పుస్తకం మీద ప్రేమతో .... నాకు అనిపించే—
1.పుస్తకం చదవటం అవసరం ..!
(డబ్బులు వుంటే )కొని చదవటం మంచి అలవాటు
2.' తీసుకెళ్ళి చదివి ఇస్తా ' అనే మాటఎక్కువ శాతం నిజం కాదు
3. మీకు ఇష్టమైన పుస్తకం ఎవరికయినా చదవటానికి ఇవ్వవలసి వస్తే మీ దగ్గర ఇంకో కాపీ వుంచుకోండి
4.ఎవరైనా మీకు ఉచితం గా తాము రాసిన పుస్తకం ఇస్తే ,చదివి మీ అభిప్రాయం చెప్పటం 'మర్యాద ' ..రచయత కి ఇచ్చే గౌరవం అని మర్చిపోకండి .
5. రచయిత ఏమనుకున్నా నిర్మొహమాటంగా మీ అభిప్రాయం చెప్పాలి అనుకుంటే 'డబ్బు పెట్టి' బుక్ కొనండి ....
5A : నిర్మొహమాటంగా అని చెప్పి అవతల మనిషి లో ఎదగబోయే రచయితని చంపేయ కూడదు.. విమర్శ వినదగ్గట్టు , ఉపయోగం ఉండేట్టు గా వుండాలి
6.మొహమాటానికి పోయి , లేదా గొప్పల కి పోయి బుక్స్ కొనకండి ..
ఆ తరవాత డబ్బు , కాలం , షెల్ఫ్ లో చోటు వృధా అయిందని కుమిలి పోవచ్చు
7 అట్టమీద బొమ్మ మోసం చేసే అవకాశం వుండచ్చు ,జాగర్త పడండి .
8.ఏ బుక్ కొనాలి ,కొని చదవాలి అని ఎక్కువ మంది సలహా లు అడగకండి ..అందరి
టేస్ట్ లు ఒకలా వుండవు .. మీ అభిరుచి గురించి తెలిసి - సాహిత్యం గురించి తెలిసిన ఒకరిద్దరిని అడగండి..!
9.గొప్ప రచయిత ల పుస్తకాలు మళ్ళీ మళ్ళీ కొని, చదువు కోవటం తో బాటుకొత్త వాళ్ళవి కొని చదవటం మంచిది .. సాహిత్యం తరతరానికి ఎలా మారుతుందో తెలుస్తుంది
10. కనీసం ఐదేళ్ల కి ఒకసారి మన దగ్గర వున్న పుస్తకాలు (ఎన్నో కొన్ని) ఏ లైబ్రరీ కయినా ఇస్తే కొత్త వాటికి చోటు వుంటుంది . ఇచ్చిన వాటికి ప్రయోజనం వుంటుంది
11 . పిల్లలకి సెల్ ఫోన్ తో బాటు పుస్తకం
కొని ఇచ్చి ' అలవాటు ' చేయటం అవసరం.
12. పుస్తకం లేక ( కొనలేక ) చదవక పోవటం తప్పు కాదు -కానీ టైమ్ లేక చదవలేదు అనటం మటుకు ఖచ్చితంగా తప్పే.
13. తొందరగాపుస్తకం రాయాలి అనే సరదా కంటే , ఇంకా ఎన్నో చదవాలి అనే వుత్సాహం గొప్పది .
( ఆ వుత్సాహమే కొంత కాలానికి మిమ్మల్ని బాగా రాసేటట్టు చెయ్యచ్చు - గొప్ప రచయిత గా మార్చచ్చు)
14. అవకాశం , అదృష్టం వుంటే ప్రపంచ సాహత్యంలో గొప్ప పుస్తకాలు ( ట్రాన్స్లేషన్స్ అయినా )చదవటం మంచిది..
15. చదువు అనేది జ్ఞానం ...
చదవటం అదృష్టం
అందుకు పుస్తకం ఇస్తుంది అవకాశం .
అందుకే ,అందుకో పుస్తకాన్ని .. !
చదువు ఆఖరు వరకూ - జీవితం అఖరు వరకూ..!
సేకరణ
🌹🍃
No comments:
Post a Comment