Tuesday, March 10, 2026

కాకినాడ లో ఉన్నా యూరప్ లో ఏం జరిగిందో తెలుసు #satyanandiraju #sanatanadharma #hindu #devotional

కాకినాడ లో ఉన్నా యూరప్ లో ఏం జరిగిందో తెలుసు #satyanandiraju #sanatanadharma #hindu #devotional

Author Name:Satya Sanatana Dharma Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AFvEbX0Nc74



Transcript:
(00:00) శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజు పంచుపాటి వెంకట వెంకట స్వామి రావు గారు ఎవరో కాదు మన మాస్టర్ సివి గారు వృత్తరహిత తారక రాజయోగం అనే ఒక కొత్త యోగ మార్గాన్ని సృష్టించి ఎంతోమందిని మహాయోగులుగా మార్చేశారు. వారి ద్వారా ఈ లోకానికి ఎంతో సేవ చేశారు చేస్తున్నారు ఇప్పటికీ వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు ప్రముఖులు వారిలో ఒకరు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వారి ప్రియ శిష్యులు కొత్త రామకోటయ్య గారు వారికి 34వ సంవత్సరం వచ్చేవరకు కూడా వారి జీవితం చాలా సామాన్యంగా గడిచిపోయింది.
(00:39) పైగా చాలా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. కానీ ఆ అనారోగ్యమే వారిని గొప్ప రాజోగిగా మార్చేసింది. ఆశ్చర్యంగా ఉంది కదా మరి 34వ ఏట ఎవరిని కలిశారు ఎలా అనారోగ్యం వారిని గొప్ప యోగిగా మార్చేసింది అలాంటి విశేషాలు ఇవాళ మనం తెలుసుకుందాం. ఇవాళ మనం కొత్త రామకోటయ్య గారి గురించి సత్సంగం చేసుకుందాం. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసిప మందికి షేర్ చేయడం మాత్రమే కాదు హైప్ కూడా చేయండి.
(01:14) ఇంకెందుకు ఆలస్యం సత్సంగం చేసుకని రామకోటయ్య గారి ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా పొందేద్దాం తెనాలి తాలూకా సంఘం జాగర్లమూడిలో 1909లో ఈ రామకోటయ్య గారు జన్మించారు. తండ్రి గారి పేరు వెంకట సుబ్బయ్య తల్లిగారి పేరు యశోదమ్మ ఈయన చదువులన్నీ కూడా చిన్నప్పటి నుంచి చిన్న కాకాని గుంటూరు ఆ సంఘం జాగర్ల మూడులో జరిగింది.
(01:39) సరే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయిపోయారు గుంటూరులో దాని తర్వాత బందర్ హిందూ కాలేజీలో జాయిన్ అయ్యారు ఇంటర్మీడియట్ ఆ సమయంలో తండ్రి వెంకట సుబ్బయ్య గారు కాలం చేశారు. దాని తర్వాత ఆయన ఇంకా విద్యాభ్యాసం ఆపేసి చినకాకాని వచ్చి ఆ గ్రామానికి మునసభగిరి చేయడం మొదలు పెట్టారు. అట్లా 34వ సంవత్సరం వచ్చేసరికి ఆయనకి తీవ్రమైన అనారోగ్యం చేసింది. ఆయన చాలా బాధపడ్డారు.
(02:05) తన మిత్రుడితో చెప్పుకుంటే మిత్రుడు అన్నాడు మా గురువు గారు ఉన్నారు తిరుపతిలో వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన దగ్గరికి వెళ్దాం పదా నీకేమన్న మంచి ఉపాయం దొరుకుతుందేమో అని చెప్పి తిరుపతి తీసుకు వెళ్ళాడు అది చలికాలం సరే పొద్దున్నే కలిశారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు సరే అంతా విన్నారు ఆయన విని ఒక పని చెయ్ నీకు పడని పదార్థం ఏదో ఉంటుంది కదా అది కడుపునిండా తినేసేసి రామకోటయే గారికి అర్థం కాలే ఇదేంటి పడని పదార్థం తినమంటున్నారు నాకు అసలే ఉన్న అనారోగ్యాలు సరిపోవు అనుకుంటూనే వెళ్లి సరే ఆయన చెప్పారు కదా అని చెప్పి ఏదైతే పడదో అది సుష్టుగా తినేసి వచ్చేశరు
(02:46) ఆశ్చర్యం ఏమిటంటే ఆయనకు అప్పటినుంచి అనారోగ్యం అని ఎప్పుడూ అనిపించలే చివరిదాకా కూడా ఆ సందర్భంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఏమన్నారంటే నీ అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి నువ్వు ఎప్పుడు ఇలాగే హాయిగా ఉండవు జీవితాంతం నీకు ఏ ఇబ్బంది ఉండదు అన్నారు. ఇక్కడ బాగా పనిచేసింది ఏమిటి అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క ఋషి వాక్యం మరి ఆయన ఎవరి శిష్యులు మాస్టర్ సి గారి శిష్యులు ఆయన వాక్కు ఎలా వృధాపోతుంది అట్లా కొన్ని రోజులు కొన్ని నెలలు రామకోటయ్య గారు ప్రభాకర శాస్త్రి గారి దగ్గర ఉండి తన అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు.
(03:28) అప్పటినుంచి ఆయన మనసు ఈ యోగమార్గం వైపు మళ్ళింది. అరెరే ఎంత తీవ్ర అనారోగ్యం అయినా కూడా మందులు మాకులు లేకుండా యోగమార్గం ద్వారా తగ్గించుకోవచ్చు అనే అంశం ఆయన్ని బాగా ఆకర్షించింది అప్పటి నుంచి ఆయన ఆ వృక్తరహిత తారక రాజు యోగాన్ని అభ్యసించడం మొదలుపెట్టారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి దగ్గర అట్లా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రామకోటయ్య గారికి మొట్టమొదటి గురువుగా మారారు.
(03:57) ఎన్నో సంవత్సరాలు వారి దగ్గర ఈ రాజయోగ మార్గాన్ని సాధన చేసి ఎన్నో శక్తులు సంపాదించారు. 1950 లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మరణించాక రామకోటయ్య గారి యొక్క మనసు కకావికలం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఏమనిపించింది అంటే తమ గురువు గారి యొక్క యోగ బలం తనలో సిద్ధించినట్లుగా అనుభవమే. అప్పటి నుంచి వారి శక్తులు ఇంకా ద్వినీకృతమైనాయి.
(04:26) దాని తర్వాత ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు రామకోటయ్య గారు ఎందుకంటే వీరి గురు పరంపరలో సివి గారు ఉన్నారు అలాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఉన్నారు అలాగే కవి సార్వభౌమ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. వీరి యొక్క సాన్నిహిత్యం వల్ల వీరిలో రచనా ప్రతిభ మరింత బాగా పెరిగింది. ప్రభాకర వచనాలు దేవీ యోగం వృక్తరహిత తారక రాజయోగం అనేటువంటి ఎన్నో గొప్ప రచనలు చేశారు రామకోటయ్య గారు 1969లో మాస్టర్ ఈకే ఇక్కిరాల కృష్ణమాచార్యులు గారితో కూడా సాహిత్యం ఏర్పడింది.
(05:05) దరిదాపు 14 సంవత్సరాలు నిర్వీరామంగా వారితో కలిసి ఈ సివి గారి యొక్క యోగ ప్రచారాల్లో పాల్గొన్నారు. గుంటూరులో సభ జరిగింది అంటే ఈకే గారితో పాటు రామకోటయ్య గారు ఉండి తీరవలసిందే అంతగా సేవ చేశారు ఇందాక నేను చెప్పినట్టు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క యోగబలం వీరుడు సిద్ధించింది అని చెప్పాను కదా మరి వాటికి ఉదాహరణలు ఏమిటని మీరు నన్ను అడిగితే ఇప్పుడు చెప్తాను వినండి ఎప్పుడు వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు వారు చేశారో ఆర్తులని ఎలా రక్షించారో చెప్తాను చూడండి.
(05:39) 1987 లో ఒక ఎనిమిది సంవత్సరాల పిల్ల విజయవాడ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. డాక్టర్లు చెప్పేశారు ఇంకా బతకదు కొన్ని రోజులేనని తండ్రి చాలా బాధపడ్డారు ఎవరో చెప్పారు దగ్గర చిన్న కాకానిీలోనే రామకోటయ్య గారు ఉన్నారు వెళ్లి కలుగు పరుగు పరుగున రామకోటయ్య గారి కాళ్ళ మీద పడ్డారు ఏమైంది అన్నారు ఇలా ఇలా అయిందండి కొన్ని రోజులే బతుకుతుంది అని చెప్పారంటే విభూది తీసి ఇదిగో వెళ్లి ఆ పిల్ల వీపుకురాయి నేను రేపు పొద్దున్నే వచ్చి చూస్తాను అంతా సర్దుకుంటుంది పో అన్నారు.
(06:14) తండ్రి అనుమాన పడుతూనే వెళ్లి అలానే ఆ పిల్ల వీపు విభూతి రాశాడు పర్నాడు రామకోటయ్య గారు ఆసుపత్రికి వెళ్లేసరికి పిల్ల వేరే పిల్లలతో ఆడుకుంటుంది ఏమైంది అంటే చెప్పాడు తండ్రి సంబరపడిపోతూ రామకోటయ్య గారు డాక్టర్లు పరీక్ష చేసి ఎటువంటి వ్యాధి లేదని నిర్ధారించారండి అని ఇది ఒక చిన్న ఉదాహరణ ఇలాంటివి కోకొల్లలు జరిగినయి రామకోటయ్య గారి జీవితంలో అలాగే ఇంకో సందర్భంలో ఒక రైతు ఉండేవాడు రామకోటయ్య గారు ఏది చెప్తే అదే ఇది లక్ష్మణ గీతలాగా ఉండేది సరే ఒకసారి ఏమైందంటే ఆ ప్రాంతంలో చెరుకు వేసి రైతులంతా నష్టపోయారు వెళ్లి రామకోటయ్య గారిని సలహా అడిగాడు మరి ఈ సంవత్సరం ఏం
(06:58) పండించమంటారు అంటే చెరుకే వేయి ఏం కాదు అన్నారు రామకోటయ్య గారు సరే చెరుకు బ్రహ్మాండంగా పండింది. దురదృష్టం ఏంటంటే దగ్గరున్న గురజాల షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. చెరుకునే వాళ్ళు ఎవరూ లేరు తోటి రైతులంతా కూడా ఈ రైతుని వికరించడం మొదలు పెట్టారు వీళ్ళేదో పెద్ద సలహా అడిగావు ఆయన్ని ఆ తాతగారిని నీ పని అయిపోయిందిలేపో ఈ సంవత్సరం అన్నారు వెళ్లి రామకోటయ్య గారు బాగా చెప్పుకున్నాడు రామకోటయ్య గారు ఇలా కళ్ళు మూసుకుని నాలుగు రోజుల్లో ఆ పని చూద్దాంలే పో అన్నారు.
(07:30) సరిగ్గా నాలుగవ రోజున నంద్యాల నుంచి వేరే షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి అప్పటికి ఉన్న ధర కంటే కూడా చాలా ఎక్కువ మొత్తం చెల్లించి ఆ చిరుకు మొత్తం కొన్నారు. అట్లా రామకోటయ్య గారు ఒక్కసారి మాట ఇచ్చారు అంటే అది ఋషి వాక్యం జరిగి తీరాల్సిందే. ఒకసారి రామకోటయ్య గారు కాకినాడలో ఉన్నారు. ఇక్రాల కృష్ణమాచార్య గారి కొడుకు అనంతకృష్ణ గారు యూరప్ లో ఉన్నారు.
(07:57) అక్కడ కొంతమందికి ఈ ఫారినర్స్ కి మన భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప యోగుల గురించి చెప్తున్నారు. కొంతమంది ఫారినర్స్ అడిగారు అంటే ఇప్పటికీ అంత గొప్ప యోగ బలం ఉన్న యోగులు ఉన్నారా ఉంటే మేము ఎట్లా వారిని దర్శించుకోవచ్చు అంటే ఉన్నారు ఇప్పటికీ ఒక 90 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు ఆయన పేరు రామకోటయ్య కళ్ళు మూసుకోండి మీకు వారి దర్శనం జరుగుతుంది అన్నారు అనంతకృష్ణ గారు అలాగే వారు ధ్యానంలో అలా వెళితే ఫారనర్స్ వారికి ఒక రూపం కనిపించింది అది ఎవరిదో కాదు రామకోటయ్య గారిది ఇక్కడ కాకినాడు ఉన్నటువంటి రామకోటయ్య గారు చెప్పారట అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నో అనంత
(08:38) కృష్ణ గారు తలుచుకుంటున్నారయ్యా యూరప్లో అని ఎక్కడో యూరప్లో వీని తలుచుకుంటే కాకినాడలో ఉన్న రామకోటయ్య గారికి ఎలా తెలిసింది అది వారి యొక్క యోగబలం ఇంకో సందర్భంలో ఒక దంపతులు రామకోటయ్య గారి దగ్గరికి వచ్చారు ఆశీర్వాదం కోసం ఎందుకంటే ఆ భార్య కడుపుతో ఉంది. సరే రామకోటయ్య గారు చక్కగా ఆశీర్వదించారు మగబిడ్డ పుడతాడు ఏమి కంగారు లేదు నెలలు నిండిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ పరీక్ష చేసి బిడ్డ పొజిషన్ అడ్డం తిరిగింది చాలా కష్టంగా ఉంది ఆపరేషన్ చేయాలి అని భర్త కంగారు పడిపోయి రామకోటయ్య గారి దగ్గరికి వచ్చాడు రామకోటయ్య గారు
(09:18) కళ్ళు మూసుకుని ఏం కంగారు లేదయ్యా గురువుగారు అంతా బాగా జరుగుతుంది అన్నారు అని చెప్పి పంచదారా విభూతి ప్రసాదంగా ఇచ్చారు. ఆ భార్య ఆ విభూదిని ప్రసాదాన్ని స్వీకరించింది. బర్నాడు డాక్టర్ పరీక్ష చేసి ఆశ్చర్యపోయాను సిజేరియన్ ఏంటమ్మా అసలు ఏమీ అక్కర్లేదు బిడ్డ పొజిషన్ బ్రహ్మాండంగా ఉంది అని సుఖ ప్రసవం జరిగి పండంటి మగబిడ్డను కంది ఆ తల్లి అది 1991 ఫిబ్రవరి 7వ తారీకు అంటే పేటూరి ప్రభాకర శాస్త్రి గారి జయంతి ఆ సంవత్సరం 104వ జయంతి కార్యక్రమాలు ఆ సందర్భంగా రామకోటయ్య గారు హైదరాబాద్ వచ్చారు బ్రహ్మాండంగా అన్ని ఆ ప్రసంగాలు చేశారు ఎంతో
(10:04) ఉత్తేజితులను చేశారు అంతా బాగా అయిపోయిన తర్వాత ఫిబ్రవరిత తిరిగి మళ్ళీ గుంటూరు ప్రయాణం అయ్యారు. అక్కడ మెట్లు దిగుతూ మా గురువుగారు రమ్మంటున్నారయ్యా మీకు ఇదే చివరి దర్శనం అని చెప్పారు. అట్లా పరధ్యానంగా రైలు ఎక్కారు. సరే తెలవారుతూ అంటే 10వ తారీకు ఫిబ్రవరి 10వ తారీకు కాలకృత్యాలు తీచుకున్నారు రైలులోనే మళ్ళీ బెర్త్ మీద పడుకున్నారు.
(10:30) నడికుడి పిడుగురాళ్ల స్టేషన్ మధ్యలో తమ దివ్య శరీరాన్ని వదిలేసేసి పరమాత్మలో ఐక్యమైపోయారు రామకోటయ్య గారు విన్నారుగా వారి అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర చాలా క్లుప్తంగా చెప్పాను అసలు వారి జీవితం చాలా విస్తారమైంది ఎన్నో అద్భుతాలు చేశారు ఎంతో మందిని కాపాడారు అటువంటి గొప్ప రాజయోగి కొత్త రామకోటయ్య గారు ప్రేమగా చాలామంది కోటయ్య తాతగారు అని పిలుచుకుంటారు.
(10:55) వారి ఆశ్రమం ఇప్పటికీ కూడా గుంటూరు దగ్గర ఖజా ప్రాంతంలో అద్భుతంగా ఉంటుంది ఆశ్రమం ఇప్పటికీ ఎంతోమంది ఎన్నో ఈతి బాధలతో అక్కడికి వచ్చి సమస్యలు తీర్చుకొని హాయిగా వెళ్ళిపోతారు. నేను ఆ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ రామకోటయ్య గారి యొక్క ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నా.
(11:17) ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. మరొక అద్భుతమైన సత్సంగంలో మళ్ళీ మనందరం కలుద్దాం. శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజు.

No comments:

Post a Comment