Tuesday, March 10, 2026

సంతృప్తి నీ జన్మ హక్కు ✍️POSTCARD (18) from KANTHRISA

సంతృప్తి నీ జన్మ హక్కు ✍️POSTCARD (18) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GzkJ__51o-M



Transcript:
(00:01) మనిషి జీవితం నిరంతరం తృప్తికి అసంతృప్తికి మధ్యన కొట్టుమిట్టాడుతుంటుంది. సోక్రటిస్ అంటాడుహిహూ ఇస్ నాట్కంటెంట్ విత్ వాట్ హి హస్వడ్ నాట్ బికంటెంట్ విత్ వాట్ హివడ్ లైక్ టు హవ దాని తాత్పర్యం ఏమిటంటే ఇప్పుడున్న దానితో సంతోషంగా లేనివాడు తాను కోరేది దొరికిన తర్వాత కూడా దానితో సంతోషంగా ఉండే అవకాశం లేదు కొందరికి ఎప్పుడూ అంతేనా అసంతృప్తి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి. కానీ అదేంటో తెలియదు.
(00:40) ఒక చిన్న కథ విన్నా ఇదిఒక ఇండోనేషియన్ స్టోరీ ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి బిస్కెట్ ఇస్తారు ఏడుపాపుతుంది. మళ్ళీ ఏడుస్తుంది ఎవరో వచ్చి టీవీ ఆన్ చేస్తారు కాసేపిన తర్వాత మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ ఎవరో వచ్చి ఉయ్యాల్లో పడుకోబెడతారు. మళ్ళీ ఏడుస్తుంది. ఎవరో వచ్చి ప రూపాయలు ఇస్తారు మళ్ళీ ఏడుస్తుంది ఎవరో వచ్చి టెడ్డీ బేర్ ఇస్తారు మళ్ళీ ఏడుస్తుంది.
(01:10) కథలో చివరి లైన్ ఎలా ఉంటుందంటే ఇవన్నీ కాదు తనకు అమ్మని ఇవ్వండి అని తను ఏడిచేది అమ్మ కోసం కానీ ఈ ప్రపంచం ఏవేవో ఇస్తుంది ఏడుపాపడానికి ఇవ్వాల్సింది ఒక్కటి ఇస్తే సరిపోతుంది. సో తృప్తి గాని సంతృప్తి గాని వస్తువుల్లో దొరకదు. అది వస్తువుల్లో బయట మనుషుల ప్రవర్తనలో వెతికినంతసేపు మనిషిని అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. బుద్ధుడు అంటాడు సంతృప్తి ఉన్నవాడు నిజమైన ధనవంతుడు చాలామంది చెప్పారు దీని గురించి కానీ మనం అంతగా ఆలోచించం.
(01:57) రకరకాల పందుల్లో పడిపోతాం డబ్బు వెంటపడతాం దేనికోసం ఎదురు చూస్తాం దేనికోసం పోరాడతాం నేను ఇది అని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ పెనుగులాటలో ఈ పోరాటంలో అలసి ఒకరోజు మూలక పడతాం. ఫైనల్ గా జీవితం అంటే ఏంది అంటే అంతున అసంతృప్తి అనుకున్నది చేయలేకపోయాను సాధించలేకపోయాను ఫస్ట్ అఫ్ ఆల్ తృప్తికి సంతృప్తికి ఉన్న తేడా ఏమిటి? తృప్తి అన్నది జస్ట్ ఇంద్రియ సుఖం అంతే ఆకలింది తిన్నావు తృప్తి కలిగింది.
(02:34) ఏదో కోరుకున్న వచ్చింది తృప్తి కలిగింది ఇంటికి బంధువులు వచ్చారు ఓ తృప్తి కలిగింది తాత్కాలికం కానీ సంతృప్తి అన్నది కాస్త బయట పరిస్థితులతో సంబంధం లేకుండా నువ్వు అనుభవించే ఒక కాన్స్టెంట్ స్టేట్ ఒక శాశ్వతమైన తృప్తి అది అంటే నీ దగ్గర డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ డబ్బు పట్ల ఒక అవగాహన ఉంది అది లేకపోయినా పర్వాలేదుని నీ చుట్టూ మనుషులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎవరున్నా లేకున్నా నీకు శరీరానికి తగిలే చాలంది గాలి చాలు ఇంకేమ అక్కర్లేదు నాకు ఏదో కావాలంటే తృప్తి ఏమ అక్కర్లేదు అనుకుంటే సంతృప్తి
(03:18) అసంతృప్తి అంటే కావాలనుకున్నది దొరకనప్పుడు సో సంతృప్తిగా జీవించడం అంటే ఆల్మోస్ట్ కోరిక ఎండైపోవడమే సరే కొన్నిసార్లు కోరవల్సింది వచ్చినా అది తీరకపోయినా పర్వాలేదులే అన్న ఒక టేక్ ఇట్ ఈజీ ఆటిట్యూడ్ దానికోసం ప్రయత్నం చేయొచ్చు. ఒక చిన్న కథ విన్నా ఒక రాజు ఉన్నాడు అతని దగ్గర అన్ని ఉన్నాయి. రాజ్యము, సంపద, శక్తి మంది, మార్బలం అన్ని ఉన్నాయి బట్ ఏదో అసంతృప్తి ఒకరోజు గుర్ర మీద పోతూ ఉంటే అడవిలో ఒక ఫకీర్ కనిపించాడు. సాధువు కనిపించాడు.
(03:58) ఆయన దగ్గర ఏమీ లేదు కానీ చక్కగా ఒక పాట హం చేస్తూ ఉన్నాడు దరనరో అని పాడుతున్నాడు అక్కడ వినేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు చిటికేస్తూ పాడుతున్నాడు మంచిగా కాలు అట్లా ఊపుతున్నాడు లయబద్ధంగా రాజు ఆశ్చర్యపోయి తన గుర్రాన్ని ఆపి దిగి అడిగాడు అయ్యా నా దగ్గర అన్ని ఉన్నాయి నేను అసంతృప్తిగా ఉన్నాను నీకుేమీ లేదు నువ్వు ఎంత సంతృప్తిగా ఆనందంగా ఎలా ఉన్నావ్ అంటే ఆ సాధువు అంటాడు నీ దగ్గర ఏదైతే ఉందో అది నీ మనసు నింపలేదు.
(04:40) నాకేమో నాకు అవసరం లేని లేని దాన్ని కోరే మనసు లేదు. ఈ అడవి ఈ చెట్లు ఈ చీమలు ఇది చాలు నాకు అందుకే సంతృప్తిగా ఉన్నాను. మనం సంతృప్తిగా ఉండగలిగే అన్ని మన దగ్గర ఉన్నాయి. కానీ మనం అసంతృప్తిగా ఎందుకు ఉన్నామ అంటే ఇంకా ఏదో కోరుతున్నాం. సో మనలో మనం గుర్తించని ఒక ఈగో ఉంటుంది. అది ఎప్పుడు గుడ్లగూబలాగా కళ్ళు పెట్టుకొని బయటకి చూస్తా ఉంటది.
(05:15) ఎవరిదో ఒక వస్తువు చూసినప్పుడు ఎవరో బాగా సక్సెస్ అయినప్పుడు అది నాకు కావాలి. అవును అని నువ్వు అనుకోగానే అసంతృప్తి బయలుదేరుతుంది. అలా కాకుండా అది మనకు అక్కర్లేదు అని అనుకోగానే ఈగో డిసపర్ అయిపోతుంది. సో ఏమీ లేకపోయినా జీవితం ఉంది అని గుర్తిస్తే అసంతృప్తి వెళ్ళిపోతుంది. వేరేవాళ్ళు ఇచ్చే గుర్తింపు మనకు అక్కర్లేదు.
(05:46) ఎవరనా గుర్తిస్తే అది వాళ్ళ గొప్పదను అనుకుంటే అసంతృప్తి వెళ్ళిపోతుంది. ఏదైనా కోరిక ఉండటం తప్పు కాదు దానికోసం ప్రయత్నం చేయడము తప్పు కాదు కానీ ఆ కోరిక నెరవేరకపోతే దాన్ని అంగీకరించగలిగితే జీవితంలో అసంతృప్తి వెళ్ళిపోతుంది. కృష్ణమూర్తి అంటాడు మన బాధల్లో చాలా భాగం ఇతరులతో పోల్చుకోవడం వల్లే సో పోల్చుకునే మానసిక స్థితి ఉన్నవాడు సంతృప్తిగా ఉండే అవకాశం లేనే లేదు అని తృప్తి అంటావా అవి నీడ్స్ ప్రతిరోజు నీళ్లు కావాలి తృప్తిగా ఉంటుంది భోజనం కావాలి తృప్తిగా ఉంటుంది చలివేస్తే ఒక కోటు కావాలి తృప్తిగా ఉంటుంది.
(06:22) సంతృప్తి అన్నది ఆధ్యాత్మిక పరమైనది. ఒకసారి ఇప్పటికీ నీ దగ్గర ఉన్న చాలా వాటిని చూడు అందులో 99 శాతం విషయాలను నువ్వు ఇగ్నోర్ చేస్తూ ఉన్నావేమో వాటిని తిరిగి ఉపయోగించుకో నీ చుట్టూ ఉన్న కొందరితో మంచిగా ఉండటం ప్రారంభించు ఎవరికైనా మనసు నొప్పి కలిగితే ఓ క్షమాపణ కోరు పెద్దవాళ్ళు కనిపిస్తే [సంగీతం] వాళ్ళ కాళ్ళకు మసాజ్ చెయ్ ఏదైనా ఒక వైట్ పేపర్ కనిపిస్తే దాంట్లో బొమ్మకి నువ్వు ఏదనా చెప్పాలనుకున్నది ఒక పుస్తకంగా రాయి నీ పందిలో పడిపో దాని గుర్తింపు రావాలి లేకపోతే ఎవరో గుర్తించాలి కీర్తి ప్రతిష్టలు కావాలి నా పేరు చిరస్థాయిగా నిలబడాలి ఇట్లాంటి
(07:07) ఆలోచనలు వెంటనే తీసి బొందబెట్టి అది సమాజానికి అవసరమైతే నన్ను గుర్తుపెట్టుకుంటారు అది వాళ్ళ హెడేక్ ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు నో హెడేక్ సో అందుకని నిన్న ఒక వ్యక్తి వచ్చాడు మేము మీ టాక్స్ విన్నాను ఈరోజు మధ్యాహ్నం పెడతాందని ఆటో నడుపుకుంటాడు. కానీ ఎంత స్పష్టంగా చెప్పాడు. మీ మాటల వల్ల నా లైఫ్ లో అసంతృప్తి వెళ్ళిపోయిందండి అంతకంటే ఎక్కువగా ఏమి చెప్పలేదు అతను నాకు చాలా ఆనందంగా అనిపించింది.
(07:45) అతను తన జ్ఞాన ప్రకర్షని తనక ఎన్ని సంస్కృత శ్లోకాలు వచ్చు ఇవేవి చెప్పలేదు జస్ట్ సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాడు అసంతృప్తి లేదండి నాకు పోయింది. అయినా అడిగాను మరి ఇంతకుముందు ఎందుకుఉంది ఇప్పుడు పోయిందని ఎట్లా తెలిసింది అంటే ఇంతకుముందు ఇంకేదో కావాలి. నేను మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాను ఇట్లా చూడాలి అట్లా చూడాలి నేను పోగానే కుర్చి వేయాలి ఇట్లా ఏదో కోరుకునేవాడిని అతను అన్నాడు ఎక్స్పెక్టేషన్ వల్ల నాకు అసంతృప్తి ఉందేమో ఎక్స్పెక్టేషన్ పోవడంతో నాకు అసంతృప్తి పోయింది [సంగీతం] నేను ఇంకా బాగా పని చేయగలుగుతున్నాను. ఇంకా నా
(08:17) చుట్టూ ఉన్న వాళ్ళతో హాయిగా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్తే నా కుర్చి వేయకపోతే కింద కూర్చుంటున్నాను లేదా నా కుర్చి నేనే వేసుకొని కూర్చుంటున్నాను. అసలు వేరే వాళ్ళని లెక్కలోకి తీసుకోవడం లేదు. వాళ్ళకి వచ్చింది ఏదో వాళ్ళు చేస్తున్నారు. నిజంగా ఎవరికీ ఉండదు నన్ను ఇబ్బంది పెట్టాలని ఒకవేళ నిజంగా ఇబ్బంది పెట్టాలని ఒకడు అనుకుంటే నువ్వు ఏం చేసినా వాడు ఇబ్బంది పెడతాడు.
(08:38) సో ఓవరాల్ గా పూర్తి సంతృప్తితో జీవితాన్ని జీవించడానికి కావలసిన అన్ని మన దగ్గర ఉన్నాయి. తృప్తి [సంగీతం] మనకి ఇంద్రియ సుఖం వల్ల వస్తే సంతృప్తి సరైన అవగాహన వల్ల వస్తుంది. అసంతృప్తి ఎక్స్పెక్టేషన్ వల్ల కంపారిజన్ వల్ల వస్తుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలే కానీ ఇవే చాలా పెద్ద విషయాలే కూర్చుంటాయి. వాటి యొక్క ఇంపాక్ట్ చాలా ప్రొఫౌండ్ గా ఉంటుంది మన మీద.
(09:11) అందుకని ఫస్ట్ ఉన్నవాటిని పూర్తిగా అంగీకరిద్దాం. అక్కడి నుంచి జీవితాన్ని తిరిగి నిర్మించుకుందాం. [సంగీతం] మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న సహజమైన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటందరికీ శిరస్సు వచ్చి నమస్కారం సరసువేస

No comments:

Post a Comment