Sunday, December 21, 2025

@ ఇనప కచ్చడాలు -స్త్రీని ఎంతగా లైంగికఅవయవంచేసాం...?@ సిగ్గు (మాలిన) బిళ్ల





 @ ఇనప కచ్చడాలు -స్త్రీని ఎంతగా లైంగికఅవయవంచేసాం...?@
""""""""""""""""""""""""""""""""""""""""""""""

సిగ్గు (మాలిన) బిళ్ల

సిగ్గు బిళ్ల కోసం చాలా మందికి తెలుసు ఆడపిల్లలకు చిన్నపుడు సిగ్గుబిళ్ల మర్మాంగానికి అడ్డుగా కడతారు కాని ఇనప కచ్చడం కోసం ఎంతమందికి తెలుసు
మన నీచ, నికృష్ఠ సంస్కృతికి, ధారుణమైన తీరుకు ఒక నిదర్శనం ఒక అకృత్యాన్ని అందంగా భరించే నీచ స్థితికి ఉదాహరణ మన సంస్కృతిలో మొదటి నుంచి మహిళలను చిన్న చూపు చూస్తూనే ఉన్నాము... నేటికీ అది అమలు జరుగుతుంది ముఖ్యంగా "స్త్రీకి మాత్రమే శీలం ఉంది పురుషులకు అవసరం లేదు" అనే చెత్త విధానం మన పనికిమాలిన పూర్వికులు కొందరు పెట్టారు దానిని చాలా నిష్టగా అమలు చేస్తూ వచ్చారు
ఆడవారి శీలానికి రక్షణ ఉండాలని కొందరు నికృష్టులు భావించారు అందుకే ఇనపకచ్చడాల పద్దతిని అమలు చేశారు అసలు ఏమిటీ
ఈ ఇనపకచ్చడం ఏమా కథ...? తెలుసుకోవాలంటే ఇదిగో చదవండి...

పూర్వకాలంలో మన సంస్కృతి ఎన్నో మార్పులు చెందుతూ వచ్చింది అందులో ఆడవారిని అవమానం చేస్తూ సాగిన అపచారాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒక నీచమైన ఆచారమే ఇనపకచ్చడాలు
భర్తలు దూర ప్రాంతాలకు వెళ్లినపుడు భార్యల శీల రక్షణగా ఏర్పాటు చేసేదే ఇనపకచ్చడం అయినా అర్ధం కాలేదు కదా వివరంగా వినండి...

ఇపుడు స్త్రీలు డ్రాయర్లు ధరిస్తున్నారు కదా ఇదే ఇనప లోహంతో ఆ డ్రాయిర్ ను తయారు చేస్తే ఎలా ఉంటుంది.? అదే ఇనపకచ్చడం స్త్రీల యోనికి అడ్డుగా ఒక లోహాన్ని తయారు చేసి దానికి అనుబంధంగా ఉన్న వడ్డానం వంటి రింగ్ ను నడుముకు చుట్టూ బిగిస్తారు దానికి ఒక తాళం వేస్తారు
ఆ తాళం పట్టుకుని భర్తలు దూర ప్రాంతాలకు వెళతారు వాళ్లు తిరిగి వచ్చే వరకూ దానిని ఓపెన్ చేసే అవకాశం ఉండదు భర్త తిరిగి వచ్చిన తరువాతే తాళంతో ఇనపకచ్చడం ఓపెన్ చేసి తరువాత సంభోగించాలి భర్త ఇంట్లో లేనపుడు ఇలా ఇనప కచ్చడం బిగించి వెళతాడు ఇతర పురుషులతో శృంగారంలో పాల్గొంటుందనే భయంతో ఆనాటి మగాళ్లు అలా చేసేవారు ముఖ్యంగా సైనికులు యుధ్దానికి వెళితే కొన్ని నెలల పాటు వచ్చేవారు కాదు. అందుకే ఈ ఏర్పాటు చేసేవారు...

అయితే మహిళలు దీనిని ధరించటం చాలా కష్టం దీనిని ధరించిన తరువాత శరీరం గాయాలకు గురయ్యేది దీనిని తొలిగించాల్సి వచ్చినపుడు కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఒక్కొక్కసారి రక్తాలు కారేవి అయినప్పటికీ ఆనాటి స్త్రీలు వీటిని ధరించే వారు ఇక ఇనపకచ్చడం తయారీ కూడా ప్రత్యేకంగా ఉండేది మల, మూత్ర విసర్జనలకు అవకాశం ఉండేలా
ఆ ప్రాంతాల్లో రంధ్రాలు ఉండేవి అయినప్పటికీ మల, మూత్ర విసర్జనలకు కష్ట పడాల్సి వచ్చేది మగాళ్లు తమ అహంకారాన్ని చాటుకోవటానికి దీనిని అలంకారంగా మార్చి మహిళలకు బిగించేవారు...

అప్పట్లో స్త్రీలు కూడా దీనిని మొదట్లో భరించినా తరువాత కాలంలో ఇదొక అలంకారంగా స్వీకరించారు చాలా మంది గొప్పగా చెప్పుకునేవారు పైగా కచ్చడం లేకపోతే వారు తప్పు చేసేవారిని అనుకుంటారని ప్రతీ ఒక్క మహిళా భర్తి బతమాలుకుని మరీ కచ్చడం చేయించుకునేవారు యోనికి అడ్డుగా శీలానికి రక్షణగా ఉంటుందని అందరూ అనేవారు కొంతమంది వారి స్థాయిని బట్టి కచ్చడాలు చేయించుకునేవారు పేదవారు ఇనుము లోహంతో చేయించుకుంటే, కొందరు వెండి, బాగా ఉన్న వాళ్లు బంగారంతో కూడా కచ్చడాలు చేయించుకునేవారు కాలక్రమంలో అవి తోలుతో కూడా చేయించుకునేవారుbదీంతో కొంత సౌకర్యం ఉండేదట...

ఇలా క్రీ.శ.2వ శతాబ్ధం నుంచి కొన్ని శతాబ్ధాలపాటు ఈకచ్చడాలు ధరించే నీచ సంస్కృతి మన సంప్రదాయంలో ఉంది అంతే కాదు కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా ఇది అమల్లో ఉండేది కొన్ని మాతృస్వామ్య రాజ్యాల్లో అయితే పురుషులకు కూడా మర్మవయానికి అడ్డుగా కచ్చడం వేసేవారట...

ఇలా తరువాత కాలంలో ఈకచ్చడాలే సిగ్గుబిళ్లగా మారాయి అతి మగపిల్లలకు అయితే గానుగ కాయ వంటివి మొలకు కట్టేవారు దీనికి మర్మవయువాల నుంచి దృష్టి తరలించటమే కారణంగా చెబుతారు ఈ ఇనప కచ్చడాల సంస్కృతిని ప్రముఖ రచయత తాపీ ధర్మారావు తన రచనల్లో వాస్తవాలు చెబుతూనే వ్యవస్థను కడిగిపారేశారు నేటికి ఇలాంటి నీచ ఆచారాలు ఎన్నో మన సంస్కృతిలో భాగంగా ఉండిపోయాయి...

కులవ్యవస్థ, స్త్రీలకు సమాన ప్రాతినిద్యం ఇవ్వకపోవటం, మూఢనమ్మకాలు ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి ఆత్మాభిమానాన్ని తీసే చాలా విషయాలు మనం గొప్పగా
చెప్పుకుంటూ బతికేలా చేస్తున్నాయి ఇలాంటి వాటిపై ఆలోచించటం, ప్రశ్నించటం, తిరగబడటం అందరూ అలవాటు చేసుకున్నపుడే కొన్నేళ్లకైనా సమాజం మారుతుంది...

No comments:

Post a Comment