🔥ఎంత అద్భుతమైన తెలివితేటలండి మన పాలకులవి! మనం వాళ్లని చూసి చాలా నేర్చుకోవాలి. ఇంట్లో పిల్లలు ఆకలేస్తోంది అన్నం పెట్టరా అని అడిగినప్పుడు, వాళ్లకి అన్నం పెట్టడం చేతకానివాడు ఏం చేస్తాడు? సైలెంట్ గా పక్కోడి ఇంటికి నిప్పు పెట్టి, ఒరేయ్, వాడెవడో మనల్ని కొట్టడానికి వస్తున్నాడు, ముందు వాడి పని పడదాం రండి అంటాడు. అబ్బా! ఎంత గొప్ప వ్యూహం!
దేశంలో ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నప్పుడు, లోపల జనం ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు... వాళ్ళకి సమాధానం చెప్పే బదులు, ఏకంగా ఒక దేశం మీద బాంబులు వేసేస్తే పోలా? అసలు సమస్యలన్నీ పక్కకు పోతాయి, అద్భుతమైన దేశభక్తి అనే మత్తుమందు అందరికీ ఎక్కేస్తుంది. ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలో చూడండి! దీన్ని ప్రశంసించకుండా ఎలా ఉండగలం? ఇక ఇంకో గొప్ప లాజిక్ ఆలోచించండి. ఆయుధాలు తయారు చేసేవాడు పస్తులుండకూడదు కదా? పాపం వాళ్లూ బతకాలి కదా! అందుకే, లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనుషుల మీద బాంబులు వేస్తూ... దానికి ఉగ్రవాదాన్ని నిర్మూలించి, ప్రపంచ శాంతిని స్థాపించడానికి చేస్తున్న ఆపరేషన్అని ఎంత ముద్దుగా పేరు పెట్టారో చూశారా? శాంతిని స్థాపించడానికి మనుషుల్ని ముక్కలు ముక్కలుగా పేల్చేయడం... వావ్! లాజిక్ ఎలా ఉందంటే, కడుపు నొప్పి తగ్గాలంటే, కడుపు కోసి పేగులు బయటపడేయాలి అన్నంత అద్భుతంగా ఉంది. ఇంత గొప్ప ఆలోచనలు మనకెందుకు రావో కదా! నిజానికి, మన నాయకులని తప్పుబట్టడానికి వీల్లేదు. వాళ్లకు తెలుసు... మనకంటే గొప్ప ప్రేక్షకులు ఈ భూమ్మీద దొరకరని. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో వాళ్లు రక్తం చిందిస్తుంటే, మనం ఇక్కడ సోఫాలో కూర్చుని, స్నాక్స్ తింటూ, ఇరాన్ గెలుస్తుందా? అమెరికా గెలుస్తుందా? అని ఒక వెబ్ సిరీస్ లాగా, ఐపీఎల్ మ్యాచ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే... మనలో ఉన్న ఈ అద్భుతమైన Emptiness, ఈ అజ్ఞానమే... వాళ్ల అసలైన పెట్టుబడి. మనిషి అహంకారం బతకాలంటే దానికి నిరంతరం ఒక గొడవ కావాలి. వాళ్ళు అక్కడ గొడవ పడుతూ వాళ్ళ అహంకారాన్ని పెంచుకుంటున్నారు, మనం ఇక్కడ దాన్ని చూస్తూ మన ఖాళీ బుర్రలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటున్నాం. ఇద్దరిదీ లాభమే! సో, ఈ గొప్ప నాటకాన్ని ఇలాగే ఎంజాయ్ చేయండి. దయచేసి ప్రశ్నించకండి, ఎందుకంటే, పొరపాటున లాజిక్ తో ఆలోచిస్తే అసలు నిజం తెలిసిపోతుంది. నిజం తెలిసిపోతే ఈ మేధావుల'వ్యాపారం ఆగిపోతుంది. అది మనకి ఇష్టం లేదు కదా! ⭕#anukulavedamhttp://youtube.com/post/Ugkx0FWJpKhSA_g9m3cGIAeKUt15Ki_DRiWQ?si=fgQJiN2yS2h0T3AE
No comments:
Post a Comment