శరీర శక్తి vs ప్రాణశక్తి | Real Power ఏది? Spiritual Energy Secret 😳🔥
Author Name:Aryavarta Stories
Youtube Channel Url:https://www.youtube.com/@aryavarta_stories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mX3oyJ5Gnmo
Transcript:
(00:01) ఒక మనిషి 100 కేజీల బరువుని ఎత్తగలడు అదే శరీర శక్తి వల్ల కానీ ఆ 100 కేజీల బరువుని ఎత్తాలని నిర్ణయించుకునే ఆ సంకల్పం ఎక్కడిది అదే ప్రాణశక్తి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి శరీరం ఎత్తేది బరువు కానీ బరువుని ఎత్తమని ఆదేశించేది ఎవరు మీ కండరాలా లేక మీ మనసా చాలామంది జిమ్ కి వెళ్తారు శరీరాన్ని పెంచుకుంటారు వాళ్ళకి సిక్స్ ప్యాక్ వస్తుంది బలం కూడా వస్తుంది కానీ వారి లోపల ఏదో వెలితి ఉంటుంది.
(00:33) ఎందుకంటే వాళ్ళు హార్డ్వేర్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు పవర్ సోర్స్ ని కాదు మరికొందరు బక్క పలచగా ఉంటారు. శారీరంగా సాధారణంగా కనిపిస్తారు. కానీ ఒక్క మాటతో 100 మందిని కదిలించగలరు. ఒక్క నిర్ణయంతో ఈ ప్రపంచాన్ని మార్చేయగలరు. అది కండరాల బలమా కాదు అది సంకల్ప బలం అదే ప్రాణశక్తి అంటే శరీర శక్తి మీతో పని చేస్తుంది. కానీ ప్రాణశక్తి మీకు దిశను చూపిస్తుంది.
(01:03) శరీర శక్తి మీకు బలాన్ని ఇస్తుంది. కానీ ప్రాణశక్తి మీకు అజయత్వాన్ని ఇస్తుంది. అసలు మనిషిని సూపర్ హ్యూమన్ గా మార్చే సీక్రెట్ కోడ్ జిమ్ లో కాదు అది మన లోపలే దాగి ఉంది. ఈరోజు మనం ఆ రహస్యాన్ని తెరవబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయేది సాధారణ జ్ఞానం కాదు.
(01:28) ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తివంతమైన క్లారిటీ కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే మీరు ఈ వీడియోకి మీ సపోర్టు గా జస్ట్ ఒక లైక్ చేయండి. ఈ వీడియోకు మన టార్గెట్ 10,000 లైక్స్ అది మీ వల్లే సాధ్యం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అర్థం చేసుకుందాం. మనిషి జీవితాన్ని నడిపించే రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి శరీర శక్తి మరొకటి ప్రాణశక్తి శరీర శక్తి అంటే మనకు బయట కనిపించే బలం మన కండరాలు పని చేయడం మన శరీరం కదలడం మన చేతులు కాళ్ళు పని చేయడం ఇవన్నీ శరీర శక్తి వల్లే జరుగుతాయి.
(02:06) అంటే శరీర శక్తి మన జీవితంలో పని చేసే సామర్థ్యాన్ని మనకు ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనిషి జీవితాన్ని ముందుకు నడిపేది కేవలం ఈ శరీర బలం మాత్రమే కాదు మన లోపల ఇంకొక శక్తి కూడా ఉంటుంది. అది బయటకు కనిపించదు. కానీ మన జీవితంపై ఇది చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు మీరు గమనించే ఉంటారు. శారీరకంగా బలంగా ఉన్న మనిషి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తాడు.
(02:36) అదే టైంలో శారీరకంగా సాధారణంగా కనిపించే వ్యక్తి అద్భుతమైన ధైర్యంతో ముందుకు సాగిపోతాడు. ఈ తేడా ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడే ప్రాణశక్తి అనే కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. శరీర శక్తి మనకు పనిచేసే బలాన్ని ఇస్తుంది. కానీ ప్రాణశక్తి మన నిర్ణయాలకు దిశనిస్తుంది. మన సంకల్పానికి బలాన్ని ఇస్తుంది. మనలో ఉన్న సామర్థ్యాన్ని మేలుకొలుపుతుంది.
(03:03) అంటే శరీర శక్తి మనం ఏం చేయగలమో చూపిస్తుంది. కానీ ప్రాణశక్తి మాత్రం మనతో ఏం చేయించగలదో నిర్ణయిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. ఈ ప్రాణశక్తి అంటే ఏమిటి? ఇది మనలో ఎలా పనిచేస్తుంది? మన జీవితాన్ని ఇది ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పుడు మనం కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ప్రాణశక్తి అంటే ఏమిటి? ఇది కేవలం గాలి కాదు ఇది విశ్వ చైతన్యం.
(03:30) మనలో ప్రవహించే జీవశక్తి మన శరీరాన్ని కదిలించే కనిపించని ఎనర్జీ. ఒకసారి ఆలోచించండి మన హృదయం ఎందుకు నిరంతరం కొట్టుకుంటుంది? మన కళ్ళలో ఎందుకు జీవం ఉంటుంది మనలో కలలు ఎందుకు పుడతాయి ఇవి కేవలం బయాలజీ వల్ల మాత్రమే కాదు ఇవి ప్రాణశక్తి వల్ల జరుగుతాయి. ఈ ప్రాణశక్తి లేకపోతే మన శరీరం కేవలం ఒక శరీరమే దీనికి జీవం ఉండదు ఉత్సాహం ఉండదు దిశ ఉండదు.
(04:00) ఇది కొంచెం క్లియర్ గా అర్థం కావాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. ఒక కారు ఉందని అనుకోండి. ఆ కారు మీ శరీరం దానిలో ఉన్న పెట్రోల్ మీ శరీర శక్తి పెట్రోల్ లేకపోతే కారు కదలదు అది నిజం అంటే శరీర శక్తి అవసరం కానీ పెట్రోల్ మాత్రమే ఉంటే సరిపోతుందా కారు స్టార్ట్ అవ్వడానికి ఒక స్పార్క్ కావాలి. దాన్ని నడిపించే ఒక డ్రైవర్ కావాలి. ఆ డ్రైవరే ఈ ప్రాణశక్తి.
(04:28) డ్రైవర్ లేకపోతే పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఉన్న కారు అక్కడికక్కడే నిలిచిపోతుంది. అది కదలదు అది ఎక్కడికి ప్రయాణం చేయదు. అదేవిధంగా మీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మీ శరీరంలో బలం ఉండొచ్చు మీ దగ్గర డబ్బు ఉండొచ్చు. మీ దగ్గర గొప్ప గొప్ప అవకాశాలు కూడా ఉండవచ్చు. కానీ సంకల్ప బలం మీలో లేకపోతే అంతా అక్కడికక్కడే ఆగిపోతుంది.
(04:53) ఎందుకంటే మనిషిని ముందుకు నడిపేది కేవలం శరీర బలం కాదు. అది మనలో ఉన్న ఆ అంతర్గత డ్రైవర్ అదే ప్రాణశక్తి మీరు ముందుకు వెళ్ళాలా లేక లొంగిపోవాలా అనేది నిర్ణయించే అసలు శక్తి ఇదే అందుకే గుర్తుంచుకోండి శరీర శక్తి జీవితాన్ని నడిపిస్తుంది కానీ ప్రాణశక్తి మీ జీవితానికి దిశను చూపిస్తుంది. ఇప్పటివరకు నేను చెప్పింది కేవలం మాటలేనా లేక ఇవి నిజ జీవితంలో కూడా జరుగుతాయా అని మీరు అనుకోవచ్చు.
(05:26) సరే దానికి నేను రియల్ ఎగజాంపుల్ ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. మీరు హిమాలయాల్లో యోగులను గమనించండి మైనస్ డిగ్రీ చలిలో కూర్చుంటారు. వాళ్ళ దగ్గర ఎలాంటి సిక్స్ ప్యాక్ బాడీ ఉండదు. మనకు నార్మల్ గా చూస్తే అది అసాధ్యం అని అనిపిస్తుంది. కానీ వాళ్ళది సాధ్యం చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అపారమైన ప్రాణశక్తి ఉంది.
(05:49) అందువల్లే వాళ్ళు ప్రకృతిని జయిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే వాళ్ళు శరీరాన్ని కాదు వాళ్ళు మనసుని ట్రైన్ చేశారు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఒలంపిక్స్ ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళను చూడండి. అందరికీ ఒకే రకమైన శిక్షణ ఒకే రకమైన శరీర శక్తి ఒకే రకమైన డైట్ ఒకే రకమైన ప్రాక్టీస్ కానీ చివరికి గెలిచేది ఎవరు చివరి క్షణంలో లొంగిపోని మనసు ఉన్నవాడే విజేత అవుతాడు.
(06:18) అదే విల్ పవర్ అదే ప్రాణశక్తి. ఇప్పుడు శరీర శక్తి మరియు ప్రాణశక్తి మధ్య ఉన్న డిఫరెన్స్ ని క్లియర్ గా చూద్దాం. శరీర శక్తి మిమ్మల్ని బలవంతుని చేస్తుంది. కానీ ప్రాణశక్తి మిమ్మల్ని ప్రభావశీలిని చేస్తుంది. శరీర శక్తి మీతో పని చేస్తుంది. కానీ ప్రాణశక్తి మీకు ఒక విజన్ ఇస్తుంది. శరీర శక్తి మీకు జీవితాన్ని ఇస్తుంది.
(06:41) కానీ ప్రాణశక్తి మీకు ఒక దిశనిస్తుంది. అంటే ఒకటి బలం మరొకటి దిశ. శరీర శక్తిని పెంచుకోవాలంటే వ్యాయామం ద్వారా సరైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీర శక్తిని పెంచుకోవచ్చు. కానీ ఈ ప్రాణశక్తి విల్ పవర్ పెరగాలంటే ఏం చేయాలి? ఇది జన్మతో రాదు ఇది లక్కు కూడా కాదు ఇది అభ్యాసంతో పెరుగుతుంది. ఆ అభ్యాసం ఏమిటంటే అది మెడిటేషన్.
(07:07) ప్రాణశక్తిని పెంచే అత్యంత పవర్ఫుల్ మెథడ్ మెడిటేషన్. మెడిటేషన్ అనేది ఒక పని కాదు. అది ఒక స్థితి. చాలామంది మెడిటేషన్ అంటే ప్రత్యేకంగా కూర్చోవాలి శాంతమైన గది కావాలి. ఒక ప్రత్యేకమైన టైం కావాలి అని అనుకుంటారు కానీ అది కాదు మెడిటేషన్ అంటే మీ శ్వాసతో మీరు స్నేహం చేయడం శ్వాస మీద ధ్యాస పెట్టడం అదే సరైన మెడిటేషన్ అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీ శ్వాస ప్రాణానికి ద్వారం మీ శ్వాసను గమనిస్తే మీరు ప్రాణాన్ని గమనిస్తున్నట్టే ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు సైలెంట్ గా కూర్చోండి మీ శ్వాసను గమనించండి లోపలికి వస్తున్న గాలి బయటకి వెళ్తున్న గాలిని గమనించండి
(07:49) అంతే ఏ మంత్రం అవసరం లేదు ఏ ప్రత్యేక స్థానం కూడా అవసరం లేదు కేవలం అవగాహన చాలు ఇలా మీరు 21 రోజులు చేస్తే మీ మనసు స్థిరంగా మారుతుంది. మీ నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి. మీ విల్ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు మీ ప్రాణంతో కనెక్ట్ అవుతున్నారు. తర్వాత ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మెడిటేషన్ అనేది నేను 21 రోజులే చెప్పానని మీరు 21 రోజులే చేసి ఆపేయడం కాదు.
(08:18) మెడిటేషన్ అనేది మీ రోజువారి హ్యాబిట్స్ లో మొట్టమొదటి ఇంపార్టెంట్ హ్యాబిట్ గా ఉండాలి. ఈ విల్ పవర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ పవర్ ని అప్ అండ్ డౌన్ కాకుండా ఎప్పుడూ స్థిరంగా ఉండేలా చేసేది ఈ మెడిటేషన్ మాత్రమే కాబట్టి మెడిటేషన్ ని ప్రతిరోజు మీ జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ హ్యాబిట్ గా మార్చుకోండి. ఇప్పుడు మీ విల్ పవర్ ని పెంచుకోవడానికి ఇంకొక శక్తివంతమైన రహస్యాన్ని చెబుతాను. జాగ్రత్తగా వినండి.
(08:43) ప్రాణశక్తి పెరగడానికి రెండు పవర్ టైమ్స్ ఉన్నాయి. అవి ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ఈ రెండు టైమ్స్ లో మీ మనసు మీ సబ్కాన్షియస్ మైండ్ కి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే మూడు శక్తివంతమైన ఆఫర్మేషన్స్ ప్రతి ఉదయం ప్రతి రాత్రి. మూడుసార్లు మీ మనసులో ఈ మూడు పవర్ఫుల్ ఆఫర్మేషన్స్ ని గట్టిగా చెప్పుకోండి.
(09:07) మొదటిది నా ప్రాణశక్తి ప్రతిరోజు పెరుగుతుంది. నా సంకల్పం అచంచలంగా మారుతుంది. రెండవది నేను నిర్ణయించిన పనిని పూర్తి చేసే వ్యక్తిని నా విల్ పవర్ అపారమైనది. మూడవది విశ్వశక్తి నాలో ప్రవహిస్తోంది. నేను మానసికంగా మరియు ఆత్మికంగా అజయుడిని అని. ఈ మూడు వాక్యాలు మొదట 21 రోజులు ఏ ఒక్క రోజు బ్రేక్ లేకుండా చెప్పండి. అప్పటినుంచి నీ జీవితంలో అది ఒక అలవాటుగా మారిపోతుంది.
(09:36) ఆ తర్వాత మీకు మార్పు అనేది మీ జీవితంలో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇప్పుడు మీకు ఫైనల్ క్లారిటీ శరీర శక్తి అవసరం దాన్ని గౌరవించండి. కానీ మీరు అసలు అప్గ్రేడ్ చేయవలసింది ప్రాణశక్తిని. ఎందుకంటే శరీరం ఒక సాధనం. ప్రాణం మీ అసలు యజమాని. ఇప్పుడు మీరు నిర్ణయించండి. మీరు కేవలం బలవంతుడిగా ఉండాలా? లేక ప్రభావశీలిగా మారాలా అనేది. మీరు ప్రాణశక్తికి శరీర శక్తికి ఉన్న తేడాని బాగా తెలుసుకున్నారు కదా కాబట్టి ఇప్పుడే కామెంట్ లో టైప్ చేయండి.
(10:08) శరీర శక్తా లేక ప్రాణశక్తా అనేది. అలాగే గుర్తుంచుకోండి మీ శ్వాసే మీ రహస్యం మీ సంకల్పం మీ ఆయుధం. మీ ప్రాణశక్తే మీ అసలైన శక్తి. మీరు ఇప్పటికే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఉంటే ఈ వీడియోని మీరు కనీసం 10 మందికి షేర్ చేయండి. ఇది చాలా వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది అందరికీ చేరాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక లోతైన కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాను.
(10:33) ఈలోపు మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ లో ఉంచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డు సబ్స్క్రైబ్.
No comments:
Post a Comment