Wednesday, March 11, 2026

*జ్ఞానం ఒక జీవ నది!* *ఎవ్వరికీ అన్ని ముందే తెలియవు.*

 *జ్ఞానం ఒక జీవ నది!*
                

*ఎవ్వరికీ అన్ని ముందే తెలియవు.*

```
పుట్టినప్పుటినుండి మనకి ఊహ వచ్చే వరకు తల్లి చాలా విషయాలు చెబుతుంది. అలా చెప్పింది తెలుసుకోవడం “జ్ఞానం.”

కొంచెం పెద్దయ్యాక తండ్రి చాలా భౌతిక విషయములు, ఎవ్వరితో ఎలా ఉండాలో చెబుతారు, ఇదొక జ్ఞానం.

స్కూల్లో చేరంగానే, ప్రాధమిక జ్ఞానం నుండి (అక్షర జ్ఞానం దగ్గరనుండి అనేక విషయాలు నేర్పుతారు) ఉపాధ్యాయులు ఎన్నో విషయాలు చెబుతారు. ఇదొక “జ్ఞానం.”

తరువాత మిత్రులు, బాల్య మిత్రులు, కళాశాల మిత్రులు, ఉద్యోగ మిత్రులు, ఇలా మిత్రులు మనకి అనేక తెలియని విషయాలు చెబుతారు. ఇదొక ‘జ్ఞానం.’

వార్తాపత్రికలు, పుస్తకాలు, గ్రంధాలు కొంత ‘జ్ఞానం’ నేర్పుతాయి.

“నేర్చుకునే నైపుణ్యం ఉంటే మన అనుభవాలు కొంత ‘జ్ఞానం నేర్పుతాయి.’

ఇలా ‘జ్ఞానం, ఏమి తెలియని మనకి, ఎందరో, తల్లి మొదలుకొని, అనుభావాల వరకు మనకి ‘జ్ఞానం’ అందిస్తున్న వారే.

ఆది గురువు దత్తాత్రేయ స్వామి కూడా తాను 24 గురువుల దగ్గర నేర్చుకొన్నారు అని చెప్పారు.

ఇలా ‘జ్ఞానం తెలిపే వారు గురువులు, తెలుసుకునే వారు శిష్యులు.’

ఐతే ఇదంతా భౌతిక ‘జ్ఞానం వరకే!’

ఆధ్యాత్మిక ‘జ్ఞానం’ కోసం మనకి సద్గురువు అవసరం. ఆయన ఆ జ్ఞానాన్ని సాధన చేసి అనుభవ పూర్వకంగా తెలుసుకొని, ఆ సాధన ఇతరులతో చేయించ గలిగిన నైపుణ్యం కలవారై ఉంటారు.

మన అంతరంగం నిష్కామ కర్మలతో, స్వార్ధం లేకుండా, మమకారం లేకుండా శుద్ధమైతే, అప్పుడు పరమాత్మ ఒక సద్గురు రూపంలో మన వద్దకు వచ్చి, సాధన మార్గం ఉపదేశించి మనతో సాధన చేయిస్తారు.

ఇది జ్ఞానం వచ్చే విధానము.

అయితే జ్ఞానం కావాలి అంటే కొన్ని అర్హతలు కావాలి!```


**అవి:*
*1). అన్నీ "నాకే తెలుసు" అన్న భావం ఉండకపోవడము.*

*2). మనకి *జ్ఞానం నేర్పే వ్యక్తి పట్ల విశ్వాసం ఉండాలి. "ఆ వీడి మొహం వీడికి ఏం తెలుసు", "పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు" అనుకుంటే జ్ఞానం రాదు.*

*3) తెలుసుకునే జ్ఞానం పట్ల శ్రద్ధ భక్తి*

*4). *జ్ఞానం ఒక నిరంతరంగా ప్రవహించే జీవ నది అని,  అది తనకు తన గురువు ద్వారా, తన నుండి తనని నమ్మే వారికి వెళుతుంది అని తెలుసుకోవాలి.*

*5) జ్ఞానానికి   "పేటెంట్ రైట్స్" ఉండవు. ఇది "నా జ్ఞానం", "నా అనుమతి లేకుండా" ఇతరులకి చెప్పకూడదు అనుకోవడం మూర్ఖత్వం.*

*6). ప్రతి ఒక్కరు వారికి తెలిసింది, విన్నది ఇంకొకరికి చెప్పి (గురువు కావాలని వారికి ఉండదు) వారిచే మెప్పుదల పొందాలి అనే ఆశ ఉంటుంది. భుజం తట్టి శెభాష్ అనిపించుకోవాలి అని ఉంటుంది.*

*జ్ఞానం ఒకరినుండి ఇంకొకరికి వెళ్ళిపోతుంది అని గ్రహించాలి. *జ్ఞానం ఒక జీవ నది లాంటిది అని తెలుసుకోవాలి.*.      

No comments:

Post a Comment