"మీరు కోమట్లా - బ్రాహ్మలా ?"
రచన: డా రాయపెద్ది వివేకానంద్
పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ సృష్టికర్త
(కోచ్ టు సెలెబ్రిటీస్ & బిజినెస్ లీడర్స్)
----
శాస్త్రీయ ధోరణి శాస్త్రీయ ధోరణీ అంటుంటారు. పూర్వ భారతీయ వైజ్ఞానిక అవగాహనలో ఉన్నంత సైన్స్ ఎక్కడన్నా ఉందా?
గోత్రాలు జెనెటిక్ కోడ్ ఆధారంగా నిర్దారింపబడ్డాయి అని శాస్త్రవేత్తలే అంగీకరిస్తున్నారు.
ఆర్య వైశ్యులని (గుప్తా, శెట్టిగారు, కోమట్లని) ఆపరేషన్‌కి ముందు సర్జన్లు 'మీరు బ్రాహ్మలా, కోమట్లా అని అడుగుతారు అని మీకు తెలుసా?'
ఎందుకు వాళ్ళకి కులం పిచ్చా? కాదు. కొన్ని రకాలైన అనెస్థీషియా ఆర్యవైశ్యులకి పరిమిత డోస్‌లో ఇవ్వకుంటే వికటిస్తుంది అని వారికి తెలుసు కాబట్టి.
అదే విధంగా జీ6పీడీ అనే సిండ్రోం పార్శీ వారికి మాత్రమే ఉండే అరుదైన జెనెటిక్ ప్రత్యేకత. మెటాక్లోప్రామైడ్ (పెరినాం) అనే మందుని వారికి ఇచ్చే ముందు ఉత్తర భారత దేశంలో డాక్టర్లు మీరు పార్శీలా అని అడిగి మరి ఇస్తారు. వారు ఆ మందు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.సమాజంలో హింస, అనైతికత, ఆత్మహత్యలు, హత్యలు ఎక్కువ అయ్యాయని మీకు అనిపిస్తోందా?
రాగల రోజులన్నీ మానసిక సమస్యలతో సతమతమయ్యే సైకోలతో నిండిన సమాజానివే.
ఇది కఠోర వాస్తవం. ఈ వ్యాసంలో పూజార్లని ఎండగట్టబోతున్నాను, కళాకారులని తూర్పారబట్టబోతున్నాను, టిచర్లని ఆడిపోసుకోబోతున్నాను, డాక్టర్లని నిందించబోతున్నాను. ఇవేవి ఏదో హ్రస్వ దృష్టితోనో, నిరాశావాదంతోనో కాదు. దేవుడా కాపాడు నా సమాజాన్ని అని ఆక్రోశపడుతూ వ్రాశాను.
నా ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకో ప్రార్థన.
ఈ వ్యాసం చాలా ఆలోచించిన పిమ్మట వ్రాస్తున్నాను. అసలు ఇది వ్రాయాలా వద్దా అని చాలా ఆలోచించి - పక్కన పెట్టేశాను. ఆవేశం తగ్గాక వ్రాద్దాం, ఆవేశం తగ్గాక కూడా ఇది వ్రాయాలని అనిపిస్తే వ్రాద్దాం అని పక్కన పెట్టేశాను. ఇలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, దాదాపు రెండు సంవత్సరాలు ఈ విషయం నన్ను పట్టి కుదిపేస్తోంది. వ్రాయి వ్రాయి ఈ విషయంలో మొహమాటం వద్దు అని నా అంతరాత్మ నన్ను ప్రోత్సహిస్తూనే ఉంది.
ఇది నిజంగా పెద్ద సమస్య. సైలెంట్ కిల్లర్ లాంటి సమస్య. హిందూ సమాజానికే కాదు, మానవ సమాజానికి కూడా ఇది పెద్ద సవాల్.
ఏమిటి విషయం అంటారా - చెబుతాను. ఎక్కడనుండి మొదలెట్టాలా ఎలా మొదలెట్టాలా అని తీవ్రంగా సతమతమవుతూ ఇంత పెద్ద ఉపోద్ఘాతం వ్రాస్తూ ఉన్నానేమో బహుశా.
రాగల రోజుల్లో మీకు ఎక్కడ చూసినా మానసిక సమస్యలతో సతమతమయ్యే వారే కనిపిస్తారు. ఇది నిష్టుర సత్యం.
డాక్టర్ కోర్స్ చేయదలచుకున్న వారు నిరభ్యంతరంగా మానసిక చికిత్సలకి సంబంధించిన స్పెషాలిటీలో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు, సైకలాజికల కౌన్సెలింగ్ కి సంబంధించిన డిప్లమో కోర్సులు చేస్తే మీకు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. ఆదాయానికి సంబంధించిన ఈ వాక్యాన్ని వ్రాస్తు ఎంత అమానవీయంగా ఉంది కద ఈ వాక్యం అని నేనే అనుకుంటూ ఉన్నాను.
మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే పుస్తకమో సినిమానో చూస్తే ఎంత ఉత్సాహంగా ఉంటుందో మీకు తెలియనిది కాదు.
గొప్ప వ్యక్తిత్వంతో నిండిన వ్యక్తి జీవిత చరిత్ర చదివితే ఎంత ప్రేరణ వస్తుందో మీకు అందరికీ అనుభవవేద్యమే.
పాజిటివ్ థాట్స్, ప్రేరణ కలిగించే నాలుగు మంచి మాటలు, శాంతిని కలిగించే మంచి పలుకులు, ఆహ్లాదకారమైన సంగీతం, మనసుకు నెమ్మది కలిగించే వార్తలు, కర్తవ్యోన్ముఖలని చేసే ప్రసంగాలు ఎంత ప్రేరణని ఇస్తాయి కద.
ఇక తల్లి పట్ల సోదరీ మణుల పట్ల, వదినె గారి పట్ల, సమాజంలో స్త్రీలందరిపట్ల గౌరవభావం కలిగించే కథలు, నవలలు, సినిమాలు మనలో ఎంత స్వచ్చమైన భావనలని కలిగిస్తాయి కద.
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నాను అంటే ఇప్పుడు సాహిత్యం, సినిమా తదితర కళా రూపాలు, ఇంటర్‌నెట్, యూట్యూబ్, షార్ట్ ఫిలంస్ ఇవన్నీ ఒక సారి గమనించి చూడండి.
ఇవన్నీ కూడా శాంతిని కలిగించే బదులు మనలోని వికారాలని ప్రేరేపింపజేసే విధంగా ఉంటున్నాయి.
విచ్చలవిడితనం. ఎక్కడ చూసినా హద్దులు చెరిపేసే ధోరణులు.
వరుసయ్యే స్త్రీతో ధర్మబద్ధంగా శృంగారమా ? - ఛీ ఛీ బోరింగ్. అసలు ఊహల్లో కూడా మనకు జుగుప్స కలిగేలాంటి అవాంఛనీయ వావి వరుసలు లేని అక్రమ సంబంధ ధోరణులు. ఇవి కథాంశాలు. ఇవి మోడ్రన్ కళారూపాలు. ఇవి మీకు నచ్చవా, అయితే మీరు పాత చింతకాయతొక్కు తినెలాంటి అంకుల్స్ అన్నమాట, పక్కకి తప్పుకోండి అనేలాంటి ఉన్మాద ఉగ్రవాద యువ సినీ దర్శకులు.
చెంప మీద కొడితేనో, కాలితో ఎగిరి తంతేనో, పిడి గుద్దులు గుద్దితేనో అది పోరాట దృశ్యం ఒకప్పుడు. ఇప్పుడో ఖండఖండాలుగా నరకాలి, కత్తికి నెత్తురు కారుతూ ఉండాలి, ఖండిత శిరస్సులతో ఫుట్ బాల్ ఆడుకోవాలి, ప్రేగులు వేలాడాలి, రక్తం వరదలు కట్టాలి, హింసని ఎంత హింసాత్మకంగా చూపితే అది సరికొత్త కళారూపకం.
సాహసం అంటే ఏమిటనుకున్నారు? ఇదిగో ఇక్కడ సిలబస్ ఇస్తున్నాను ఈ క్రింది సాహస కృత్యాలని సాధన చేసి నిరభ్యంతరంగా హీరో అని అనిపించుకోవచ్చు. ఉపాధ్యాయులని కించపరుచు, అమ్మానాన్నలని ఎదిరించు, పెద్దలందరినీ కించపరుచు, గురువులని గేలిచేయి, పోలీసులని ఎగిరెగిరి తన్ను, ట్రాఫిక్ నియమనిబంధనలే కాదు, ఎక్కడ నీకు నీతి నియమం కనిపించినా తుంగల్లో తొక్కు. సిగరెట్, మందు, డ్రగ్స్ ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పాలనా, మీ సాహసపూరిత జీవితానికి ఇవి ఉండి తీరాల్సిన అధరవులు (ఎక్స్ట్రా ఫిటింగ్స్).
ఇక అమ్మాయిల సాహస కృత్యాలకి సంబంధించి ఇంకొన్ని ఎక్స్ట్రా పాఠ్యాంశాలు ఉన్నాయండోయి.వస్త్రధారణ విషయంలో ఇక నీకు అడ్డే లేదు. మొత్తం విప్పుకుని తిరుగు. ఇదేమి అని అడిగితే చూసే వాడి చూపులో దోషం అండీ మా శరీరం మా ఇష్టం అని ఎదురు చెప్పు. సిగరెట్ ఎవరు త్రాగినా అది ఆరోగ్యానికి హానికరం అది నిన్నటి మాట. అమ్మయివి అయితేనేమి నీవు కూడా సిగరెట్ త్రాగాలి, మందు పుచ్చుకోవాలి. అది చాలకుంటే డ్రగ్స్ తీసుకోవచ్చు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే రాక్షసులకి, పిశాచులకి, కాముకులకి, క్షుద్రాతిక్షుద్ర జీవులకి కథానాయకులని పేరుపెట్టి వారి నీచాతి నీచ జీవన విధానాలని వారి అసహ్యకరమైన సంభాషణలని ఎటువంటి సెన్సార్ లేకుండా చూపగలిగితే అది మోడ్రన్.
ఇలాంటి సినిమాలు తీసే కుసంస్కారులు, నీచులు సిగ్గు పడి చచ్చేబదులు వేదిక మీద ఎక్కి మైకులు పట్టుకుని చిత్ర విచిత్ర విన్యాసలతో తమ భాషాపాటవాన్ని చూపుతూ నీచంగా మాట్లాడటానికి తెగపడుతున్నారు.
కాస్త గౌరవంగా బ్రదుకుదాం అనుకునే వారిని కించ పరుస్తూ ఉపన్యాసాలు ఇవ్వటం , ఇంటర్వ్యూలు ఇవ్వటం పరిపాటి అయింది.
ఇవే చూసి-చూసి, విని-విని, చదివి-చదివి, ఆలోచించి -ఆలోచించి ఇదే ఆధునిక జీవితం అనుకోరా చిన్న పిల్లలు.
నిజాయితిగా ఉండటం ఓల్డ్ ఫాషన్ - దొబ్బేయ్ -దోచేయ్ (ఇది సినిమా ప్రభావంతో వ్రాస్తున్న పదం) ఇది కొత్త ఫాషన్. నీవు ఎంత వంచన చేయగలిగితే అంత స్మార్ట్‌గా ఉన్నట్టు లెక్క.
ఒక పద్దతిగల మనిషికి ఇవి చూస్తే గుండె రగిలిపోదా? కళ్ళ ముందే సమాజం పతనావస్థకి చేరుకుంటూ ఉంటే బాధ కలగదా?
ఇలా పొద్దున లేచినప్పటి నుంచి హింస, శృంగారం, వంచన, దోపిడి, చూసి చూసి కాస్త మానసిక ప్రశాంతతకోరి గుడికెళదాం అనుకునే యువతకి కూడా కొదవ లేదు ఇప్పుడు.
ఇక్కడే సమాజం పెద్ద సమస్యల ఊబిలోకి కూరుకుపోతోంది.
సమాజానికి దిశ, దశ నిర్దేశించవలసిన గురుస్థానంలో ఉండాల్సిన బ్రాహ్మణులని జోకర్ల కింద బఫూన్ల కింద చిత్రీకరించి చిత్రీకరించి పురోహిత వృత్తివైపే సద్‌బ్రాహ్మలు వెళ్ళేదానికి కించపడేలాంటి వాతావరణాన్ని సృష్టించారు. కాస్త తెలివి తేటలు గలిగిన బ్రాహ్మణులు ఐటీ తదితర ఉద్యోగాలు చుసుకుని వీలయితే దేశాన్ని వీడి వెళ్ళిపోయి ఆ గిల్టీ ఫీలింగ్ తో అక్కడ సనాతన ధర్మాన్ని పాఠించే ప్రయత్నం లాంటిదేదో చేస్తున్నారు. ఆ సంగతి తరువాత మాట్లాడుకుందాం.
ఇక టీచర్లుగా ఎలాంటి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బ్రష్టు పట్టిపోయిన విద్యా వ్యవస్థ గూర్చి కొన్నేళ్ళ క్రితమే వ్యాసాలు వ్రాశాను. ఈ వ్యాసం ఉద్దేశం అది కాదు.
ఇక్కడ గుళ్ళలో బ్రాహ్మణులు చేయాల్సిన పనులు చేస్తున్నారా లేదా అన్నదాని గూర్చి మాట్లాడటం నా ప్రధాన ఉద్దేశం.
చెప్పాను కద బుర్రలో కాస్తో కూస్తో గుజ్జు ఉన్న బ్రాహ్మణులు ఆధునిక సమాజపు వస్త్ర ధారణ, ఆధునిక ఉద్యోగాలు, ఆ ఆధునిక సమాజంలో మామూలు అని చెప్పుకోదగ్గ అలవాట్లతో కూడిన లైఫ్ స్టయిల్ (మీ ఊహకే వదిలేస్తున్నాను అది ఏమిటి అనేది) తదితర వ్యాపకాలతో గడిపేస్తున్నారు. నలుగురికి దార్శనికులుగా ఉండటం అనే పవిత్ర పౌరోహిత్య వ్యవస్థకి, గుడిలో పూజాదికాలు నిర్వహించాల్సిన పౌరోహిత వృత్తికి ఎప్పుడో దూరం అయ్యారు.
ఇప్పుడు గుళ్ళలో (అన్నింట్లో కాదు) మనకి తారస పడుతున్న బ్రాహ్మణులు నామకార్థ బ్రాహ్మణులు మాత్రమే. వీరిలో చాలామందికి పుస్తకం పట్టుకోకుండా లేదా స్మార్ట్ ఫోన్‌లో పీడీఎఫ్ కాపీ చూడకుండా అష్టోత్తరం చేయటం రాదు. ఆకారపుష్ఠి నైవేడ్య నష్ఠి అన్న విధంగా ఉంటారు వీరు. విభూతి పట్టలు, తిరునామాలు బలంగా ధరించటం, చక్కటి వస్త్రధారణ చేయటం వీరి ప్రత్యేకత. తమ ప్రవర సైతం తెలియదు. చక్కగా గోత్రనామాలతో ఋషి పరంపర సహితంగా తమ ప్రవర చెప్పుకోవటం కూడా రాదు వీరికి. కానీ దేవుడిని నమ్ముకుని ఉన్నారు, ఆ దేవుడికి మనకి మధ్య అనుసంధానంగా ఉండి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారులెమ్మని మనకితోచిన దక్షిణ సమర్పించుకుందాం అని అనుకునేలోగా వీరు తమ నిజ రూప ప్రదర్శన చేస్తారు.
ఈ వృత్తిలో వాళ్ళకి ఒక ఆదాయమార్గం కనిపించటం వల్ల ఈ నామకార్థ బ్రాహ్మణులు గుళ్ళలో పూజార్లుగా ఉండటానికి ముందుకు వస్తున్నారు. ఏమిటయ్యా ఆ ఆదాయ మార్గం అంటే - దిక్కుతోచని అయోమయంలో ఉన్న భక్తులని తియ్యటి మాటలతో ఆకట్టుకుని వారి జాతకాలు చూస్తాం అని మొదలు పెడతారు. వీళ్ళలో జాతకాలు చూడటం మాత్రం ఎందరికి వస్తుందో సందేహమే. మిడతం భొట్ల జోశ్యంలాగా ఏదో చెప్పి, పరిహారాలని, పూజలని, హోమాలని, యాగాలని, దానాలని చెప్పి పబ్బం గడుపుకుంటూ ఉంటారు.
అసలు ఇన్ని గుళ్ళు అవసరమా? ఒక గ్రామానికి ఒక గుడి ఉంటే సరిపోతుంది. నగరానికంతటికీ పెద్ద గుళ్ళు కొన్ని ఉంటే సరిపోయేదానికి వాడ వాడకి ఒక గుడి. ఇన్ని గుళ్ళూ వెలసినప్పుడు డొక్కశుద్ధి ఉండి నిబద్ధత ఉండే బ్రాహ్మణులు ఎలా దొరుకుతారు. ఇదిగో ఇలాంటి నామకార్థ బ్రాహ్మణులే మనకి దిక్కు.
నేను హిందూ మతానికి, ధర్మానికి వ్యతిరేకంగా వ్రాయటం లేదు ఇదంతా, అర్థం చేసుకోగలరు.
జాతకాలు చెప్పే నైపుణ్యం ఉన్న బ్రాహ్మణులు, హోమాలు తదితర శుభకార్యక్రమాలు, పుట్టిన ప్రతి జీవికి తప్పని తద్దినాలైన అశుభకార్యక్రమాలు నిర్వహించగల బ్రాహ్మణులు నిరభ్యంతరంగా వారి ప్రాక్టీసు కొనసాగించుకోవచ్చు. ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ గుడిలో పూజారి అవతారం ఎత్తి, అక్కడ మాటు వేసి, అక్కడికి వచ్చిపోయే భక్తుల స్థితిగతులు అంచనా వేస్తూ వాళ్ళతో మాట కలిపి వాళ్ళలో భయాందోళనలు కల్పించి వాళ్ళ వాళ్ళ నైపుణ్య ప్రదర్శనలు చేసే బ్రాహ్మణుల కారణంగా గుడికి వెళ్ళటానికి విముఖత కలిగి, క్రమంగా భక్తులు హిందూ మతానికి దూరం అయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఏం, చర్చిలలో చెప్పినంత మాత్రం వ్యక్తిత్వ వికాస పాఠాలు మన పండితులు గుళ్ళలో చెప్పలేరా? ధర్మం పట్ల నీతి పట్ల అవగాహన కలిగించే రామాయణ భారత భాగవతాదులని ఉటంకిస్తూ , గీతలోని శ్లోకాలని చక్కటి భాషలో అర్థం అయ్యేలాగా చెప్పి యువతని పిల్లలని సంస్కృతికి వారసులుగా చేయలేరా బ్రాహ్మణూలు?
భక్తులు వచ్చినా నిమ్మకి నీరెత్తినట్టు సెల్‌ఫోన్ చూసుకుంటూ కూర్చోవటమో , లేదా జాతకాలు చెప్తాం, పరిహారాలు చెప్తాం అని ఫక్తు కమర్షియల్ మాటలు మాట్లాడటమో మాట్లాడకుండా తమ ధర్మాన్ని నిర్వర్తించలేరా?
కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉన్న యముడి ప్రతినిధులలాంటి అపర ధన్వంతరులకి, గుళ్ళలో కూర్చుని ఉన్న ఈ నామకార్థ బ్రాహ్మణులకి ఏదైనా తేడా ఉందా?
ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వచ్చాను అనుకుంటున్నారా ? లేదు సరిగ్గానే చెబుతున్నాను.
దురాక్రమణదారులైన మొఘల్ దాడులతో చిక్కులేదు. వాళ్ళు మొరటు పద్దతులలో కత్తి చూపి, మానభంగాలు చేసి, భయపెట్టి, బెదిరించి మన పూర్వీకులని మతమార్పిడి చేశారు.
కానీ నయవంచకులైన బ్రిటిష్ వారి పద్దతి వేరు. మన మీద సాంస్కృతిక దాడి చేసిన బ్రిటిష్ వాడు కొట్టక్కరలేదు తిట్టక్కరలేదు అక్కడేక్కడో పిసికితే చాలు అన్న రీతిలో, మన సంస్కృతికి మూల స్థంభమైన పూజార్ల వ్యవస్థని అతి తెలివితో దెబ్బతీశాడు. ఒక దేశం యొక్క సంస్కృతిని దెబ్బతీయాలంటే వారి గురువులని జోకర్లు గా చూపడం ద్వారా, ఆ సమాజానికి మార్గం చూపేవారిని దారి తప్పించి భ్రష్టులని చేయటం ద్వారా పని చక్కబెట్టుకోవచ్చు, అదే విధంగా విద్యా వ్యవస్థని నాశనం చేయటం ద్వారా ఆ సమాజపు అస్థిత్వాన్ని రూపుమాపవచ్చు.
వాళ్ళు తెలివిగా పన్నిన పన్నాగాల తాలూకు విషఫలితాల్ని ఇప్పుడు సమాజం ఎదుర్కొంటోది.
శాంతికోసం గుడికెళితే మిడి మిడి పండితుల దోపిడి.
నేతి బీరకాయలో నేతి చందాన మానసిక వైద్యులు చేసే వైద్యంలో మానసిక శాంతి ఏ పాటిదో చూస్తూనే ఉన్నాము. అది వాళ్ళకి వ్యాపార సాధనం.
నిత్యం పని గట్టుకుని చెడుని మాత్రమే చూపే వినోద సాధనాలు.
పాఠం చెప్పాల్సిన టీచర్లు మార్కులగూర్చి ఒత్తిడి తేవటం, పోలికలు తెచ్చి పిల్లల్ని మానసికంగా కృంగదీయటం
అత్తని చంపే కోడళ్ళు, కొడుకుని చంపే తల్లులు - ఇవి టీవీ సీరియల్స్
పేషంట్లకి ఆరోగ్యం మాట దేవుడెరుగు, ముందు వాడి వద్దనుండి వీలయినంత దండుకుందాం అనే లాంటి డాక్టర్లు.
మెయిన్ స్ట్రీం మీడియా గూర్చి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇక ప్రార్థనా స్థలాల గూర్చి, ఒక మతం వాళ్ళు ఆయుధాలని నిల్వ ఉంచుకుని రాగాల పవిత్ర యుద్ధంలో ఈ దేశంలో హిందువులని తుడిచిపెట్టేయటం ఎలా అని బోధిస్తూ ఉంటారు,
వేరొక మతం వాళ్ళు, హిందువులని ఎలా కన్వర్ట్ చేయాలా అని బోధిస్తూ హిందూ దేవీ దెవతలని కించపరుస్తూ అమ్మనా బూతులని తిడుతూ ఉంటారు. ఇవన్నీ భావ ప్రకటన స్వేఛ్చ కింద.
ఇలాంటి సమాజంలో మానసికంగా ఆరోగ్యంగా ఎదగటం సాధ్యమా?
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కారణాలు. సమాజంలో ఎటు చూసినా మానసిక సమస్యలకి ఊతం ఇచ్చేలాంటి వాతావరణం రోజు రోజుకి ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోతూ ఉంది.
ఒకే ఒక ఆశా కిరణం - ఏది ధర్మమో ఏది అధరమ్మో చెప్పే గురువులు తమ వంతుగా తాము ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
చాగంటి కోటేశ్వరరావు గారికి, సామవేదం షణ్ముఖ శర్మ గారికి ఈ వ్యాసం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరి ప్రవచనాల వల్ల బాగుపదిన ఎందరినో నేను ఎరుగుదును.
ఇలాంటి గురువులే సమాజానికి అవసరం.
సినీరంగంలాంటి గంజాయి వనంలో ఉన్న ఒక తులసి మొక్కవంటి వాడు ఆర్పీ పట్నాయక్. తోచినంతలో సమాజానికి మంచి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల అతను విడుదల చేసిన భగవద్గీత ఒక చక్కటి ప్రయత్నం.
అదే విధంగా లెక్కకి మిక్కిలిగా యువతరపు ప్రతినిధులు పూనుకుని యూట్యూబ్ చానెళ్ళ ద్వారా ధర్మ ప్రచారానికి పూనుకుంటున్నారు ఇది ఒక చక్కటి పరిణామం.
నాకు మిగతా ప్రవచనకారుల గూర్చి పూర్తిగా తెలియదు. మిగతా సినీ ప్రముఖుల గూర్చి పూర్తిగా తెలియదు.
ఇక సమస్య చెప్పి వదిలేస్తే ఎలా పరిష్కారం చెప్పవద్దా అంటారా? నిజమే.
పరిష్కారం చెప్పకుండా సమస్య ఒక్కటీ చెబితే అది సరి అయిన వ్యాసం ఎలా అవుతుంది.?
చెబుతాను.
1. సమాజంలో గురువులకి అత్యంత కీలకమైన స్థానాన్ని గౌరవాన్ని కల్పించాలి. గురువులు అన్నమాటని ఇక్కడ ఏ ఒక్క సామాజిక వర్గాన్నో, సమూహాన్నో ఉద్దేశించి చెప్పటం లేదు. అది ఒక వృత్తి అనే అర్థంలో వాడాను. కాకపోతే ఆ వృత్తిలో ఉండేవారికి సామాజిక బాధ్యత ఉండేలాంటి మానసిక స్థాయి ఉండాలి. అలాంటి వ్యక్తులని ఆయా స్థానంలో కూర్చోబెట్టాలి. ఇది మానవ సమాజానికి అత్యంత ఆవశ్యకం. - టీచర్లు మార్కుల మీద కాక, నిజంగా ఆయా సబ్జక్టులలో పిల్లలకి లోతైన అవగాహన కలిగేలా బోధించాలి.
2. మన శరీరాన్ని నడిపేది మెదడు. ఆ మెదడు ఉండేది తలలో. తల ఎలా శరీరానికి కీలకమో గురువు సమాజానికి కీలకం. ఆయన సమాజానికి సరీయిన దిశ, దశని నిర్ణయిస్తారు. ఎప్పుడైతే మనం ఆ గురువుని కించపరచటం మొదలెట్టామో సమాజం భ్రష్టుపట్టడం ప్రారంభం అవుతుంది.
3. ఈ గురు స్థానాన్ని నిర్ణయించేది ఉత్తి డిగ్రీలో, మార్కులో ర్యాంకులో, రిజర్వేషన్ కోటాలో నియామకాలో కాదు. అతనికి వ్యక్తిత్వం ఉండాలి, సమాజం పట్ల ప్రేమ ఉండాలి. ప్రతి ఒక్కరిని కుల, మత, జాతి, లింగ భేదాలకి అతీతంగా తన స్వంత పిల్లలలాగా చూసుకునే ఔన్నత్యం ఉండాలి. రాజకీయాలకి అతీతంగా ఉండాలి.
4. విద్యా వ్యవస్థ పాత్ర కేవలం నామమాత్రం కావడం కూడా ఆందోళన కలిగించే విషయం. అంటే ఇది ఉద్యోగులని తయారు చేసే కార్ఖానాలుగా మారిపోయాయి. గుమాస్తా ఉద్యోగం మొదలుపెట్టుకుని, సమాజంలో మానవునికవసరమైన అన్ని వృత్తులకి ఉద్యోగులని తయారు చేసే కార్ఖానాలుగా మారిపోయాయి. అందుకే ప్లేస్‌మెంట్లు, పాకేజీలు, క్యాంపస్ సెలెక్షన్లు అనే దిక్కుమాలిన లెక్కలు మొదలయ్యాయి.
5. వ్యక్తులని, వ్యక్తిత్వాలని ధృఢతరం చేసే గురువులు కావాలి. ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ప్రత్యేక నైపుణ్యం ఆసక్తులు ఉంటాయి. చేప ఈదగలదు, పక్షి ఎగరగలదు, గుర్రం పరిగెత్తగలదు, కోయిల పాడగలదు, నెమలి ఆడగలదు. ఇలా దేని నైపుణ్యం దానిదే. అలాగే ప్రతి వ్యక్తికి ఒక నైపుణ్యం ఉంటుంది. దాన్ని గుర్తించగలిగేలాంటి గురువులు, విద్యా వ్యవస్థ, దాన్ని పెంచి పోషించగలిగేలాంటి వాతావరణం ఉండాలి.
6. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది అంత అసాధ్యం కాదు.
7. సమాజానికి బడి ఎంత ముఖ్యమో గుడి కూడా అంతే ముఖ్యం.
8. ఇక్కడ గుడి అంటే ప్రార్థనా స్థలం. అసలు ఈ గుడి యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ తెలుసుకుందాం.
9. కురుక్షేత్రం అంటే ఎక్కడో లేదు. మనిషి అనే వాడు ఒక సామాజిక జంతువు అని తెల్లతోలు వాడు చెప్పనే చెప్పాడు కద. మనం ఎంత నాగరికతని నటించినా, ఎంత చిరునవ్వులు పులుముకుని సంస్కారవంతంగా నటించినా మనలో మృగం ఉంటుంది ఖచ్చితంగా. పరస్త్రీ కావాలి అని కోరుతుంది మనసు, పరద్రవ్యంకావాలి అంటుంది మనసు, నచ్చని వాడ్ని చంపేయ్యి అంటుంది మనసు, ఈ అవాంఛనీయ భావాలు ప్రతి ఒక్కడిలో ప్రతి రోజు కలుగుతూనే ఉంటాయి. వాటిని బాహటంగా చెప్పేవాడు రాంగోపాల్‌వర్మ అవుతాడు, వాటిని ఆచరించి చూపేవాడు నేరస్థుడు అవుతాడు, అలా వద్దర్రా ఇవన్నీ సహజమే కానీ మనం బుద్ధిగా ఉండాలి మానవ జన్మ ఉత్కృష్టమైనది దీన్ని సద్వినియోగం చేసుకో ధర్మ బద్ధంగా ఉండు అని చెప్పే వాడు పురోహితుడు అవుతాడు. వాడు గుడిలో ఉండె పూజారి అంటాం, వేదిక ఎక్కితే ప్రవచనకారుడు అంటాం. పూజలు పునస్కారాలు చేసి మనలో ధైర్యాన్ని నింపేవాడిని ఇంకో పేరుతో పిలుస్తాం. వీరంతా మనిషి మనసులో నిరంతరం చెడుకి మంచికి మధ్యన జరిగే కురుక్షేత్రంలో మంచి గెలిచేలాంటి మానసిక స్థితి మనకి కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
10. నాకు తెలిసింది హిందూ ధర్మం మాత్రమె. ఇతర మతాల విషయంలో కూడా ఇదే లక్ష్యంతో మత పెద్దలని ఏర్పాటు చేసి ఉంటారనుకుంటా. వాళ్ళూ భ్రష్టుపట్టిపోతున్న సమాజాన్ని సరి అయిన దిశగా పెట్టాలసిన పవిత్ర బాధ్యత కలిగి ఉండాలి.
11. అలా కాక మా మత ప్రచారం చేస్తాం, హిందూ మతంలో ఉన్న లోపాలు (వాళ్ళ హ్రస్వ దృష్టితోనూ, అవగాహనా రాహిత్యంతోనూ ఏర్పరచుకున్న తక్కువ స్థాయి భావాలతో ) ఎండగట్టం చేస్తే వారికి నాన్ బెయిలబల్ అరెస్టు వారెంట్ జారి చేసి ఉరి శిక్ష వేసినా తప్పు లేదు.
12. ఇది సమాజం. ఇది ఒక పవిత్ర కొలను లాంటిది. ఈ పవిత్ర జలాన్ని అమృతతుల్యంగా నూ దేవాలయంగానూ పరిగణిస్తే ఈ సమాజం చక్కగా ఉంటుంది. లేదు నేను ఉచ్చ పోస్తాను, బట్టలు ఉతుక్కుంటాను ఈత కొడతాను, దొడ్డి కడుక్కుంటాను అంటే ప్రభుత్వాలు క్షమించకూడదు.
13. సమాజం అనేది ఒక ఫాబ్రిక్. దానిలో ఎక్కడ ఒక చిన్న నూలు పోగు దెబ్బ తిన్నా మొత్తం ఫాబ్రిక్ దెబ్బతింటుంది. ఎవ్వడికీ దీన్ని మీరి మాట్లాడే హక్కు లేదు.
14. అది గుడి కావచ్చు, చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు - ఆయా గురువులు చేయాల్సింది సమాజంలో శాంతి స్థాపించడం, అలసిన మెదళ్ళకి సాంత్వన ఇవ్వటం, ధైర్యం చెప్పటం, దిశని చూపటం, ధర్మాన్ని బోధించటం ఇవి తప్ప కమర్షియల్ ఆక్టివిటీస్, హిందూ మత ద్వేషం నూరిపోయటం (నేను పర మత ద్వేషం అనే పాలిష్డ్ వర్డింగ్ వాడటం లేదు. ఒక్క నాటికిగుళ్ళలో ఇతర మతాల పట్ల ద్వేషాన్ని నూరిపోయరు. సర్వే జనా సుఖినోభవంతు అనే నూరిపోశారు నా చిన్నప్పటి నుంచి )
15. గురువులకి (వారు బడిలో టీచర్లు కావచ్చు, కాలేజీల్లో లెక్చరర్లు ప్రొఫెసర్లు కావచ్చు, గుడిలో పూజార్లు కావచ్చు ) ఐఐటీ స్థాయి చదువులు చదివిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, వారికి అత్యంత ఆకర్షణీయమైన వేతనాలు సౌకర్యాలు ఇవ్వాలి. ఐటీ రంగంలో ఉన్న స్థాయి జీతాలు, సౌకర్యాలు,వృత్తిలో అదనపు బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే సరి అయిన వ్యక్తులు రాగల తరాలకి సరి అయిన మార్గ దర్శనం చేయగలుగుతారు
16. ప్రతి ఉద్యోగానికి డిగ్రీలు చదువులు మాత్రమే క్వాలిఫికేషన్లు గా చూడటం ఆపేసి, సైకోమెట్రిక్ టెస్టులు నిర్వహించి ధర్మ బద్ధమైన జీవితం జీవించే వారిని, మానసిక ఆరోగ్యం ఉన్న వారినే ఉద్యోగులూగా తీసుకోవాలి.
17. నైతిక విలువలని తుంగల్లో తొక్కే సినిమాలు తీసేవారిని, కథలు వ్రాసేవారిని పిచ్చి కుక్కల్ని కాల్చి చంపినట్టు చంపేసినా తప్పు లేదు అనే లాంటి చట్టాలు తేవాలి
18. దిక్కుమాలిన శృంగార దృశ్యాలు తీసే దర్శకులు ముందు తమ భార్యలని పిల్లలని తమ అమ్మానాన్నల్ని షూటింగ్ స్పాట్‌కి తీసుకు వెళ్ళి ఆయా దృశ్యాలు వాళ్ళ సమక్షంలో షూట్ చేయాలి.
19. వారి కుటుంబ సభ్యులకి అవి ఓకే అయితే ఇక నిరభ్యంతరంగా ఆ కుటుంబాన్ని మొత్తం సామాజికంగా బహిష్కరించవచ్చు మనం.
20. మహేష్ భట్ కూతురి పెదాలపై ముద్దు పెడతాడు, రాన్రాను ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు కాబట్టి మనం ముందుగా వారి కుటుంబ సభ్యుల మానసిక స్థితిని కూడా అంచనా వేసుకుని, వారిని అందర్నీ ఓలుమొత్తంగా బహిష్కరించవచ్చు. ఎందుకంటే మనం సైకోలు లేని సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాం కద.
21. గుడి అనేది ఉండేది ఆ గ్రామానికి, ఆ ఊరికి మంచి కలిగేటట్లు నిరంతరం పూజలు వ్రతాలు హోమాలు ఉచితంగా నిరంతరం చేస్తూ ఉండాలి. అంతే గానీ టికెట్టు తీస్కో నీకు హోమం చేస్తాం, నీకు అర్చన చేస్తాం అనేట్టు ఉండకూడదు.
22. విద్య, వైద్యం పూర్తిగా ఉచితంగా అందరికీ అందుబాటులోకి తేవాలి
23. లంచగొండి తనం, అనైతికత తదితర సిగ్గుమాలిన చర్యలకి పాల్పడేవారికి కఠినాతి కఠిన శిక్షలు అమలు చేయాలి.
ఒక కర్తవ్యం లా భావించి నేను ఈ వ్యాసం వ్రాశాను. సమాజం బాగుండాలి. అందరూ బాగుండాలి.
ఎక్కువ మంది చేస్తున్నప్పటికీ చెడుపనులని మంచి అనరాదు. సమాజం కూడా మనిషి మెదడు లాంటిదే, అది కూడా ఒక్కో సారి చెడు వైపు మొగ్గు చూపుతుంది. అప్పుడే సమాజానికి దిశా నిర్దేశనం అవసరం.
ఒక్క అడుగు పడాలి. అదే వేయి అడుగులు పడటానికి ఆస్కారం ఇస్తుంది.
ఇది ప్రతి ఒక్కరి ధర్మం.
నిజం నిష్టూరంగా ఉన్నప్పటికీ అది మాట్లాడటానికి నాకు ఏ భయం లేదు. నేను ఎక్కువమంది అభిమానం కోసం అర్రులు సాచటానికి చౌకబారు రాజకీయవేత్తని కాదు.
చెడు మార్గంలో వెళుతున్న సమాజం ఎందుకు ఇలా ఉందో అనాలిసిస్ చేయగలిగిన వివేకం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత తెలుపుతూ ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
మీరు చేయవలసిందల్లా షేర్ చేయటం.
చేస్తారు కద.
రచన: డా రాయపెద్ది వివేకానంద్
పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ సృష్టికర్త
(కోచ్ టు సెలెబ్రిటీస్ & బిజినెస్ లీడర్స్)
No comments:
Post a Comment