Wednesday, March 11, 2026

******What is love? The shocking truths told by Plato | What is Love? Plato Philosophy

What is love? The shocking truths told by Plato | What is Love? Plato Philosophy

 https://m.youtube.com/watch?v=X8e4FWm9Dpo



00:04 మనిషి నాగరికత నేర్చుకున్నప్పటి నుంచి అడవుల నుంచి కాంక్రీట్ జంగిల్స్ వరకు ప్రయాణించినా కాలంతో పాటు మారుతూ వచ్చిన ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే అది ఒక అన్వేషణ
00:15 ఆ అన్వేషణే ప్రేమ. యుద్ధాలు జరిగినా, సామ్రాజ్యాలు కూలిపోయినా, కవుల కలం నుంచి రక్తం చెందిన దాని వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఇదే అని మనం నమ్ముతుంటాం. కానీ ఈ
00:26 మాటలు నావి కావు. ప్రపంచం గర్వించే గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో వేల ఏళ్ల క్రితమే ఒక భయంకరమైన సత్యాన్ని మన మొహాన కొట్టాడు. అదేమిటంటే లవ్ ఈస్ ఏ సీరియస్ మెంటల్
00:36 డిసీజ్ అని వినడానికి ఇది చాలా క్రూరంగా అన్ రొమాంటిక్ గా అనిపించవచ్చు. కానీ ప్లేటో లాంటి మేధావి ప్రేమను ఒక తీవ్రమైన మానసిక వ్యాధి అని ఎందుకన్నాడు? మనం
00:47 పవిత్రమైనది అని పూజించే ఈ ఎమోషన్ నిజానికి ఒక మానసిక రుగ్మత అయితే మనం ఇప్పటివరకు బ్రతుకుతున్న జీవితం ఒక పెద్ద అబద్ధమా? అసలు సమాజం మనకు నేర్పిన ప్రేమ
00:57 అంటే ఏమిటి త్యాగం, అనురాగం ఒకరి కోసం ఒకరు బ్రతకడం ఒకరి కళ్ళలో ఒకరు ప్రపంచాన్ని చూసుకోవడం ఇవన్నీ మనం సినిమాల్లో నవలల్లో చూసి నేర్చుకున్న
01:06 రొమాంటిక్ డెఫినిషన్స్ కానీ నిజానికి ప్రేమ అంటే ఒక వ్యక్తిపై మనకున్న విపరీతమైన డామినెన్స్ మనలో ఉన్న ఇన్సెక్యూరిటీ భావాన్ని మనలోని అగాధమైన
01:15 ఒంటరితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి మనం ఇంకొకరితో చేసుకునే ఒక కెమికల్ డీల్ మాత్రమే ఈ ప్రేమ. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే నిజానికి అవతలి
01:24 వ్యక్తిని ప్రేమించడం లేదు. ఆ వ్యక్తి మన జీవితంలో ఉండటం వల్ల మనకు కలిగే ఆ సెక్యూరిటీని ప్రేమిస్తున్నాం అంతే ఈ వ్యాధి మనల్ని ఎలా వణికిస్తుందో ఒక్కసారి
01:34 గమనిస్తే ఇది కొన్ని దశల్లో మనల్ని ఆక్రమిస్తుంది. మొదటి దశను మనం ఇన్ఫెక్షన్ అని పిలవచ్చు ఎక్కడో ఎవరో తెలియని వ్యక్తిని చూడగానే మన మెదడులో డోపమైన్
01:44 అడ్రినలిన్ లెవెల్స్ ఆకస్మాతుగా పెరిగిపోతాయి. దీన్ని మనం చాలా గర్వంగా స్పార్క్ అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని పిలుచుకుంటాం. కానీ మెడికల్ గా చూస్తే
01:52 ఇదొక అబ్సెసివ్ స్టేట్ రెండో దశ భ్రమ. వాడు లేకపోతే నేను లేను ఆమెతో మాట్లాడకపోతే నా రోజు గడవదు అని అనుకోవడం ఒక క్లాసిక్ డెల్యూషన్ ఇక్కడ లాజిక్
02:02 పూర్తిగా చచ్చిపోతుంది. ఒక మనిషి మరొక మనిషికి ప్రాణాధారం ఎలా అవుతాడు అది కేవలం మెదడు సృష్టించుకున్న ఒక మాయాజాలం మాత్రమే. మూడో దశ వ్యసనం ఒక డ్రగ్ అడిక్ట్
02:12 తనకి డోస్ దొరకపోతే ఎలా పిచ్చివాడైపోతాడో ప్రేమలో ఉన్న వ్యక్తి కూడా అవతలి వ్యక్తి అటెన్షన్ దొరక్కపోతే అలాగే విలవిలలాడిపోతాడు. ఇక నాలుగో దశ క్షీణత ఆ
02:21 అటెన్షన్ తగ్గినా లేదా ఆ వ్యక్తి దూరమైనా మనం పవిత్రం అని పిలుచుకున్న ఆ ప్రేమ వెంటనే విపరీతమైన ద్వేషంగా పగగా మారిపోతుంది. అంటే మన ప్రేమ అనేది కేవలం
02:32 అవతలి వ్యక్తి మనక ఇచ్చే వాల్యూ మీద ఆధారపడి ఉందన్నమాట. నిజానికి ఇదంతా ఒక పెద్ద సర్కాజం. ఒక పిచ్చివాడు రోడ్డు మీద నిలబడి చెట్టుతోనో గోడతోనో మాట్లాడుతుంటే
02:41 మనం వాడిని చూసి జాలి పడతాం లేదా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించమంటాం. కానీ అదే ఒక వ్యక్తి తన ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ అవతలి వ్యక్తి పంపే ఒక ఎమోజీకి గంటలు
02:50 గంటలు మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటే దాన్ని మనం క్యూట్ అంటాం. రాత్రి రెండు గంటలకి నిద్ర మానుకొని తిన్నావా పడుకున్నావా అని అడగడం కేరింగ్ ఎలా అవుతుంది? అది
02:59 కచ్చితంగా నిద్ర లేని వ్యాధి లక్షణం కాదా? సమాజం ఈ వ్యాధికి ఒక గ్లామర్ కోటింగ్ పూసింది. ఎందుకంటే ప్రేమ అనే మార్కెట్ మీద వేల కోట్ల బిజినెస్ నడుస్తోంది. గ్రీటింగ్
03:09 కార్డ్స్ నుంచి డైమండ్ రింగ్స్ వరకు సినిమాల నుంచి డేటింగ్ యప్స్ వరకు అంతా ఈ మెంటల్ డిసీజ్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. సమాజం చెప్పే ప్రేమ
03:17 వెనుక ఉన్న అసలు ఉద్దేశం సోషల్ కన్ఫర్మిటీ. అంటే అందరూ పెళ్లి చేసుకుంటున్నారు అందరూ రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి నేను కూడా ఎవరినో ఒకరిని
03:25 పట్టుకోవాలి అనే భయమే ఇది. మన హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందంటే మనం ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళు మనకి నచ్చినట్టు ఉండాలని కోరుకుంటాం.
03:34 వాళ్ళు మనల్ని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళితే భరించలేం. అంటే అక్కడ మనకు కావాల్సింది అవతలి వ్యక్తి సంతోషం కాదు మన అహానికి కలిగే తృప్తి. మనుషులు స్వతహాగా
03:43 అత్యంత స్వార్ధపరులు. మనం ఇంకొకరిని ప్రేమిస్తున్నామ అంటే నిజానికి వాళ్ళలో మనల్ని మనం ప్రేమిస్తున్నాం. మన అవసరాలని తీర్చే ఒక అద్దం కోసం మనం పడే తాపత్రయమే ఈ
03:53 ప్రేమ. ఫిలాసాఫికల్ గా చూస్తే మానవ ఉనికి అనేది అత్యంత శూన్యమైనది. ఆ శూన్యాన్ని నింపుకోవడానికి మనం రకరకాల వ్యసనాలని వెతుక్కుంటాం. కొందరికి అధికారం వ్యసనం
04:03 అయితే మరికొందరికి డబ్బు వ్యసనం. మెజారిటీ ప్రజలకి ఈ ప్రేమ అనేది ఒక వ్యసనమే. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు కూడా లోలోపల నవ్వుకుంటూ ఉండవచ్చు. నా ప్రేమ
04:12 అలాంటిది కాదు నా పార్ట్నర్ చాలా గ్రేట్. మా మధ్య ఉన్నది గ్రేట్ రిలేషన్షిప్ బాండ్ అని మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ ఇది సరిగ్గా ఒక రోగి తనకి
04:21 జబ్బు లేదని డాక్టర్ తో వాదించినట్టే ఉంటుంది. మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ లేనప్పుడు అవతలి వ్యక్తి ప్రవర్తన మీద మీ సంతోషం ఆధారపడి ఉన్నప్పుడు దాన్ని ప్రేమ
04:30 అని పిలవడం కేవలం ఒక సాకు మాత్రమే అదిఒక బానిసత్వం మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ మెదడులో జరుగుతున్న కెమికల్ లోచాన్ని మీరు ఒక గొప్ప
04:39 ఆధ్యాత్మిక అనుభూతిగా భ్రమపడుతున్నారు. సమాజం ఈ భ్రమను ప్రోత్సహిస్తోంది ఎందుకంటే నిజం తెలిస్తే మనుషులు విచ్చలవిడిగా మారిపోతారని వ్యవస్థలు కూలిపోతాయని భయం.
04:48 మనం పుట్టినప్పటి నుంచి చవ్వే వరకు ఒంటరి వాళ్ళమే. ఈ నిజాన్ని అంగీకరించలేక తోడు కోసం పరితపిస్తూ ఆ తోడు దొరికినప్పుడు దానికి ప్రేమ అనే లేబుల్ వేసి పండగ
04:57 చేసుకుంటాం. కానీ ఆ రంగు కొద్ది రోజులకే వెలిసిపోతుంది. అప్పుడు మొదలవుతుంది అసలు నరకం. గొడవలు, అనుమానాలు, ఆధిపత్య పోరాటాలు. అయినా సరే మనం దీన్ని
05:06 వదిలిపెట్టం. ఎందుకంటే మనకి నిశ్శబ్దం అంటే భయం, ఒంటరితనం అంటే వణుకు. ఆ భయం నుంచి పుట్టిందే ఈ రిలేషన్షిప్ డ్రామా అంతా. ప్లేటో అన్నట్టు ఇది సీరియస్ మెంటల్
05:17 డిసీజ్ మాత్రమే కాదు ఇది ఒక సామూహిక పిచ్చి కూడా ఒకరు చేస్తే పిచ్చి అందరూ కలిసి చేస్తే అది సంప్రదాయం లేదా ప్రేమ చివరికి తేలేది ఏంటంటే మనిషి చేసే ప్రతి
05:28 పని వెనక ఉన్నది తన ఉనికిని కాపాడుకోవాలనే తపన. ఈ అనంతమైన విశ్వంలో మనం చాలా అల్పమైన వాళ్ళం అనే సత్యాన్ని మర్చిపోవడానికి మనకొక మత్తు కావాలి. ఆ మత్తే ప్రేమ. అది
05:41 రోగం కాకపోతే ప్రపంచంలో ఇన్ని విరిగిన హృదయాలు ఎందుకు ఉంటాయి ప్రేమ పేరుతో ఇన్ని ఆత్మహత్యలు ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతాయి పవిత్రమైన చోట హింస ఉండదు కానీ ప్రేమలో
05:52 హింస అంతర్లీనంగా ఉంటుంది. అందుకే మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వద్దాం. మనిషి దేనికోసం వెతుకుతున్నాడో అది శాంతి కాదు. అది ఆనందం కాదు. అది కేవలం తన
06:02 ఒంటరితనాన్ని చంపుకోవడానికి తన ఇన్సెక్యూరిటీ భావాన్ని కప్పి పుచ్చుకోవడానికి వెతుక్కునే ఒక భయంకరమైన మానసిక వ్యాధి. మీరు ప్రేమిస్తున్నాను అని
06:11 అనుకుంటున్న ప్రతిసారి ఒకసారి అద్దంలో చూసుకోండి. అక్కడ కనిపిస్తున్నది ఒక ప్రేమికుడు కాదు ఒక రోగి తనకి తానే మందు వేసుకోలేక ఇంకొకరిని ఆ మందుగా వాడుకోవాలని
06:22 చూస్తున్న ఒక అసక్తుడు. ప్లేటో చెప్పింది అక్షర సత్యం. మనం ప్రేమ అని పిలుచుకుంటున్న ఈ మాయాజాలం నిజానికి ఒక సీరియస్ మెంటల్ డిసీజ్. ఈ వ్యాధి నుంచి
06:32 బయట పడటం అంత సులభం కాదు. ఎందుకంటే రోగికి తను రోగి అని తెలిసినప్పుడే చికిత్స మొదలవుతుంది. కానీ ఇక్కడ ప్రపంచం అంతా ఆ రోగంలోనే మునిగి తేలుతోంది. కాబట్టి ఈ
06:42 సామూహిక పిచ్చిలో మీరు కూడా ఒక భాగమే. మీ ప్రేమ, మీ త్యాగం, మీ ఎమోషన్స్ అన్ని ఆ వ్యాధి లక్షణాలే. ప్రేమ అనేది ఒక సహజమైన అనుభూతి అని మనం అనుకుంటాం కానీ అది ఒక
06:53 సామాజిక ప్రోగ్రామింగ్. చిన్నప్పటి నుంచి మనకు వినిపించే కథలు మనం చూసే పరిసరాలు మనల్ని ఒక నిర్దిష్టమైన రీతిలో ఆలోచించేలా చేస్తాయి. ఆ ప్రోగ్రామింగ్ లో భాగమే ఈ
07:03 ప్రేమ. నిజానికి మనిషికి కావాల్సింది గుర్తింపు. ఆ గుర్తింపు ఇంకొకరి కళ్ళల్లో వెతుక్కున్నప్పుడు అది ప్రేమగా మారుతుంది. కానీ ఆ గుర్తింపు శాశ్వతం కాదు. ఎందుకంటే
07:13 అవతలి వ్యక్తి కూడా తన గుర్తింపు కోసం మీ దగ్గరకు వచ్చాడు. ఇద్దరు యాచకులు ఒకరినొకరు ధనవంతులు అని అనుకోవడం ఎంత ఫన్నీగా ఉంటుందో ఇద్దరు ఇన్సెక్యూరిటీ అనే
07:23 భావంతో ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమిస్తున్నాం అని అనుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఈ నిజాన్ని అంగీకరించడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకే మనం కవితలు
07:33 రాసుకుంటాం డ్యూయెట్లు పాడుకుంటాం. కానీ లోలోపల మనందరికీ తెలుసు ఇదంతా ఒక పెద్ద అబద్ధం అని ఆ అబద్ధాన్ని మనం ఎంత అందంగా అలంకరిస్తే అది అంత గొప్ప ప్రేమగా చలామణి
07:44 అవుతుంది. అందుకే ప్లేటో మాటల్ని తక్కువ అంచనా వేయకండి. ఆయన మనుషుల మనస్తత్వాలని లోతుగా అధ్యయనం చేసి చెప్పిన మాట అది. ప్రేమ అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. ఆ
07:54 వ్యాధికి లోనైన ప్రతి ఒక్కరు ఒక మాయా లోకంలో బ్రతుకుతుంటారు. ఆ లోకం నుంచి బయటకు రావడం అంటే వాస్తవాలని ఎదుర్కోవడం. ఆ వాస్తవం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే
08:05 మనం ఆ వ్యాధినే ప్రేమిస్తాం. ఆ పిచ్చినే ఆరాధిస్తాం. చివరిగా మీరు ఎప్పటి నుంచి ప్రేమ కోసం వెతుకుతున్నారో గుర్తు తెచ్చుకోండి. అది మీరు పుట్టినప్పటి నుంచి
08:14 కాదు మీరు మీ గురించి మీరు భయపడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ భయానికి మనం పెట్టిన పేరే ప్రేమ. అదే ఆ సీరియస్ మెంటల్ డిసీజ్.

No comments:

Post a Comment