Wednesday, April 15, 2026

మనిషి పుట్టుకకు ముందే ఈ 6 విషయాలు రాసిపెట్టి ఉంటాయి! | Secret of Karma in Telugu

మనిషి పుట్టుకకు ముందే ఈ 6 విషయాలు రాసిపెట్టి ఉంటాయి! | Secret of Karma in Telugu

Author Name:fact stories in telugu 01

Youtube Channel Url:https://www.youtube.com/@factstoriesintelugu01

Youtube Video URL:https://www.youtube.com/watch?v=woP_TmZV-0A



Transcript:
(00:03) ప్రతి జీవికి ఆరు విషయాలు జన్మకు ముందే నిర్ణయించబడతాయి. భూమిమీద జన్మించే ప్రతి మనిషి తలరాత అనేది అతడు పూర్వ జన్మలో చేసిన కర్మలను అనుసరించి ముందే లెక్కించబడి ఉంటుంది. ఒక వ్యక్తి గర్భంలోకి ప్రవేశించడం దగ్గర నుంచి అతడు మరణించే వరకు ప్రతిదాని వెనుక కర్మఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలాన్ని అదే జన్మలో అనుభవించగా మిగిలిన కర్మ ఫలాన్ని ఆ జీవుడు మరో జన్మలో అనుభవించాల్సి ఉంటుంది.
(00:33) అది పాపమైనా కావచ్చు పుణ్యమైనా కావచ్చు ఆ కర్మఫలం ఆధారంగానే విధిరాత అనేది వ్రాయబడి ఉంటుంది. మనిషి జన్మించక ముందే ఈ ఆరు విషయాలు ముందే నిర్మించబడతాయి. వీటిని భూమి మీదకు వచ్చాక మార్చుకోవడం అనేది కుదరని పని మరి ఆ ఆరు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి పుట్టుక రెండు జ్ఞానం మూడు వివాహం నాలుగు ఐశ్వర్యం ఐదు సంతానం ఆరు మరణం పుట్టుక మానవుని జన్మ ఎక్కడ ఏ విధంగా జరగాలి ఎవరి కడుపున ఎలా పుట్టాలి అనేది గర్భంలోనికి ప్రవేశించక ముందే నిర్ణయించబడి ఉంటుంది.
(01:14) అతడు గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా ఈ జన్మలో ఎక్కడ ఎవరికి ఈ ఇంట్లో పుట్టాలి అనేది విధాత నిర్ణయిస్తారు. దీనిని ఎవరు మార్చలేరు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ధనవంతుల ఇంట్లో వారి పిల్లలు బుద్ధివిహీనంతోనూ అంగవైకల్యంతోను పుడుతూ ఉంటారు. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్న ఏది వారు అనుభవించలేరు. వారు గత జన్మలో చేసిన పాపపు కర్మలకు ఫలితంగా వారు ఈ జన్మలో ఇలా జన్మించవలసి వచ్చింది.
(01:42) అది కర్మఫలం అంటే దీనిని ఎవరు మార్చలేరు. జ్ఞానం అతడు ఎంత బుద్ధితో జ్ఞానంతో ఉండాలి అనేది ముందుగానే లికించబడి ఉంటుంది. ఒక గురువు తన శిష్యులు అందరికీ ఒకే విధంగానే జ్ఞానాన్ని పంచుతాడు. వారిలో ఒకరు మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదిస్తే మరొకరు మాత్రం మందమతిగానే ఉంటూ చెడు సహవాసాలకు అలవాటు పడి అందరి చేత చీదరించుకుంటూ ఉంటాడు.
(02:08) ఒక వ్యక్తిత్వం జ్ఞానం అనేది అతడు గత జన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడి ఉంటాయి. వివాహం మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలి అనేది ఆ విధాత ముందే నిర్ణయిస్తాడు. అతని తలరాత ఆధారంగానే ఎటువంటి జీవిత భాగస్వామి అతని జీవితంలోకి రావాలి. ముందుగానే నిర్ణయం ఉంటుంది. దీనిని ఎవరు తప్పించలేరు. ఐశ్వర్యం అతని వద్ద ఎంత ధనం ఉండాలి? ఆ వ్యక్తి ధనవంతుడిగా ఉండాలా లేక పేదవాడిగా ఉండాలా? అతడు పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడి ఉంటుంది.
(02:42) కొంతమందికి ఎంత కష్టపడినా ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాదు. కొంతమంది పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఏ పని చేసినా బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఇదంతా కర్మఫలం అనుసరించే జరుగుతూ ఉంటుంది. సంతానం ఒక వ్యక్తికి ఎంతమంది సంతానం కలగాలి. ఆ సంతానం ఎటువంటి వారై ఉండాలి? అనేది వాళ్ళ పాప పుణ్యాలను బట్టి నిర్ణయింపబడి ఉంటుంది.
(03:09) మరణం మానవుడికి మరణం అనేది ఎప్పుడు ఎలా ఏ విధంగా సంభవిస్తుంది అనే విషయానికి ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. అతడు రోగాల బారిన పడి బాధ పడుతూ మరణించాలా లేక హాయిగా సహజ మరణం పొందాలా లేక ప్రమాదం బారిన పడి మృతిడిలోకి చేరాలా అనేది ఆ వ్యక్తి గత జన్మలో చేసిన కర్మలను బట్టి నిర్ణయించబడి ఉంటుంది.

No comments:

Post a Comment