సహజమైన జీవితం పల్లెలలోనే ఉంటుంది. ఆప్యాయతలు, అనురాగాలు అక్కడే కనిపిస్తాయి. అటువంటి పల్లెలను వదిలి నగరాలవైపు పరుగెత్తడం వినాశానికి దారితీస్తుంది. గ్రామసౌభాగ్యం కోసం అందరూ శ్రమిస్తే, దేశప్రగతి దానంతట అదే కలుగుతుంది.
మనిషి తన తప్పులను ఎంతో జాగ్రత్తగా దాచిపెడతాడు,
బీరువాలో దాచిన అమూల్యమైన రత్నంలా ఎంతో జాగ్రత్తగా దాచిపెడతాడు,
కానీ ఇతరుల తప్పుల విషయానికి వచ్చేసరికి, వాటిని వీధిలో అంటించిన నోటీసు లేదా పోస్టర్‌లా అందరికీ కనిపించేలా బహిరంగంగా ప్రదర్శిస్తాడు. అంటే మనిషి తన లోపాలను కాపాడి దాచుకుంటాడు; ఇతరుల లోపాలను మాత్రం ఆతురతగా వెలికి తీసి, బహిరంగంగా ప్రచారం చేస్తాడు.
ఆ.వె
పల్లెపట్టు లోని ప్రాభవమును వీడి
నగరములను చేరి నష్టపోకు
పల్లె బలము పెంచ ప్రగతి గల్గు మనకు
సిరులు పొంగి పొరలు చిన్నిమూర్తి
తే.గీ
దాచి పెట్టు మనిషి తన తప్పు ధరను
పెట్టి లోన రత్నమువలె, వెల్లడించు
పరుల తప్పు వీధిన కర పత్ర మల్లె
చిన్ని చెప్పును మాటలు చెలిమి తోడ
శుభోదయం
మీ శ్రేయోభిలాషి
డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి (Dr.kvs) 9538742224
VISAKHAPATNAM
No comments:
Post a Comment