@ యుద్ధ తంత్రం @
నవ్వూ...
బలంగా ఉన్నప్పుడు.
బలహీనుడిగా కనిపించు
దాడికి ....
సేనను నడిపిస్తూనే
అలాంటిదేం లేదన్నట్టు స్తబ్దుగా కనిపించు
శత్రువుకి ...
దగ్గరగా ఉండి కూడా
ఎక్కడో దూరాన ఉన్నట్టు నమ్మించు
నిజంగా ....
దూరాన ఉన్నప్పుడు
దగ్గరకంటూ వచ్చేసినట్టు నమ్మించు
ప్రతి యుద్ధాన్ని
గెలవడంలో లేదు
అత్యున్నత ప్రతిభ అనేది
యుద్ధం చేసే
అవసరమే లేకుండా
శత్రువుని ఓడించడమే అత్యున్నత ప్రతిభ
శత్రువును తెలుసుకో
నిన్ను నువ్వూ తెలుసుకో
ఇక పోరులు నూరైనా నీ విజయం తథ్యం తథ్యం
లోతుగా ...
ఆలోచిస్తాడు విజ్ఞుడు
ఆచరించి చూపుతాడు సమర్ధుడు
- సన్ జూ (Sun Tzu)
ప్రాచీన చైనీస్ సైనిక వ్యూహకర్త
రాసిన గ్రంథం The Art of War (ది ఆర్ట్ ఆఫ్ వార్) నుండి
No comments:
Post a Comment