ఇప్పుడు షిఫ్ట్ వెన్నెముక నిటారుగా ఉంచి తల కొద్దిగా పైకి ఎత్తండి. మీ దృష్టిని పొత్తి కడుపు నుంచి నుదురు వైపు అంటే థర్డ్ ఐ వైపు మళ్ళంచండి. ఎందుకంటే దృష్టి ఎక్కడికి వెళ్తే శక్తి అక్కడికే వెళ్తుంది. చివరిగా యక్ట్ ఈ ప్రక్రియ పూర్తైన 10 నిమిషాలలో వెంటనే మీ పని మీద కూర్చోండి. ఆ సమయంలో మీ ఫోకస్ కత్తిలా ఉంటుంది.
(05:04) ఇక ఈ ప్రయాణంలో వచ్చే కొన్ని ప్రత్యేక సందేహాలు చూద్దాం. ముఖ్యంగా పెళ్లైన వారికి గురువుగారు మరి మా పరిస్థితి ఏమిటి అని అడుగుతారు. బ్రహ్మచర్యం అంటే భార్యకు దూరం అవ్వడం కాదు అది ఎనర్జీ మేనేజ్మెంట్ మీ శక్తిని ప్రేమను కేవలం మీ జీవిత భాగస్వామితోనే పంచుకోండి. దాన్ని ఒక శారీరిక ఆకలిగా కాకుండా ఒక పవిత్రమైన కలయకగా మార్చుకోండి. అతిగా ఖర్చు చేయకండి ఆనందంగా ఆస్వాదించండి.
(05:31) ఖర్చైన శక్తిని మళ్ళీ సాధనతో భర్తీ చేసుకోండి. అలాగే నైట్ ఫాల్ గురించి భయం వద్దు ఇది జబ్బు కాదు కుండ నిండితే నీరు పొరలడం ఎంత సహజమో ఇది అంతే దాని గురించి గిల్ట్ పడకండి మీరు మెలకువుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అన్నదే ముఖ్యం. మిత్రులారా కాలు జారితే మళ్ళీ లవ్వండి. గిల్ట్ అనేది కోరిక కంటే ప్రమాదకరమైనది. మీ ప్రయాణం సున్నా నుంచి మొదలవ్వదు మీ అనుభవం నుంచి మొదలవుతుంది.
(05:56) ఇదంతా కష్టంగా ఉందా? అయితే కేవలం ఏడు రోజులు అని శపదం చేయండి. నేను సుఖాన్ని వెతకను సుఖాన్ని శక్తిగా మారుస్తాను అని ఫిక్స్ అవ్వండి. ఏడు రోజుల తర్వాత అద్దంలో మీ కళ్ళల్లో కనిపించే ఆ పవర్ మిమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వదు. ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. వీడియోలు చూసేవారు చరిత్ర సృష్టించేవారు.
(06:19) మీరు రెండవ రకమైతే ఆ ధైర్యం వేలో ఉంటే కింద నేను యోధుడిని అని కామెంట్ చేయండి. విజయం మీదే శుభం.
No comments:
Post a Comment