Saturday, December 27, 2025

 పురా ... అపి నవం 
పురాణం అంటారు

అంటే ‌‌...
ప్రాచీనమే అయినా నిత్య నూతనం... 
అని అర్థమట!

*****

ఇతి హాసశ్చ 
ఇతిహాసం అనీ అంటారు

అంటే
ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం 
అని వ్యుత్పత్తి అట

******

భారతీయ 
ధార్మిక సాహిత్యం... 

చతుర్వేదాలుగా... ఉపనిషత్తులుగా ...
రామాయణ, మహాభారత ఇతిహాసాలుగా 
అష్టాదశ పురాణాలు గా వెలువడింది. 

మానవ స్వభావాల చిత్రణ 
ఇతిహాసాలు, పురాణాలలో
అత్యద్భుతంగా ద్యోతకమౌతుంది

*******

పురాణాలూ ఇతిహాసాలూ
ఇవన్నీ నిజంగా జరిగాయా… అనే ప్రశ్న వస్తే ...

చాలావరకు 
చారిత్రక సంఘటనలే నేపథ్యంగా సాగాయివి.

ఆ తర్వాత కాలంలో 
ఎన్నో ప్రక్షిప్తాలు చోటుచేసుకున్నాయి వీటిలో

కాబట్టి పౌరాణిక సాహిత్యాన్ని 
విచక్షణతో చదవాల్సి ఉంటుంది. 

అంటారు ఎమ్బీయస్‌ ప్రసాద్‌

*******

పురాణాలలోని కథలనూ
వాటి వెనుక ఉన్న మానవ స్వభావాలనూ

ఆయా విశ్వాసాల 
వెనుక ఉన్న అంతరార్థాలనూ

వ్యాఖ్యానించే 
ఒక విశ్లేషణాత్మక గ్రంథం 
'పురాణ పరామర్శ'

**********

పురాణాలను 
లోతుగా విశ్లేషించడం ...

వాటిలోని 
కథలూ నీతులూ..
చారిత్రక అంశాలనూ మానవ స్వభావాలనూ అధ్యయనం చేసి

తన ఆలోచనలను 
‘పురాణ పరామర్శ’ ద్వారా పంచుకున్నారు. 
ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

*********

పురాణ పరామర్శ’ చదివితే 
భారతీయ సాహిత్యాన్నీ
వాటి వెనక ప్రజల్లో పెనవేసుకుపోయిన విశ్వాసాల ఆంతర్యాలు అర్థం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment