Tuesday, March 10, 2026

గెలిచేవాడు అరవడు తెలుసుకో!| Real Power vs Shouting Chanakya Logic | Satyagrahi

గెలిచేవాడు అరవడు తెలుసుకో!| Real Power vs Shouting Chanakya Logic | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=F4QQrMMUAmI



Transcript:
(00:00) ఒక్క నిమిషం మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోండి. నేను అడిగే ఒక చిన్న మాట గురించి ఆలోచించండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఇన్ని యుద్ధాలు చేస్తున్నాం ఆఫీసలో ప్రమోషన్ కోసం యుద్ధం ఇంట్లో మన మాట నెగ్గాలని యుద్ధం బయటికి వెళ్తే ట్రాఫిక్ లో ఎదుటి వాడితో యుద్ధం. ఇలా ప్రతి చోట మన గొంతు పెంచుతూనే ఉన్నాం.
(00:21) కానీ ఒకటి ఆలోచించండి గట్టిగా అరిచినంత మాత్రాన మీరు గెలిచినట్టా 10 మందిలో అరిచి ఒకరిని తక్కువ చేసినప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉందా లేదు కదా నిజానికి మనం ఎప్పుడైతే గొంతు పెంచుతామో అప్పుడు మన దగ్గర సరైన విషయం లేదని అర్థం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం అరిచే ఈ అరుపులు మనకవచ్చే కోపం మనలోని మనశశాంతి తినేసే ఒక గుర్తులు మాత్రమే.
(00:44) మనం మన మాట వినాలని కోరుకుంటాం కానీ అసలు ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందో అది ఎంత బలహీనంగా ఉందో మనం చూడలేకపోతున్నాం. ఇదే మనందరి సమస్య ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయో తెలుసా మన అహంకారం వల్ల రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు అసలు ఈ అరుపులు అరిచేది ఎవరు కోప్పడేది ఎవరు వీటన్నిటిని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమంటారు. మనం మన అహాన్ని బాగా పెంచుకున్నాం అంటే ఈగోని పెంచుకున్నాం.
(01:07) నేను చెప్పిందే కరెక్ట నా మాటే అందరూ వినాలి అనే పట్టుదల మనల్ని పతనానికి దారి తీస్తాయి. మనం ఎదుటి మనిషిని ఒక మనిషిలా చూడటం మానేసాం. వాడు మనకంటే తక్కువో లేక మన శత్రువులాగో చూస్తున్నాం. అందుకే వాడు ఏ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోకుండా మన అభిప్రాయాన్ని వాడి మీద రుద్దాలని చూస్తాం. చాణక్యుడు చెప్పినట్లు గర్వంతో ఉన్నవాడు ఎప్పుడు తన గొప్పతనం వినాలనుకుంటాడు.
(01:29) అలాంటి గర్వం ఉన్నవాడి దగ్గరికి వెళ్లి మీరు నీతోలు చెప్తే వాడు అస్సలు వినడు. అందులోనూ వాడు రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. వాడు అలా రెచ్చిపోయిన తర్వాత మనం కూడా సమయం సందర్భం చూసుకోకుండా మాట్లాడదాం. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక విత్తనం నాటడానికి సరైన అదును కావాలి. అలాగే మన మాట కూడా ఎదుటి వారి మనసులో నాటడానికి ఒక అద్భుతమైన సమయం కావాలి.
(01:52) ఆ ఓపిక మనకి లేకపోవడమే ఈ సమస్యలన్నిటికీ కారణం. సో అవతల వాడి మూడిని అవతలవాడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకొని మనం మన మాటను గనుక వాడికి చెప్పినట్లయితే అది వాడికి ఎక్కే అవకాశం ఉంది. అలా కాకుండా వాడు వినే స్టేజ్లో లేనప్పుడు వాడు చిరాకులో ఉన్నప్పుడు అంత ఎందుకండి వాడు మీ మీద కోపంగా ఉన్నప్పుడు కూడా మీరు వెళ్లి సలహాలు ఇస్తే కచ్చితంగా వాడు తీసుకోడు.
(02:13) అందులోనూ వాడికి ఉన్న ఈగో ప్రాబ్లం వల్ల వాడు అసలు మిమ్మల్ని లెక్క కూడా చేయడు కాబట్టి మన మాట ఎదుటి వాడి మనసులో నాటుకోవాలంటే దానికంటూ మనకి ఓపిక ఉండాలా దానికంటూ ఒక టైమింగ్ ఉండాలా సో అవతల వాడికి మీ మాట నాటుకోవాల్సిన అవసరం లేదు అసలు నేను ఎందుకు అని అనొచ్చు మీరు అంత సీన్ లేదు మనం మనం కచ్చితంగా మనుషులతో కలిసి బ్రతకాలి అది చచ్చిపోయేంత వరకు ఇది ఫాక్ట్ అన్నమాట అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆత్మీయులు అవ్వచ్చు వీళ్ళందరితో మనం కలిసి బ్రతకాలి.
(02:42) మనం ఈగోకపోతే వాళ్ళు మనకు దూరమైపోతారు కాబట్టి అవతల వాళ్ళకి మన మాటలు ఎక్కాలంటే దానికి కూడా ఒక టైమింగ్ అవసరం. మీకో డౌట్ రావచ్చు అసలు ఈ టైమింగ్ అంటే ఏంటి అందులోన మనకు కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అవతల వాళ్ళకి మన మాటలు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి ఈ అరవటం గొడవలు పడటం వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు.
(03:03) సో ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. మొదటిగా మీరు ఏదైనా మాట్లాడే ముందు ఒక క్షణం ఆగండి. మిమ్మల్ని మీరు ఇలా అడగండి ఇప్పుడు నేను అరవకపోతే ఏమవుతుంది నా మౌనం ఈ సమస్యను పరిష్కరిస్తుందా అని రమణ మహర్షి గారు చెప్పినట్లు మౌనం అనేది అన్నిటికంటే పెద్ద ఉపన్యాసం మీరు నిశశబ్దంగా ఉన్నప్పుడు మీలోని శక్తి పెరుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు తిరిగి అరవకుండా ప్రశాంతంగా ఉంటే అవతల వ్యక్తికి తన తప్పు తానే తెలుసుకునే అవకాశం వచ్చినట్లు అవుతుంది.
(03:33) చాణకుడు చెప్పిన ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ఎవరికైనా పని చేసేటప్పుడు ఆర్డర్ వేయకండి ఇలా చేస్తే బాగుంటుంది కదా మీరు ఏమంటారు అని అడగండి అప్పుడు వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతారు. సో మీ మాట కూడా వింటారు. ముఖ్యంగా ఎదుటి మనిషిని అర్థం చేసుకోండి. వాడు కోపంలో ఉంటే మీరు మౌనంగా ఉండండి. వాడు భయంతో ఉంటే ధైర్యం చెప్పండి. అంతేగాని నొప్పు మీద పెట్రోల్ పోసినట్లు ప్రతిదానికి రియాక్ట్ అవ్వకండి.
(03:57) మీ మాట మందులా ఉండాలి కానీ ఎదుటి వారి మనసుకు గాయం చేసేలా అస్సలు ఉండకూడదు. అలా కాకుండా చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ మనసులో ఒకడు అనుకుంటారు ఇలా చేయాలి వీడు అని చెప్పేసి పాపం ఆ విషయం వాడికి కూడా చెప్పరు చాలా మంది కానీ వాడు వేరేలా చేసిన వెంటనే వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. అలా రావటం వల్ల ఎవరికి ఇబ్బంది ఆ పని చేసిన వాడికా లేకపోతే బయటకి చెప్పకుండా మనసులో అనుకున్న వాడికా పోనీ మీరు బయటికే చెప్పారు ఇలా చేయాలి బాబు అని చెప్పేసి అయినా సరే తాను చేయలేకపోయాడు.
(04:24) అప్పుడు కూడా మీకు కోపం వస్తుంది. ఎవరు ఇబ్బంది పడతారు మనమే ఇబ్బంది పడతాం. అందులోన కోప్పడటం వల్ల ఆ వ్యక్తి మళ్ళీ ఆ పనిని సరిచేసే అవకాశం ఉందా లేదు. ఆ వ్యక్తి ఆ పనిని సరిచేసే అవకాశం ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పే విధానం మార్చుకున్నప్పుడు మనం కరెక్ట్ గా చెప్పినప్పుడు అవతల వ్యక్తికి ఎలా చెప్తే ఈ పని జరుగుతుందో మనకి తెలిసినప్పుడు కాబట్టి కోప్పడకుండా నిప్పు మీద పెట్రోల్ పోసినట్లు కాకుండా ప్రశాంతంగా వాడికి ఒక మందులా ఉండాలి తప్ప వాడికి ఒక గాయంలో అస్సలు ఉండకూడదు మీ మాటలు కాబట్టి మాటల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోండి. ఇవన్నీ
(04:58) తెలుసుకోవాలంటే మార్పు అనేది రావాలి. మార్పు అనేది బయట కాదు మీ లోపల రావాలి. మీరు ప్రపంచాన్ని మార్చాల్సిన అక్కర్లేదు. మిమ్మల్ని మీరు మార్చుకుంటే చాలు. రమణ మహర్షి గారు చెప్పినట్లు నేను ఎవరు అని మీరు తెలుసుకుంటే ఈ చిన్న చిన్న గొడవలు అరుపులు మీకు చాలా అల్పంగా కనిపిస్తాయి. చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే చిన్న పిల్లల గొడవలు చూసిన తర్వాత పెద్దవాళ్ళు ఏమనుకుంటారు పాపం వాళ్ళేదో పసి పిల్లలు తెలియక గొడవలు పడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు కదా అలాగే మనం కూడా ప్రతి ఒక్క విషయాన్ని కొంచెం క్లియర్ గా చూస్తే
(05:28) అందులోనూ నేను ఎవరు అనే పర్స్పెక్టివ్ లో గనుక చూస్తే అవతల వాళ్ళ చీరలు కూడా మనకి చిన్న పిల్లల చేస్తాలా కనిపిస్తాయి. మీ వ్యక్తిత్వాన్ని బలంగా మార్చుకోండి. సింహంలా గంభీరంగా ఉండండి కానీ అనవసరంగా గర్జించకండి. మీ పని చూసి జనం మీ మాట వినాలి కానీ మీ అరుపులు చూసి కాదు ఎందుకంటే అరుపులు అనేవి కేవలం కొంతసేపు మాత్రమే అరుస్తాము కానీ మన పని అనేది చరిత్రలో మిగిలిపోతుంది.
(05:52) అందులోనూ మన పని అనేది మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మాటల కన్నా పని మీద ఫోకస్ ఎక్కువ పెడితేనే మనకి సరైన గౌరవం తక్కుతుంది. మన మాటకు కూడా విలువ ఉంటుంది. నేటి నుంచి ఒక చిన్న మార్పు చేసుకోండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు గొంతు తగ్గించండి. ప్రేమతో మాట్లాడండి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎంత తగ్గి ఉంటే అంత గొప్పగా ఎదుగుతారు.
(06:14) ఎదుటి వారికి వెనక్కి తగ్గే దారి ఇవ్వండి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. అంతేకాకుండా ఎదుటి వారు కూడా మీలాగే మనుషులనే విషయాన్ని గుర్తించండి. కాకపోతే చాలా మంది ఏంటంటే నేను గొప్ప వీళ్ళు నాకన్నా తక్కువ అనే ఫీలింగ్ లో ఉంటారు. అది డబ్బు అవ్వచ్చు లేకపోతే పేరు ప్రతిష్టలు అవ్వచ్చు. సో ఈ రెండు అనేవి శాశ్వతంగా ఉంటాయా అంటే అది కూడా చెప్పలేము.
(06:35) కాబట్టి శాశ్వతంగా ఉండేది ఏంటంటే మీరు అనే మాటలు మీ బిహేవియర్ ఇంకా ముఖ్యంగా మీరు ఎదుటి మనిషిని ట్రీట్ చేసే విధానం ఈ రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి మీరు గెలిచినా ఓడినా మీరు మంచిగా ఉన్నా లేకపోయినా మీకు ఆటోమేటిక్ గా గౌరవిస్తారు. ఎందుకంటే మీ వ్యక్తిత్వం మీ మనస్తత్వం మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ అవతలు ఇవ్వాలని ఇబ్బంది పెట్టవు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తారు అందులోనూ మీ మాటకు విలువిస్తారు.
(07:03) ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే అవతలి వ్యక్తి మీద గొంతు పెంచకుండా ప్రేమగా మాట్లాడి చూడండి అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎంత తగ్గి ఉంటే అంత గొప్పగా ఎదుగుతారు. ఇది చాలా సింపుల్ విషయం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే జీవితం చాలా చిన్నది ఇందులో గొడవలకి ద్వేషాలకి చోటు ఉండకూడదు. మీరు నమ్మినా నమ్మకపోయినా మనం మన వాళ్ళతో కలిసి ఉండాలి మనం పని చేసే వాళ్ళతో కలిసి ఉండాలి.
(07:25) మన చుట్టూ ఉండే వాళ్ళతో కలిసి బ్రతకాలి అలాంటప్పుడు అందరినీ శత్రువులు చేసుకుంటామా మన ఈగోలకు పోయి అందరితో గొడవలు పడతామా వాళ్ళని మంచి చేసుకోవాలి వాళ్ళతో కలిసి బ్రతకాలి ఆనందంగా ఉండాలి. సో అలా ఉండాలి అంటే మీకు ఏ టైంలో ఎలా మాట్లాడాలో తెలియాలి. అలా కాకుండా అరుస్తాను గొడవలు పడతాను అంటే మీ కంటికి కనిపించిన ప్రతి ఒక్కలు మీకు శత్రువులు అయిపోతారు.
(07:46) సో శత్రువుల మధ్య మీరు బతుకుతారా సో మీకు మీరే శత్రువులని పోగేసుకుంటారా కాబట్టి ఈరోజే మీలో మార్పు రావాలి. ఇప్పుడే మీలో మార్పు మొదలవ్వాలి. చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మనందరం ఆస్తులు పోగేసుకుంటాం. అందులోన అంతస్తులు పోగేసుకుంటూ ఉంటాం. అవి కాస్త మనం ముసలోళ్ళ అయిపోయి చనిపోయిన తర్వాత పిల్లలకి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి.
(08:04) కానీ శత్రువుని పోగేసుకున్న తర్వాత మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో గొడవ పడిన తర్వాత అందరిని శత్రువులని చేసుకొని ఆ శత్రువుని పిల్లలకి మన కుటుంబ సభ్యులకి ఇచ్చేసి వెళ్ళిపోవడం నిజంగా కరెక్ట్ అంటారా లేదా మనం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులకి అండగా ఉంటూ మీరేం కంగారు పడకండి మేము ఉన్నామ అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం కరెక్ట్ అంటారా మీరే చెప్పండి.
(08:29) కచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో గనుక మీకు నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీ కోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్.

No comments:

Post a Comment